S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 22:37

శనివారం ఉదయం రాజిరెడ్డి పరవాడ వెళ్లి రాత్రికి తిరిగి రావడం నిజం కాదని దర్యాప్తులో తెలుసుకున్నాడు యుగంధర్. రాజిరెడ్డి శనివారం ఉదయం తన సెల్ నుంచి రాంప్రసాద్‌కి ఓ కాల్ చేశాడు. అలాగే మధ్యాహ్నం రెండుకి మరో కాల్ చేశాడు. రాంప్రసాద్‌ని కారులో ఎక్కించుకుని రాజిరెడ్డి తీసుకెళ్లడం రెండు గంటలకి డ్యూటీకొచ్చిన వాచ్‌మెన్ చూశాడు. ఆ శనివారం నెలలో రెండోది కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పని చెయ్యదు.

12/03/2016 - 22:28

కొద్దిలో అతను పట్టుపడేవాడే. చంపడానికి వచ్చిన ఎర్ల్ ఆ ఇంటి వెనుక పొదల్లో నక్కి ఆ ఇంటి వంకే చూస్తున్నాడు.
అరగంట క్రితం అతను ఛార్లీని చంపడానికి ఐదు నిమిషాల దూరంలో ఉండగా షెరీఫ్ ఫ్రెడ్ అడ్డంకి అయ్యాడు.
‘ఓ ఛార్లీ! తలుపు తెరు’ అన్న ఫ్రెడ్ మాటలు విన్న తక్షణం అతను ఛార్లీ ఇంట్లోకి ప్రవేశించే తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
‘లేదా నేను తలుపు విరక్కొట్టుకుని లోపలకి వస్తాను’

12/03/2016 - 22:18

‘వౌంట్ అబు’ - రాజస్థాన్‌లోని అత్యంత సుందరమైన హిల్‌స్టేషన్. రాజస్థాన్ అంటే విశాలమైన ఇసుక మేటలు వేసిన ఎడారులు, ఒంటెల సవారీ, రాజప్రాసాదాలు, వాటిని చుట్టుకుని వయ్యారంగా నిలబడిన సరస్సులు - ఇవే మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. అయితే వీటన్నింటికీ దూరంగా ‘అసలు ఇది రాజస్థానేనా?’ అని ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది వౌంట్ అబు.

12/03/2016 - 22:14

పాఠశాలలు తెరుచుకుని దాదాపు సగం కాలం గడిచిపోయింది. కొన్నిచోట్ల రివిజన్ కూడా మొదలైపోయింది. పాఠశాల స్థాయి నుంచి కళాశాల్లోకి వెళ్ళే పదో తరగతి విద్యార్థులపై అందరి దృష్టి ఉంటుంది. వారి భవిష్యత్ బంగారంలా ఉండాలని కలలు కంటుంటారు. ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా వారి వారి స్థాయిలో శ్రమిస్తుంటారు. విద్యార్థులూ పోటీపడి చదువుతూ అందరి కంటే తామే అగ్రస్థానంలో ఉండాలని పట్టుదలతో ఉంటారు.

12/03/2016 - 22:12

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనేది సామెత. నాడు మన పెద్దలు చెప్పిన పలు హితోక్తులను నేడు మనం పెడచెవిన పెడుతున్నాం. అంతేకాకుండా, పెద్దలు చెప్పిన మాటలకు శాస్ర్తియత లేదని కొట్టివేస్తున్నాం. అయితే పెద్దల మాటలు చద్దిమూటలు వంటివని, వాటికి శాస్ర్తియత ఉందని ఇప్పటికే పలు అంశాలలో తేటతెల్లం అయింది. తాజాగా నోరు మంచిదైతే గుండె పదిలంగా ఉంటుందని నూటికి నూరుపాళ్ళు నిజమని ఒక పరిశోధనలో తేలింది.

12/03/2016 - 22:10

చిలీ మినహా మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో కన్పించే ‘స్పైడర్ మంకీ’లకూ, సాలెపురుగులకూ ఎటువంటి సంబంధం లేదు. కానీ చెట్లపై అవి సంచరించేటపుడు సాలెగూడు ఆకారంలో విన్యాసాలూ చేస్తూండటం వల్ల వాటిని ‘స్పైడర్ మంకీ’లుగా పిలవడం ప్రారంభమైంది. దట్టమైన అడవుల్లో, సముద్రమట్టానికి 12,500 అడుగుల ఎత్తున అవి బతకగలవు. దట్టమైన అడవుల్లో చెట్లపై సంచరించే ఈ కోతుల్లో తోక చాలా పొడవుగా ఉంటుంది. బొటన వేలుండదు.

12/03/2016 - 22:10

ఆ రోజు పొద్దునే్న మొదలుపెట్టిన ఆపరేషన్ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయింది. ఆ తర్వాత ఫోన్ చూసుకుంటే అందులో ఎనిమిది మిస్డ్‌కాల్స్ ఉన్నాయి. బెంగుళూరులో ఓ పరిశ్రమలో పెద్ద పని చేస్తున్న స్నేహితుడిది. తిరిగి ఫోన్ చేస్తే, ‘‘అతని నుదుటి పక్క భాగంలో మచ్చలు వచ్చాయని, చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నందున ముఖ్యమైన మీటింగ్ ఉన్నా వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నా, ఏదైనా మందు చెప్పవా’’ అని అడిగేడు.

12/03/2016 - 22:08

గడ్డిపరక అని తీసి పారేస్తూంటాం కదా! కానీ ఈ భూమి మీద జీవుల మనుగడకు ప్రధానమైన ఆహారం గడ్డిజాతులే. మనం తినే వరి, గోధుమ, జొన్న, చాలా రకాల పూలు, పళ్లు...ఇలా ఎన్నో గడ్డిజాతికి చెందినవే. ఇళ్ల ముందు, లాన్‌లలో కేవలం కొద్ది అంగుళాల ఎత్తు మాత్రమే పెరిగే గడ్డి నుంచి 120 అడుగుల ఎత్తు పెరిగే ‘జెయింట్ బాంబూ’ రకం వెదురు వరకు అన్నీ గడ్డి రకాలే.

12/03/2016 - 22:06

ఎమ్.నరసింహారావు, విజయవాడ (ఆంధ్ర)
ప్రశ్న:సిద్ధాంతిగారూ! మీరు చెప్పినట్లుగా (పదినెలల క్రిందట) ఈ సంవత్సరం నా కోర్టు సమస్య నాకనుకూలంగానే తీర్పు వచ్చింది. మీ భవిష్యద్వాణికి నమోవాకాలు. అయితే ఇది మధ్యంతర తీర్పని తుది తీర్పు మేలో రాగలదని మా లాయర్‌గారు చెప్పారు. దయచేసి దాని గురించి చెప్పండి.

12/03/2016 - 22:06

సాధారణంగా మనం పెంచుకునే పిల్లులకు నీళ్లంటే భయం. నదులు, సెలయేర్లు, చెలమలు, నీటి గుంతల దగ్గర ఉన్న నీటిని తాకడానికి ఇష్టపడవు. పిల్లుల్లో ఒకటీ అరా జాతులు తప్ప మిగతావాటికి నీళ్లంటే భయమే. కానీ మధ్య, దక్షిణ అమెరికాలోని చాలా దేశాల్లో కన్పించే ‘ఓస్లాట్’ పిల్లులకు మాత్రం నీళ్లంటే భయం లేదు. పైగా ఇవి నీళ్లలో ఈదుతూ ఆహారాన్ని వేటాడతాయి. మనం ఇళ్లలో పెంచుకునే పిల్లులకన్నా ఇవి రెండురెట్లు పెద్దవిగా ఉంటాయి.

Pages