S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2017 - 07:16

న్యూఢిల్లీ, మార్చి 23: ప్రాణికోటికి జీవనాధారమైన ప్రతి నీటి బొట్టును పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌లో ఇచ్చిన ఓ సందేశంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. అంతేకాక ‘వ్యర్థ జలాలను’ ఈ ఏడాది తన థీమ్‌గా ఎంచుకున్నందుకు ఐక్యరాజ్య సమితిని ఆయన అభినందించారు.

03/23/2017 - 07:13

న్యూఢిల్లీ, మార్చి 22: ఉమ్మడి హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల తెలంగాణ న్యాయవాదులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ఉమ్మడి ఏపీ భవన్‌ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 52:48 నిష్పత్తిలో పంచుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచించిందని దీనిపై త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకొంటారని ఆయన వెల్లడించారు.

03/23/2017 - 07:11

న్యూఢిల్లీ, మార్చి 22: వయోవృద్ధులు రైల్వే టికెట్లపై రాయితీలు పొందడానికి ఆధార్ నంబరు తప్పనిసరి కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు లోక్‌సభలో ఈ మేరకు వివరణ ఇచ్చారు. అయితే వృద్ధుల వివరాలతో కేంద్రం ఒక డేటాబేస్‌ను రూపొందిస్తోందని ఆయన చెప్పారు. వయో వృద్ధులు రైల్వే టికెట్లపై రాయితీ పొందడానికి ఆధార్ నంబరును తప్పనిసరి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే.

03/23/2017 - 07:03

చుక్కల భూముల బిల్లుకు ఓకె ఆక్రమణలో ఉన్న నివేశన స్థలాల క్రమబద్ధీకరణ
రియల్ ఎస్టేట్ లాండ్ డెవలప్‌మెంట్ రూల్స్ ముసాయిదా రూపకల్పన ఫిషరీస్ ఓషన్ వర్శిటీకి ఆమోదం
డిపాజిటర్ల రక్షణ కోసం ప్రత్యేక బిల్లు రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు

03/23/2017 - 07:02

విజయవాడ, మార్చి 22: రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల వ్యవహారంపై బుధవారం శాసనసభ దద్దరిల్లింది. ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలతోపాటు రైతుల ఆత్మహత్యలపై కూడా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సభలో తప్పుడు లెక్కలు చెబుతున్నారంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన అధికారిక గణాంకాలను సభ దృష్టికి తెచ్చారు.

03/23/2017 - 07:00

నోట్ సిద్ధం చేస్తున్న హోం శాఖ
త్వరలోనే కేబినెట్ ఆమోదానికి..
ఈ సమావేశాల్లోనే బిల్లు: రాజ్‌నాథ్
తెలంగాణలో 119 నుంచి 153కు
ఆంధ్రలో 175 నుంచి 225కు

03/23/2017 - 07:59

న్యూఢిల్లీ, మార్చి 22: వ్యవసాయంపై పన్ను విధించేది లేదని, భవిష్యత్‌లోనూ అలాంటి ఆలోచనే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. నగదు లావాదేవీల పరిమితిని రెండు లక్షలకు కుదించామని, ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ తప్పనిసరి చేశామన్నారు.

03/23/2017 - 06:59

న్యూఢిల్లీ, మార్చి 22: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవనాన్ని ఏర్పాటు చేసి వౌలిక సదుపాయాలు కల్పిస్తే రాష్ట్ర హైకోర్టును తక్షణం ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.

03/23/2017 - 06:58

న్యూఢిల్లీ, మార్చి 22:జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని చేపట్టి ఏళ్లు గడుస్తున్నా కరువు పీడిత రాష్ట్రాల్లో ఇంత వరకూ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ సహా తొమ్మిది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సుప్రీం కోర్టు బుధవారం సమన్లు పంపింది.

03/23/2017 - 06:57

బ్రిటన్, మార్చి 22:బ్రిటన్ పార్లమెంట్‌పై దాడికి బుధవారం విఫలయత్నం జరిగింది. వెస్ట్‌మినిస్టర్ వంతెనపై అతివేగంగా కారునడుపుకుంటూ వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లోకి దూసుకొచ్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. కాల్పులు, కత్తిపోటు దాడి సంఘటనల్లో ఇద్దరు మరణించారు. పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ దాడిని ఉగ్రవాద ఘటనగా అధికారులు పేర్కొన్నారు.

Pages