S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/16/2017 - 00:53

విజయవాడ, జనవరి 15: వెలగపూడిలోని సచివాలయానికి వచ్చే సందర్శకులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సొంతగడ్డపై పరిపాలన సాగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల నెరవేరినప్పటికీ వివిధ పనుల మీద వచ్చే సందర్శలకు అది ‘వెతలపూడి’గా భయపెడుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రోజుకు సగటున 1000 మంది వరకూ సందర్శకులు సచివాలయానికి వస్తున్నారు. సందర్శకులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య రవాణా.

01/16/2017 - 00:52

విజయవాడ (కల్చరల్), జనవరి 15: మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ అన్నారు. మహానటి సావిత్రి కళాపీఠం అనుబంధ సంస్థగా నెలకొల్పిన అమ్మ జయలలిత కళాపీఠం ప్రారంభ కార్యక్రమంగా శనివారం రాత్రి గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

01/16/2017 - 00:51

తోట్లవల్లూరు, జనవరి 15: సుప్రీం కోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేసి మండలంలో యథేచ్ఛగా కోడి పందాలు నిర్వహించారు. మూగ జీవాల రక్తంతో మరోమారు నేల తడిసింది. చట్టాలు మూగబోయాయి... సంప్రదాయానికే మా మద్దతన్న నేతల మాటలే నెగ్గాయి. కోడిపందేలను ఆరు నూరైనా అడ్డుకుంటామన్న పోలీసులు కీలక ఘట్టానికి వచ్చేసరికి చేతులెత్తేశారు. వెరసి... మండల వ్యాప్తంగా కోడిపందేలు యథేచ్ఛగా సాగిపోయాయి.

01/16/2017 - 00:51

పాయకాపురం, జనవరి 15: గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున స్థానిక పైపుల రోడ్డు సెంటర్‌లోని రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 20ఏళ్లుగా ఉన్న ఈ విగ్రహం ధ్వంసం కావటం పట్ల రంగా అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విగ్రహం ధ్వంసం అయిన విషయాన్ని తెలుసుకున్న రంగా తనయుడు, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా సంఘటనా స్థలానికి వచ్చి స్థానికుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

01/16/2017 - 00:50

మచిలీపట్నం, జనవరి 15: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో నిర్వహించిన కోడి పందాలు, జూద క్రీడల ద్వారా రూ.100 కోట్ల మేర చేతులు మారినట్లు సమాచారం. సంప్రదాయ ముసుగులో నిర్వహించిన కోడి పందాలు, పేకాట, చిన్న బజారు-పెద్ద బజారు, గుండాట, నెంబర్లాట తదితర జూద క్రీడలు పండుగ మూడు రోజుల పాటూ కొనసాగాయి. జిల్లాలోని విజయవాడ, బందరు, గుడివాడ, నూజివీడు డివిజన్‌లలో భారీ స్థాయిలో జూదాలు జరిగాయి.

01/16/2017 - 00:49

మోపిదేవి, జనవరి 15: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో మూడు రోజులుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. దివిసీమ ప్రాంతానికి చెందిన పందెపు రాయుళ్లతో పాటు ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పందెపు రాయుళ్లు వెంకటాపురం గ్రామంలో జరుగుతున్న కోడి పందాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దా.. చిన్నా ... అందరి చేతిలో పందెం కోళ్లు కనిపిస్తుండగా కోలాహల వాతావరణం కనబడింది.

01/16/2017 - 00:49

అవనిగడ్డ, జనవరి 15: సంక్రాంతి సంబరాలను దివిసీమలో ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి, కనుమ పర్వదినాలను పురస్కరించుకుని పలు చోట్ల ఇళ్ల ముందు అందమైన రంగవల్లులు వేశారు. యువకులు, చిన్నారులు గాలి పటాలను ఎగురవేశారు. పలువురు మహిళలు రకరకాల పిండి వంటకాలు చేశారు. కొత్త అల్లుళ్లతో ఇళ్లన్నీ కళకళలాడాయి. పలుచోట్ల సరదాగా కోడి పందాలు వేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

01/16/2017 - 00:48

మైలవరం, జనవరి 15: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను నేటి తరాలకు తెలియజెప్పేందుకే రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కేతేపల్లి సూరిబాబు అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతియేటా మాదిరిగానే ఈయేడాది కూడా మండల ఆర్యవైశ్య సంఘం, వాసవీ మహిళా మండలి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కోదండరామాలయం వీధిలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు.

01/16/2017 - 00:47

ఎచ్చెర్ల, జనవరి 15: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన హ్యాపీసండే కార్యక్రమాలను మండలంలోని కొత్తపేట గ్రామంలో నిర్వహించారు. జిల్లా విశ్రాంతి న్యాయమూర్తి పప్పల జగన్నాథరావు, సర్పంచ్ పొన్నాడ తులసమ్మ, ఎంపిటీసీ అనె్నపు వరలక్ష్మీ పర్యవేక్షణలో ఈకార్యక్రమం సందడిగా జరిగింది. సంక్రాంతి పర్వదినాలు కావడం వలన గ్రామానికి వచ్చిన బంధువులు, ఆత్మీయులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

01/16/2017 - 00:45

ఖమ్మం, జనవరి 15: కూతలేదు... కొక్కు పట్టదు... కాలు దువ్విందంటే రణరంగమే... అదేంటనుకుంటున్నారా... సంక్రాంతి వేడుకల పేరుతో బడాబాబులు నిర్వహించే రాక్షస క్రీనీడ... దాని ముద్దుపేరు సరదా కోడిపందాలు. జిల్లా సరిహద్దులోని పలు గ్రామాలలోనే గత రెండురోజులుగా జోరుగా సాగిన పందాలలో కోటి రూపాయలకు పైగానే డబ్బులు చేతులు మారాయని తెలుస్తోంది.

Pages