S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2017 - 01:15

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తప్పనిసరిగా ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలనా వ్యవహారాలను చూసేందుకు సుప్రీం కోర్టు నియమించిన అధికారుల కమిటీ (సిఒఎ) సభ్యుడు, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పష్టం చేశాడు. ఎనిమిది జట్లు తలపడే ఈ టోర్నమెంట్ ఇంగ్లాండ్‌లో జూన్ ఒకటిన మొదలవుతుంది. అందులో పాల్గొనే మిగతా దేశాలు ఇప్పటికే తమతమ జట్లను ప్రకటించాయి.

05/01/2017 - 01:13

ఉహాన్, ఏప్రిల్ 30: ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె రెండో సీడ్ అకానే యమాగుచీని 18-21, 21-11, 21-18 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా, మిగతా రెండు సెట్లలో అద్వితీయ ప్రతిభ కనబరచి విజేతగా నిలిచింది.

05/01/2017 - 01:09

భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను ఇరాక్ నుండి ఏ సంబంధం లేకపోయినా పాకిస్తాన్ వారు అపహరించి గూఢచారి అనే సాకుతో సైనిక కోర్టులో విచారణ జరపడం దారుణం. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, భారత్‌ను భయభ్రాంతులను గురిచేయాలనే దురుద్దేశంతో జాదవ్‌కు పాకిస్తాన్ మరణశిక్షను విధించింది. ఆ శిక్షను అమలుపరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండగలవని భారత్ హెచ్చరించినా పాక్ ఏ మాత్రం చలించలేదు.

05/01/2017 - 01:07

మన దేశంలో ‘ఆర్థిక సర్వే 2016-17’ సార్వత్రిక మూల ఆదాయాన్ని ప్రతిపాదించినది. ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో పేదరికం, నిరుద్యోగం ముఖ్యమైనవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ దాదాపు 20 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువనున్నారు. శ్రామిక శక్తిలో 10 శాతం నిరుద్యోగం, అల్ప ఉద్యోగితకు గురవుతున్నారు.

05/01/2017 - 01:06

వెనుకటికి ‘వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నాడో లేదో తెలియదు’ కానీ- ప్రస్తుతం చైనావాడు మాత్రం పాకిస్తాన్ గాడిదల సేవలకి సిద్ధంగా ఉన్నాడన్నది ఒక ప్రముఖ వార్త! సరే, చాలాకాలంగా చైనాకి పాకిస్తాన్ నుంచి గార్ధ్భ చర్మాలు చాలావరకు దొంగ రవాణా చేస్తున్న ముఠాలు నాలుగందాల లాభాలు చేసుకుంటున్నారు.

05/01/2017 - 01:04

‘అటెండర్ నుంచి కలెక్టర్ వరకూ ప్రభుత్వ ఉద్యోగులంతా తమ పిల్లల్ని విధిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, లేకుంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండవం’టూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్న మాటలు ఆలోచించదగ్గవే. గత ఏడాది అలహాబాద్ హైకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలనే చేసింది. ఆదిత్యనాథ్‌లా మాట్లాడే నాయకులు దేశ వ్యాప్తంగా ఎంతోమంది వున్నారు.

05/01/2017 - 01:03

మిరపకాయలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో సహనం కోల్పోయిన అన్నదాత కదనవదనుడయ్యాడు, కడుపు కృషీవలుడు కార్చిచ్చుగా మారాడు. ఈ దవాగ్ని ఖమ్మంలోని టోకు విపణి ప్రాంగణంలోకి దూకడం మిక్కిలి దురదృష్టకరం. హింసాకాండను నిరసించడం నాగరిక లక్షణం, ప్రభుత్వ విధి. అందువల్ల ఖమ్మం ‘మార్కెట్’లో ‘రైతులు’ మిరప కాయల పొగపెట్టడం ప్రభుత్వం అభిశంసనకు గురవుతోంది!

05/01/2017 - 01:00

మచిలీపట్నం, ఏప్రిల్ 30: బందరు ఓడరేవు నిర్మాణం దృష్ట్యా ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఏర్పడనున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రం మచిలీపట్నంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్ర జాతీయ కళాశాల వేదికగా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

05/01/2017 - 00:59

కూచిపూడి, ఏప్రిల్ 30: రెండు వేల యాభై ఎకరాల విస్తీర్ణం కలిగిన బార్లపూడి ఛానల్ పూడికతీసి గతంలో ఉన్న పైపులను తొలగించి పెద్ద సైజు పైపులను వేసి వేలాది మంది రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొవ్వ మండల పరిధిలోని 150 బార్లపూడి ఛానల్ కృష్ణా డెల్టాలోని మేడూరు ఛానల్ పరిధిలో సబ్ కాలువగా కృష్ణాపురంలో ప్రారంభమైంది.

05/01/2017 - 00:58

మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 30: జగద్గురువు, ఆద్వైత సిద్ధాంత నిర్దేశకుడు ఆది శంకరాచార్యుల జయంతిని ఆదివారం స్థానిక గొడుగుపేట శంకరమఠంలో వైభవంగా నిర్వహించారు. శంకరమఠం పాలకవర్గ నిర్వాహకుడు పురాణం రామకృష్ణ శాస్ర్తీ ఆధ్వర్యంలో వేద పండితులు, వేద విద్యార్థులు వివిధ శ్లోకాలతో స్వామివారిని అర్చించారు.

Pages