S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2017 - 08:33

లోక్‌సభలో ప్రభుత్వం స్పష్టీకరణ

03/23/2017 - 08:31

న్యూఢిల్లీ, మార్చి 22: ఇకనుంచి డిగ్రీ సర్ట్ఫికెట్లపై విద్యార్థి ఫొటో, ఆధార్ నెంబర్‌లు తప్పనిసరి చేయనున్నారు. బోగస్, నకిలీ సర్ట్ఫికెట్లను నిరోధించడంలో యుజిసి ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలకు యుజిసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

03/23/2017 - 08:30

న్యూఢిల్లీ, మార్చి 22: రైల్వేశాఖ చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అవుతామని 17 రాష్ట్రాలు ముందుకొచ్చాయని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. బుధవారం లోక్‌సభలో మంత్రి మాట్లాడుతూ వౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పలు అనుంబంధ ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

03/23/2017 - 07:57

న్యూఢిల్లీ, మార్చి 22: రిటైల్ వ్యాపార విభాగం డి-మార్ట్ నిర్వహణదారైన అవెన్యూ సూపర్‌మార్ట్స్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణన్ దమని.. దేశంలోని టాప్-20 ధనవంతుల జాబితాలో చేరారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ల లిస్టింగ్ జరగగా, మదుపరులను అవి విపరీతంగా ఆకట్టుకున్నది తెలిసిందే. తొలిరోజే షేర్ విలువ ఏకంగా 114 శాతానికిపైగా లాభపడింది.

03/23/2017 - 07:56

న్యూఢిల్లీ, మార్చి 22: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. జిఎస్‌టి అమలుతో ఆయా వస్తువుల ధరలు తగ్గి చౌకవుతాయన్న ఆయన పన్ను ఎగవేతదారులకు కళ్లెం వేసినట్లు కూడా అవుతుందని అన్నారు.

03/23/2017 - 07:55

హైదరాబాద్, మార్చి 22: యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ టిఐఎఫ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే రోల్ మోడల్‌గా అభివృద్ధి చేస్తామని టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. సుమారు 370 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ పార్కులో వరల్డ్ క్లాస్ వౌలిక సదుపాయాలను కల్పించి ఏడాదిలోగా ఉత్పత్తులు ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు చెప్పారు.

03/23/2017 - 07:55

హైదరాబాద్, మార్చి 22: క్వాల్‌కామ్ కంపెనీ, టి-హబ్‌తో బుధవారం వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే వేగవంతంగా స్టార్టప్స్ ఏర్పాటుకు దోహదపడేలా పనిచేస్తున్న టి-హబ్‌తో తాము చేసుకున్న ఒప్పందం వల్ల భవిష్యత్ ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉంటాయని క్వాల్‌కామ్ ఇంటర్నేషనల్ ఏషియా పసిఫిక్, ఇండియా ప్రెసిడెంట్ జిమ్ కాథే తెలిపారు.

03/23/2017 - 07:53

న్యూఢిల్లీ, మార్చి 22: బ్రిటన్ నుంచి భారత్‌కు కార్ల ఎగుమతులు గడచిన ఏడేళ్లలో దాదాపు 11 రెట్లు పెరిగాయి. టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ లాండో రోవర్ (జెఎల్‌ఆర్) ఈ ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు బ్రిటన్ మోటార్ తయారీదారులు, వాణిజ్య సంఘం తెలిపింది.

03/23/2017 - 07:53

రాజమహేంద్రవరం, మార్చి 22: వర్జీనియా పొగాకు రైతులు ఈసారైనా గిట్టుబాటు ధర దక్కేనా? అని ఎదురుచూస్తున్నారు. గిట్టుబాటు ధర లేక ఏటేటా ఉత్తర నల్లరేగడి నేలల్లో వర్జీనియా పొగాకు సాగు తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. పొగాకు బోర్డు అనుమతించిన దానికంటే తక్కువ విస్తీర్ణంలో పండుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల పొగాకు సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

03/23/2017 - 07:52

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ వ్యాప్తంగా పది చోట్ల హెలిపోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఇటీవల ఆ ప్రతిపాదనలు సమర్పించింది.

Pages