S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 05:31

శ్రీకాకుళం, డిసెంబర్ 2: రద్దయిన 500, 1000 నోట్లును ఉపయోగించడానికి గడువు ముగిసింది. ఇకపై ఆ నోట్లు మార్కెట్‌లో చలామణీకి నోచుకోవు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి రద్దయైన నోట్లు ఉంటే, బయట ఉపయోగించాలనుకుంటే అవి తీసుకోరు! పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు, ఆసుపత్రులకు, ప్రభుత్వ కార్యాలయాలు, తదితర చోట్ల రద్దయైన 500, 1000 నోట్లు ఈ నెల 2వ తేదీ వరకూ ప్రభుత్వం అనుమతించింది.

12/03/2016 - 05:28

వేదాయపాళెం, డిసెంబర్ 2: నాగార్జున యూనివర్శిటీలో జరిగిన వర్శిటీ అభివృద్ధి పాలకమండలి కమిటీ సమావేశాల్లో విక్రమ సింహపురి యూనివర్శిటీ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వీసీ ఆచార్య వి.వీరయ్య తెలిపారు. నగరంలోని వర్శిటీ అడ్మిన్ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్శిటీని నూతన భవనాల్లోకి వారం రోజుల్లో తరలించే అవకాశం ఉందన్నారు.

12/03/2016 - 05:26

కర్నూలు, డిసెంబర్ 2:దేశ వ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ నోట్ల కొరత జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జన జీవనాన్ని స్తంభింపజేసింది. పట్టణాల్లోని బ్యాంకులు, ఏటిఎంలలోనే నగదు సర్దుబాటు చేయలేకపోయిన అధికారులు పల్లెలపై దృష్టి సారించలేకపోతున్నారు. నగదు కొరతతో గ్రామీణులు పడుతున్న ఇబ్బందుల్లో అత్యధికంగా రైతులు ఉండగా ఆ తరువాతి స్థానం వ్యవసాయ కూలీలు ఉన్నారు. పంటల కోత సమయం కావడంతో రైతులకు డబ్బులు ఎంతో అవసరం ఉంది.

12/03/2016 - 05:24

తిరుపతి, డిసెంబర్ 2: ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఎలాంటి తప్పులు లేకుండా అదేవిధంగా బోగస్ ఓట్ల ఏరివేత ఎప్పటికప్పుడు వాటి వివరాలను సంబంధిత రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉందని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు విజయ్‌కుమార్ అన్నారు.

12/03/2016 - 05:21

వడ్డేపల్లి,డిసెంబర్ 2:నగరంలోని కుమార్‌పల్లి కూరగాయల మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ది చేసి, మార్కెట్ సొసైటీ సభ్యులకు రుణ సహాయం అందించాలని, అదే విధంగా నగదు రహిత క్రయవిక్రయాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అధికారులను ఆదేశించా రు.

12/03/2016 - 05:22

ఇందూర్, డిసెంబర్ 2: రబీ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని కలెక్టర్ యోగితారాణా ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో వ్యవసాయ శాఖ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

12/03/2016 - 05:15

తిరుపతి, డిసెంబర్ 2: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారు శ్రీ గోవర్థన గిరిధారియైన శ్రీకృష్ణుని రూపంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు వాహనసేవ సాగింది.

12/03/2016 - 05:13

హైదరాబాద్, డిసెంబర్ 2: రానున్న మూడున్నర దశాబ్దాల కాలంలో యాంటీబయాటిక్స్ కూడా పని చేయని పరిస్థితుల వల్ల 30 కోట్ల మంది మరణించే పరిస్థితి ఉంటుందని సిఎన్‌ఆర్‌ఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీని కావేరి హెచ్చరించారు. మితిమీరిన పరిమాణంలో, లేదా అవసరంతో నిమిత్తం లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అవి పని చేయని పరిస్థితి తలెత్తుతుందని ఆయన చెప్పారు.

12/03/2016 - 05:13

హైదరాబాద్, డిసెంబర్ 2: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ నితిన్ ఉపాధ్యాయ పరిశోధనా పత్రానికి ప్రశంసలు వచ్చాయి. క్రమపద్ధతిలో ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకోవడంపై ఆయన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.

12/03/2016 - 05:12

హైదరాబాద్, డిసెంబర్ 2: భారతీయులకు కేటాయించే వీసాలపై న్యూజిలాండ్ కోత విధించింది. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది శాపంగా మారనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో న్యూజిలాండ్‌లో చదువుకునే విద్యార్థులకు కేటాయించిన వీసాలు సగానికి తగ్గాయి. కేవలం జూలై నుండి అక్టోబర్ వరకూ న్యూజిలాండ్ భారతీయ విద్యార్థులకు 3102 వీసాలను మాత్రమే మంజూరు చేసింది.

Pages