S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 00:18

భీమవరం, డిసెంబర్ 2: ఒఎన్‌జిసికే తలమానికంగా నిలుస్తున్న కృష్ణా గోదావరి బేసిన్ (కెజి బేసిన్) నుండి 2020 నాటికి రోజుకు 70 వేల బ్యారెళ్ల చమురు, సహజవాయువు ఉత్పత్తిచేయాలని భావిస్తున్నామని కెజి బేసిన్ జనరల్ మేనేజర్ (జియాలజీ) ఎవివిఎస్ కామరాజు తెలిపారు. భీమవరంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కెజి బేసిన్‌లో ఆఫ్‌షోర్ కార్యకలాపాలపై సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

12/03/2016 - 00:17

పాలకొల్లు, డిసెంబర్ 2: ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు వేమన శతకంలోని వంద పద్యాలు 45 నిమిషాల్లో వల్లెవేయడం అపూర్వమని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. వెయ్యిమంది పిల్లలు, పది మంది ఉపాధ్యాయులు కూడా వెంటలేకుండా ఇలాంటి అరుదైన కార్యక్రమంతో ఏడు రికార్డులు సాధించడం అద్భుతమని ప్రశంసించారు.

12/03/2016 - 00:17

ఏలూరు, డిసెంబర్ 2: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ తోట రాజశేఖర్ అన్నారు. శుక్రవారం అగ్రహారంలోని కళ్యాణ మండపం వద్ద వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు నోట్ల రద్దు అవలంభించాల్సిన పద్దతులు, స్వైపింగ్ మిషన్ల పనితీరు తదితర అంశాలపై మర్చంట్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సును నిర్వహించారు.

12/03/2016 - 00:16

తాళ్లపూడి, డిసెంబర్ 2: పింఛను డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లిన ఒక వృద్ధురాలు స్పృహతప్పి పడిపోయిన ఘటన శుక్రవారం కొవ్వూరు మండలం ధర్మవరం ఆంధ్రాబ్యాంకు వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలావున్నాయి. పింఛను సొమ్ము తీసుకునేందుకు వెళ్లిన ధర్మవరం గ్రామానికి చెందిన కె సూర్యాకాంతం ఎక్కువసేపు క్యూలో నిలబడి ఉండటంతో సొమ్మసిల్లి పడిపోయింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆమెకు సపర్యలు చేసి ఇంటికి తీసుకెళ్లారు.

12/03/2016 - 00:16

ఏలూరు, డిసెంబర్ 2: ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యంగా జీతాలు ప్రభుత్వం చెల్లించినా తీసుకోవడానికి బ్యాంకర్లు విధించిన ఆంక్షలను తొలగించి పది వేల రూపాయలు ఒకేసారి ఉద్యోగులు పొందేలా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయిస్తానని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు.

12/03/2016 - 00:15

ఏలూరు, డిసెంబర్ 2 : జిల్లాలో నగదు రహిత లావాదేవీల గుర్తింపు కార్డు మంజూరు కొరకు ప్రజల నుండి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. శుక్రవారం తహశీల్దార్లు, ఎంపిడివోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరు సమీక్షించారు.

12/03/2016 - 00:14

రాజమహేంద్రవరం, డిసెంబర్ 2: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విలీన గ్రామాల పాలన ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా ఇరకాటంలో పడింది. ఇప్పటి వరకు యధేచ్ఛగా సాగిన అక్రమాల ఝంజాటం వెంటాడుతోంది. రాజమహేంద్రవరం నగరంలో విలీనం చేస్తూ పరిసర గ్రామాలకు ప్రత్యేక అధికారిగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ను నియమించడంతో పాలన పరుగులు పెట్టడం మాటెలా ఉన్నా అసలు పాలనకే ఇరకాట పరిస్థితి ఎదురయ్యిందంటున్నారు.

12/03/2016 - 00:13

రాజమహేంద్రవరం, డిసెంబర్ 2: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఆనుకుని ఉన్న 21 గ్రామాల్లో ప్రత్యేక అధికారిగా కమిషనర్ వి విజయరామరాజు నియామకంపై హైకోర్టు 4 వారాల పాటు స్టే విధించినట్లు పిటిషనర్ నక్కా రాజబాబు తెలిపారు. 21 గ్రామాలకు కమిషనర్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

12/03/2016 - 00:12

కడియం, డిసెంబర్ 2: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు పాటుపడాలని ఏలూరు రేంజి డిఐజి రామకృష్ణ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన కడియం పోలీసుస్టేషనును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, అలాగే సామాజిక కార్యక్రమాల్లో కూడ పాల్గొని జనమైత్రి పెంపొందించుకోవాలని కోరారు. అనంతరం స్టేషనులో రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

12/03/2016 - 00:11

మారేడుమిల్లి, డిసెంబర్ 2:తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో అమలవుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. మండల కేంద్రమైన మారేడుమిల్లిలో శుక్రవారం ఆయన రంపచోడవరం, చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు దినేష్‌కుమార్, జి చినబాబు, వివిధశాఖల అధికారులతో సమీక్షించారు.

Pages