S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2017 - 07:51

ముంబయి, మార్చి 22: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గ్రేడ్ ‘ఎ’ కాంట్రాక్టు లభించింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) బుధవారం సెంట్రల్ కాంట్రాక్టులను ఖరారు చేసింది. ఆటగాళ్ల కాంట్రాక్టు ఫీజును భారీగా పెంచింది. కోహ్లీ, ధోనీసహా మొత్తం ఏడుగురికి ‘ఎ’ గ్రేడ్‌లో కాంట్రాక్టు లభించింది. ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లకు ఇకపై రెండు కోట్ల రూపాయల ఫీజు లభిస్తుంది.

03/23/2017 - 07:50

మెల్బోర్న్, మార్చి 22: ధర్మశాలలో జరిగే చివరి, నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుందని, ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే ఆ పిచ్‌పై భారత్‌కు కష్టాలు తప్పవని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ జోస్యం చెప్పాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ధర్మశాల వికెట్‌పై ఉన్న పచ్చిన పేసర్లకు ఉపయోగపడుతుందని అన్నాడు.

03/23/2017 - 07:42

న్యూఢిల్లీ, మార్చి 22: కొన్ని సభ్య సంఘాలు ఒకవైపు భారీ మొత్తాల్లో నిధులు ఉంచుకొని, మరోవైపు నిధుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయని సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో పాలనాధికారుల కమిటీ (సిఒఎ) పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పిసిఎ), సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్‌సిఎ) పెట్టుకున్న దరఖాస్తులను ఆ నివేదికలో పేరొంది.

03/23/2017 - 07:37

ధర్మశాల, మార్చి 22: ఆస్ట్రేలియాతో ఈనెల 25వ తేదీ, శనివారం నుంచి మొదలయ్యే చివరి, నాలుగో టెస్టులో టీమిండియా మీడియం పేసర్ మహమ్మద్ షమీకి చోటు దక్కే అవకాశాలున్నాయి. నిరుడు నవంబర్‌లో ఇంగ్లాండ్‌తో మొహాలీలో మూడో టెస్టు ఆడుతున్న సమయంలో షమీ మోకాలికి గాయమైంది. దీనితో అతను మిగతా రెండు టెస్టుల్లో ఆడలేదు. ఆస్ట్రేలియాతో ఇంత వరకూ జరిగిన మూడు టెస్టుల్లోనూ అతనికి స్థానం లభించలేదు.

03/23/2017 - 07:22

హైదరాబాద్, మార్చి 22: రాష్ట్ర శాసనసభలో మున్సిపల్ వ్యవహారాల పద్దుపై బుధవారం చర్చ జరిగిన సందర్భంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్, బిజెపి వాకౌట్ చేశాయి. మిషన్ భగీరథ, ఓఎఫ్‌సి కేబుల్ కలిపేస్తున్నారని, ఈ కాంట్రాక్టులో 10 వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై విచారణకు సభాకమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

03/23/2017 - 07:21

హైదరాబాద్, మార్చి 22: దేశంలోనే సమశీతోష్ణ దక్కన్ ప్రాంతమైన తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో క్రమేణా చోటు చేసుకున్న పెనుమార్పుల వల్ల ఆకస్మిక వరదలు, కరువుకాటకాలు, దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. దీనికి కారణం గత ప్రభుత్వాలు సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడమేనని అన్నారు.

03/23/2017 - 07:20

హైదరాబాద్, మార్చి 22: దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సికిందరాబాద్‌లోని లాలాగూడ రైల్వే క్యారేజ్ వర్కుషాప్‌కు ‘గ్రీన్‌కో-సిల్వర్ రేటింగ్’ అవార్డు లభించింది. కాన్ఫడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఆధ్వర్యంలో భారత రైల్వే శాఖ ఈ అవార్డును ప్రకటించింది. బుధవారం న్యూఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి సురేష్ భు చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఈ అవార్డును అందుకున్నారు.

03/23/2017 - 07:19

గుంటూరు, మార్చి 22: ప్రపంచ జలవనరుల దినోత్సవం ఏపి శాసనసభలో జగడానికి కారణమయింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది.. ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి మాట్లాడేందుకు రెండు నిముషాల వ్యవధి కేటాయించాలని స్పీకర్‌ను కోరారు. అందుకు స్పీకర్ కోడెల శివప్రసాద రావు నిరాకరించారు. సభా నాయకుడు ప్రసంగించిన అనంతరం అనుమతి ఉంటుందన్నారు.

03/23/2017 - 07:18

విశాఖపట్నం, మార్చి 22: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు సూచనలు హర్షించతగ్గ పరిణామమని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. విశాఖలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామమందిర నిర్మాణానికి సంబంధించి కోర్టు వెలుపల చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సర్వోత్తమ న్యాయస్థానం సూచించడాన్ని ఆయన స్వాగతించారు.

03/23/2017 - 07:17

హైదరాబాద్, మార్చి 22: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచాల్సి ఉందని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. మున్సిపల్ పద్దులపై శాసనసభలో బుధవారం జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆస్తి పన్ను పెంచకపోతే మున్సిపాలిటీలకు అవసరమైన నిధులు లభించవని, దాంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఇబ్బంది అవుతుందన్నారు.

Pages