S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/16/2017 - 00:43

తెనాలి, జనవరి 15: పెద్దనోట్ల రద్దు తరువాత దేశంలో సామాన్యుల నగదుకు భరోసా కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైయ్యాయని ఉమ్మడిరాష్ట్ర మాజీ స్పీకర్, పిసిసి ఉపాధ్యక్షులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

01/16/2017 - 00:42

కాకినాడ, జనవరి 15: కాకినాడ బీచ్ ఫెస్టివల్-2017 వాకలపూడి ఎన్టీఆర్ తీరంలో ఆదివారం రాత్రి ముగిసింది. కాకినాడ-ఉప్పాడ తీర మార్గం వెంబడి, హరిత రిసార్ట్స్, వాకలపూడి రోడ్డు తదితర ప్రాంతాల్లో పొద్దుపోయినా పర్యాటకుల హడావుడి కనిపించింది. సాగర తీరంలో సాంస్కృతిక సంబరాన్ని ప్రజలు తిలకించి ఆనందించారు. ఈనెల 12 నుండి ఆదివారం రాత్రి వరకు ఎన్టీఆర్ సాగర తీరంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.

01/16/2017 - 00:41

రాజమహేంద్రవరం, జనవరి 15: కోడి పందేలు..పొట్టేళ్ళ పందా లు..పందుల పందేలు..మట్కా జూదాలు..పేకాట శిబిరాలు..అశ్లీల నృత్యాలు.. ఇటు ఎటు చూసినా చట్ట వ్యతిరేక విశృంఖలత్వంతో గత మూడు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి సంప్రదాయాల మాటున యథేచ్ఛచ్ఛగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగాయి. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో యథేచ్ఛగా కోడి పందేలు సాగాయి.

01/16/2017 - 00:39

విజయనగరం(టౌన్), జనవరి 15: వెనుకబడిన విజయనగరం జిల్లాలో పేదలకు డయాలసిస్ యూనిట్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈవైద్య సేవలు వినియోగించుకుంటున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దాదాపు మూడేళ్ల కిందట ప్రారంభించిన ఈ యూనిట్ ద్వారా నిత్యం పదుల సంఖ్యలో రోగులకు డయాలసిస్ వైద్య సేవలు అందిస్తున్నారు.

01/16/2017 - 00:37

ఏలూరు, జనవరి 15: ఇంతకుముందు ఎన్నడూ లేనిరీతిలో పందాల విషయంలో అనుమానాలు వచ్చినా వాటిని తోసిరాజంటూ ఈ సంక్రాంతి సీజన్‌లోనూ కోడిపుంజు పూర్తిస్ధాయి విజేతగా నిలిచింది. నేతల ప్రతిష్ఠను నిలబెడుతూనే ఖాకీలకు అప్రతిష్టను మూటగడుతూ, యంత్రాంగం ఏర్పాట్లను మంటగలుపుతూ ఈ మూడురోజులు పందాల జాతర సాగిపోయింది. వందల కోట్లలోనే నగదు చేతులు మారింది. అవికూడా కొత్త నోట్లే కావటం గమనార్హం.

01/16/2017 - 00:36

పోలవరం, జనవరి 15: పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తిచేయడం ద్వారా ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం పోలవరం వచ్చిన పట్టిసం ఎత్తిపోతల పథకాన్ని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రాజెక్టు వేగంగా పూర్తిచేసినందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు.

01/16/2017 - 00:36

జంగారెడ్డిగూడెం, జనవరి 15: సంక్రాంతి పేరుతో ఏజన్సీ, మెట్ట ప్రాంతాల్లో మూడు రోజులూ కోడి పందాలు, జూదాల జాతర విచ్చలవిడిగా జరిగింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ కోడి పందాలు నిర్వహించారు. కోడి పందాలతో పాటు రాత్రివేళల్లోనూ జూదాలు కొనసాగాయి. గ్రామ గ్రామాన పేకాట, గుండాటలు, కోడి పందాలు నిర్వహించారు.

01/16/2017 - 00:35

ఏలూరు, జనవరి 15: మొత్తం సంక్రాంతి సీజన్‌లో కోడిపందాలకు సంబంధించి రూపాయి పందెం కాయకుండానే భారీగా సంపాదించినవారు ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. వీరికి గెలుపోటములతో సంబంధం లేదు. పందెం జరిగితే చాలు డబ్బు వచ్చి పడుతుంది. ఈరకంగా 75వేల నుంచి రెండులక్షల వరకు సంపాదించిన వారెవరా అని అశ్చర్యపోనక్కర్లేదు. వీరంతా పందెం నిర్వహించేందుకు స్ధలాలు ఇచ్చినవారు.

01/16/2017 - 00:35

భీమవరం, జనవరి 15: సంప్రదాయ కోడి పందాల ముసుగులో ఈ ఏడాది జిల్లాలో డ్రాగన్ జూదాలు విచ్చలవిడిగా జరిగిపోయాయి. భోగి పండుగ నుంచి ఇవి ప్రారంభమయ్యాయి. ఈ మూడు రోజుల్లో జరిగిన జూదాల్లో రూ.కోట్లు చేతులు మారాయి. జిల్లాలోని డెల్టాలో కోడి పందాల బరుల వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేసి, వచ్చిన వారికి అవగాహన కల్పించి మరీ జూదం ఆడించారు. ఇప్పటివరకు సంప్రదాయ కోడి పందాల ముసుగులో కోతాట, గుండాట మాత్రమే జరిగేవి.

01/16/2017 - 00:32

విద్య అనేది వ్యక్తి అభ్యున్నతికి సోపానం. విద్యార్థులు, యువకులపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. విద్యార్థులకు పాఠశాల నిజంగా గుడి లాంటిది, ఉపాధ్యాయులే దేవుళ్లు. అయితే, బడిలాంటి గుడులు ఇపుడు శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కొన్ని ఊళ్లల్లో అయితే ఆరుబయటే విద్యాబోధన గావిస్తున్నారు. కొన్ని పాఠశాలలు ఒకే గదిలో ఒకటినుండి ఐదో తరగతి వరకు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి.

Pages