S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/16/2017 - 02:35

హైదరాబాద్, జనవరి 15: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించి, నామినేషన్ దాఖలు చేసిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్‌కు చుక్కెదురైంది. అజర్ దాఖలు చేసిన నామినేషన్‌ను హెచ్‌సిఎ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నెల 17న హెచ్‌సిఎకు ఎన్నికలు జరగనున్నాయి.

01/16/2017 - 02:33

న్యూఢిల్లీ, జనవరి 15: జాతీయవాదం అనే పదానికి ప్రస్తుతమున్న నిర్వచనానికి సరికొత్త భాష్యం చెప్పేందుకు ప్రయత్నాలను ప్రారంభించిన ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) అధ్యాపకులు, ‘దేశం నిజంగా తెలుసుకోవాల్సింది ఏమిటి?’ (వాట్ ది నేషన్ రియల్లీ నీడ్స్ టు నో) అనే పేరుతో ఒక పుస్తకాన్ని రూపొందించారు.

01/16/2017 - 02:32

సికిందరాబాద్, జనవరి 15: ప్రయాణికుల భద్రతతోపాటు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సికిందరాబాద్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మధ్యనే జిఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అధికారుల నుంచి ముందుగా వివరాలు తెలుసుకొని, అనంతరం స్టేషన్‌కు తనిఖీలకు వెళ్లారు.

01/16/2017 - 02:29

కాకినాడ, జనవరి 15: కాకినాడ సమీపంలోని కోరంగి (కోరింగ) అభయారణ్యం కాకినాడ ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో ప్రధాన ఆకర్షణగా నిలచింది. అభయారణ్యంలోని అరుదైన వలస పక్షులు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. కాకినాడ నగరంలో వాకలపూడి తీరంలో ఈనెల 12 నుండి ప్రారంభమైన బీచ్ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. బీచ్ ఫెస్టివల్‌కు వచ్చిన పర్యాటకుల్లో వేలాది మంది అభయారణ్యాన్ని సందర్శించారు.

01/16/2017 - 02:09

కొచుబేరియా, జనవరి 15: పశ్చిమ బెంగాల్‌లోని గంగా సాగర్ జాతరలో అదివారం తొక్కిసలాట జరిగి ఒక మహిళతో సహా 8 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

01/16/2017 - 02:08

న్యూఢిల్లీ, జనవరి 15: సీనియర్ రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుర్జీత్‌సింగ్ బర్నాలా (91) శనివారం కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పంజాబ్‌లో తీవ్రవాదం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత బర్నాలాది. 1985లో రాజీవ్-లోంగోవాల్ ఒప్పందం తరువాత రెండు సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

01/16/2017 - 02:07

న్యూఢిల్లీ, జనవరి 15: లోక్‌పాల్ చట్టం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించడానికి గడువును ప్రభుత్వం నిరవధికంగా పొడిగించింది. ఈ విషయమై కేంద్రం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసేంత వరకు ఉద్యోగులు ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించవలసిన అవసరం లేదు. మామూలుగా అయితే వీటిని సమర్పించడానికి గడువు డిసెంబర్ 31.

01/16/2017 - 02:07

న్యూఢిల్లీ, జనవరి 15: ఎన్డీటీవీ కన్సల్టెంట్ ఎడిటర్ బర్ఖాదత్ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 21 సంవత్సరాలుగా ఎన్డీటీవీలో పనిచేసిన బర్ఖాదత్ కొత్త అవకాశాలను వెతుక్కుంటూ, కొత్త ప్రాజెక్టుల్లో పనిచేయాలని భావిస్తున్నట్లు ఆమె తన రాజీనామా అనంతరం వెల్లడించారు. ఇటీవలే ఆమె వాషింగ్టన్‌పోస్ట్ ప్రపంచ అభిప్రాయ విభాగంలో కాలమిస్టుగా చేరారు.

01/16/2017 - 02:06

న్యూఢిల్లీ, జనవరి 15: సిబిఐ చీఫ్‌ను నిర్ణయించడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం సమావేశం కానుంది. గత డిసెంబర్ 2న అనిల్ సిన్హా రిటైరయినప్పటినుంచి నెల రోజులకు పైగా సిబిఐ చీఫ్ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి రాకేశ్ ఆస్తానా తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతున్నారు.

01/16/2017 - 02:05

న్యూఢిల్లీ, జనవరి 15: కోర్టులో వ్యాజ్యం అంటేనే ఇప్పట్లో తెగదులే అనే భావన నెలకొని ఉంది. దశాబ్దం దాటిన కేసులు దేశంలో వేలల్లో ఉన్నాయి. అయితే అతి పురాతనమైన వ్యాజ్యాలలో ఒకటయిన ఒక ఆస్తుల కేసు సుమారు అయిదు దశాబ్దాల తరువాత ఎట్టకేలకు పరిష్కారమయింది. ఎవరి వాటా ఎంతో తేల్చిన ఢిల్లీలోని ఓ కోర్టు వాటికి అనుగుణంగా మూడు భవనాలను పరస్పర అంగీకారంతో విభజించుకోవాలని కక్షిదారులకు సూచించింది.

Pages