S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2017 - 01:58

హైదరాబాద్, ఏప్రిల్ 30: రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి నియంత్రణ), అభివృద్ధి చట్టం మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ చరిత్రాత్మక చట్టంతో ఇంటి కొనుగోలుదారుడే రారాజు కాబోతున్నాడని ఆయన చెప్పారు.

05/01/2017 - 01:46

అమరావతి, ఏప్రిల్ 30: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన తర్వాత నంద్యాల టిడిపి అభ్యర్థి ఎవరనేది ఖరారు కానుంది. సీటు ఆశిస్తున్న శిల్పా మోహన్‌రెడ్డి, భూమా కుటుంబానికి సలహాదారైన ఎవి సుబ్బారెడ్డి ఆదివారం చంద్రబాబును కలిశారు. తనకు సీటు ఇవ్వకపోతే రాజకీయంగా దెబ్బతింటానని, ఇనే్నళ్లు సంపాదించుకున్న వర్గం, ఇమేజ్ పోతుందని బాబుకు శిల్పా చెప్పారు.

05/01/2017 - 01:45

అమలాపురం, ఏప్రిల్ 30: రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరతను అధిగ మించేందుకు మరో 800 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు డిజిపి ఎన్ సాంబశివరావు తెలిపారు. ఆదివారం అమలాపురంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇప్పటికే ఆరు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు.

05/01/2017 - 01:44

అమరావతి, ఏప్రిల్ 30: రైతు సమస్యలపై వైసిపి అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గుంటూరు నల్లపాడు రోడ్డులో నేడు, రేపు నిరాహార దీక్ష చేయనున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు, రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి మాట తప్పడాన్ని నిరసిస్తూ ఆయన ఈ దీక్ష చేపడుతున్నారు. దీక్షకు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి రైతులను సమీకరించేందుకు వైసిపి నేతలు ఏర్పాట్లు చేశారు.

05/01/2017 - 01:51

విజయవాడ, ఏప్రిల్ 30:పవిత్ర కృష్ణానది విజయవాడ నగరంలో వ్యర్థాలతో వెలువడే కలుషిత నీటితో కలసి మూసీ నదిలా మారుతోంది. ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి నగరం నడిబొడ్డులో వేర్వేరు ప్రాంతాలకు ప్రవహించే రైవస్, ఏలూరు, బందరు కాలువలు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. మంచినీటి కోసం ఈ కాలువలపై ఆధారపడ్డ దాదాపు 420 గ్రామాలకు చెందిన లక్షలాది మంది అనారోగ్యం పాలవుతున్నారు.

05/01/2017 - 01:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఆసియాలో అతి వేగంగా మిలటరీ అవసరాలు మారుతున్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని భారత వాయుసేన తన సైన్యాన్ని ఆదేశించింది. ఒక వేళ యుద్ధం వస్తే పాకిస్తాన్‌తో కనీసంగా పది రోజులు, చైనాతో 15రోజుల పాటు తలపడేందుకు అన్నివిధాలా సన్నద్ధం కావాలని వౌఖికంగా ఉత్తర్వులు వెళ్లాయి.

05/01/2017 - 01:37

మొహాలీ, ఏప్రిల్ 30: హోం గ్రౌండ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆదివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చెలరేగిపోయింది. ప్రత్యర్థిని కేవలం 67 పరుగులకు కట్టడి చేసి, ఆతర్వాత ఇంకా 73 బంతులు మిగిలి ఉండగానే, పది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. అన్ని రకాలుగా విఫలమైన డేర్‌డెవిల్స్ చిత్తుచిత్తుగా ఓడింది.

05/01/2017 - 01:22

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చరిత్రలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ మూడో అత్యల్ప స్కోరును ఆదివారం నమోదు చేసింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 17.1 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలి, అత్యల్ప స్కోర్ల జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఈసారి పోటీల్లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

05/01/2017 - 01:20

ఇపో (మలేసియా), ఏప్రిల్ 30: ప్రతిష్ఠాత్మక అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని భారత్ 3-0 తేడాతో గెలిచింది. డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను ఢీకొన్న భారత్ 2-2గా డ్రా చేసుకుంది.

05/01/2017 - 01:18

లండన్‌లో జరిగిన హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైట్‌లో ప్రత్యర్థి వ్లాదిమీర్ క్లిచ్కోపై రైట్ హుక్ సంధిస్తున్న బ్రిటిష్ బాక్సర్ ఆంథోనీ జాషువా. ఈ ఫైట్‌ను 11వ రౌండ్ వద్ద నిలిపేసిన న్యాయమూర్తులు జాషువాను విజేతగా ప్రకటించారు. 41 ఏళ్ల క్లిచ్కోపై మొదటి నుంచి ఆధిపత్యం కనబరచిన 27 ఏళ్ల జాషువా తన బలమైన పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఒక్క పరాజయం కూడా లేకుండా 19 ఫైట్స్‌ను పూర్తి చేశాడు.

Pages