S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 07:04

సైకిల్ తొక్కడంలో విశేషం ఏముంటుంది? కానీ కైరోలో ఈ వ్యక్తి సైకిల్ సవారీలో ఓ ప్రత్యేకత ఉంది. వెదురుతో చేసిన భారీ ర్యాక్‌లో బన్‌లు పెట్టి, ఆ భారీ రొట్టెల తొట్టెను ఓ చేత్తో బ్యాలన్స్ చేస్తూ సైకిల్‌పై వెళ్లడం అతడి ప్రత్యేకత. వీధుల్లో తిరుగుతూ వాటిని విక్రయిస్తూంటాడు. నూటికి 90 శాతం ఆ రొట్టెల తొట్టె ఎప్పుడూ చేజార్చకపోవడం అతడికి గుర్తింపు తెచ్చింది.

12/03/2016 - 20:44

ఈ కాలంలో సిరా (ఇంక్) పెన్నులు రాసే వాళ్ల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు రకరకాల పెన్నులు వస్తున్నాయి. బాల్‌పాయింట్ పెన్నులు, జెల్ పెన్నులు ఇలా ఎన్నో రకాలు. తడి తగిలినా కూడా అక్షరాలు చెదిరిపోకుండా ఉండే ఇంక్‌లతో ఎన్నో పెన్నులు కన్పిస్తున్నాయి.

12/03/2016 - 20:43

జీవితంలో సంతృప్తిపడటం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడూ
ఆనందంగానే ఉంటాడు. అది చేతగాని వ్యక్తి ఎప్పుడూ
దుఃఖానికి గురవుతూనే ఉంటాడు.

12/03/2016 - 21:04

వయస్సుతో నిమిత్తం లేకుండా కొంతమంది చాలా హుషారుగా ఉంటుంటారు. స్పోర్ట్స్ షూస్ వేసుకొని, టీషర్ట్‌లు వేసుకుని కూడా కన్పిస్తుంటారు. మీసాలకి, తల వెంట్రుకలకి రంగు వేసుకొని కూడా దర్శనం ఇస్తుంటారు. వాళ్ల వయస్సు ఓ పది నుంచి ఇరవై సంవత్సరాలు తగ్గినట్టుగా కూడా కన్పిస్తుంటారు. వాళ్లు తమ యుక్తవయస్సులో కూడా అంత శ్రద్ధ తీసుకొని ఉండరు.

12/03/2016 - 05:35

ఒంగోలు,డిసెంబర్ 2:జిల్లాలో నీటియాజమాన్యసంస్థ ద్వారా అమలవుతున్న జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులు పలు పారామీటర్లల్లో రాష్టస్థ్రాయిలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ సుజాతశర్మ అన్నారు. శుక్రవారం జిల్లానీటియాజమాన్య సంస్ధ కార్యాలయ ఆవరంలో జిల్లా జీవనోపాదుల వనరుల కేంద్రభవన నిర్మాణ భూమి పూజలో కలెక్టర్, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

12/03/2016 - 05:35

ఒంగోలు, డిసెంబర్ 2:కేంద్ర ప్రభుత్వం పాత ఐదువందల నోట్ల రూపాయల బయట చలామణిని శుక్రవారం అర్ధరాత్రినుండి రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవటంతో ఆ కాగితాలు ఇకపై చిత్తుకాగితాలుగా మారనున్నాయి. పాత నోట్లు ఇకపై పెట్రోలుబంకుల్లో ఇతర మార్కెట్‌లో చెల్లకుండాపోనున్నాయి.

12/03/2016 - 05:34

మార్కాపురం, డిసెంబర్ 2: నూతన రాజధాని అమరావతిని దేశంలో అగ్రగామిగా నిలపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, రవాణశాఖమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు.

12/03/2016 - 05:33

ఒంగోలు, డిసెంబర్ 2: జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎపి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై విద్యాశంకర్ తెలిపారు.

12/03/2016 - 05:33

ఒంగోలు, డిసెంబర్ 2 : బంగాళాఖాతంలో ఏర్పడిన నాడా తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. దీంతో ఆయా మండలాల్లోని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు సరాసరిగా 7.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా 37.6 మిల్లీమీటర్ల వర్షపాతం ఉలవపాడు మండలంలో నమోదు అయ్యింది.

12/03/2016 - 05:32

ఒంగోలు,డిసెంబర్ 2:తమ సమస్యలను పరిష్కరించాలంటూ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిగింది. ముందుగా చీమకుర్తి మండలంలోని మర్రిచెట్లపాలెం నుండి ప్రదర్శగా యజమానులు, కార్మికులు పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించుకుంటూ ఒంగోలులోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

Pages