S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 05:11

హైదరాబాద్, డిసెంబర్ 2: నగరంలోని జూబిలీహిల్స్ అపోలో హాస్పిటల్‌కు చెందిన వైద్యులు ఒక అరుదైన కేసులో టాంజానియాకుచెందిన ఓ వ్యక్తికి ముక్కును అమర్చుతూ చేసిన శస్తచ్రికిత్స విజయవంతమైంది. ఈ అరుదైన శస్తచ్రికిత్స వివరాలను సీనియర్ కన్సల్టెంట్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ ప్రసాద్ వివరించారు.

12/03/2016 - 05:09

హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లు అన్నింటినీ జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి వసతులున్న చోట జూనియర్ కాలేజీలను ప్రారంభిస్తామని చెప్పారు. రెసిడెన్షియల్ , మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ లీడర్స్ మీట్ 2016నును కడియం శ్రీహరి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంభించారు.

12/03/2016 - 05:08

హైదరాబాద్, డిసెంబర్ 2: పాత కేసుకు సంబంధించి కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి పోలీసులు నగరంలోని దోమలగూడలోని ప్రజాగాయిని విమలక్క, ‘అరుణోదయ’ సాంస్కృతిక సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం సీజ్ చేశారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా స్థానిక చిక్కడపల్లి పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏమి జరుగుతోందో తెలియక స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సంఘటన వివరాల ప్రకారం..

12/03/2016 - 05:07

హైదరాబాద్, డిసెంబర్ 2: రబీ సీజన్‌లో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నీటి పంపిణీపై చర్చించడానికి శుక్రవారం సమావేశం కావాల్సిన కృష్ణా నీటి యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఇరు రాష్ట్రాల నీటి పంపకాలపై నిర్ణయం తీసుకోవడానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

12/03/2016 - 05:06

విశాఖపట్నం, డిసెంబర్ 2: భారత వైమానిక దళానికి చెందిన ఎఎన్ 32 విమానం గల్లంతులో నావల్ ఆర్మోమెంట్ డిపో (ఎన్‌ఎడి)కి చెందిన సిబ్బంది కుటుంబీకులు అంగీకరిస్తే, పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తూర్పు నౌకాదళం ప్రకటించింది. గత జూలై 22న వైమానికి దళ విమానం చెన్నై సమీపంలోని తాంబరం ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే గల్లంతైన సంగతి తెలిసిందే.

12/03/2016 - 05:05

విశాఖపట్నం, డిసెంబర్ 2: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ సేవలందించేందుకు మరికొంత సమయం పడుతుందని, బహుశా 2018 నాటికి ఇది నౌకాదళంలో సేవలందించే అవకాశం ఉందని తూర్పు నౌకాదళ ప్రధానాధికారి హెచ్‌సిఎస్ బిస్త్ తెలిపారు.

12/03/2016 - 04:59

పాలకొల్లు, డిసెంబర్ 2: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం నాలుగు పాఠశాలలకు చెందిన వెయ్యి మంది విద్యార్ధులు అరుదైన ఏడు రికార్డులు సొంతం చేసుకున్నారు.

12/03/2016 - 04:57

అనంతపురం, డిసెంబర్ 2: రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ముందుకు వచ్చే గ్రామాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నజరానాలు ప్రకటించారు. పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో రానున్న రోజుల్లో నగదు రహిత లావాదేవీలు విజయవంతంగా నిర్వహించే గ్రామాలకు రూ.10 వేలు నుంచి రూ.లక్ష వరకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించారు.

12/03/2016 - 04:55

కాకినాడ, డిసెంబరు 2: కాపులను బిసిలుగా గుర్తించాలన్న డిమాండ్‌తో తాను చేపట్టనున్న సత్యాగ్రహ పాదయాత్రకు పోలీసుల నుండి ఏ విధమైన అనుమతి కోరేదిలేదని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. జనవరి 25వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో సత్యాగ్రహ పాదయాత్రను ప్రారంభిస్తానని చెప్పారు.

12/03/2016 - 04:53

హిందూపురం, డిసెంబర్ 2: ‘నేను నాటిన విత్తు...నా ప్రాణ ప్రతిష్ట డ్వాక్రా సంఘాలు...ఆనాడు నా తల్లి పడ్డ కష్టాన్ని చూశా...సమాజంలోని ఆడపడుచుల ఇబ్బందులు గమనించా...అందుకే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఓ వ్యవస్థలా మార్చాను’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

Pages