S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 00:38

కశింకోట, డిసెంబర్ 2: ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాను తెరవల్సిందేనని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన అకస్మికంగా కశింకోట స్టేట్‌బ్యాంక్, రేషన్‌డిపోలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఖాతా ఉన్న వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు తదితర లావాదేవీలు అన్నింటికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బ్యాంక్ ఖాతాలు లేనివారు వెంటనే ఖాతాను ప్రారంభించాలన్నారు.

12/03/2016 - 00:37

విశాఖపట్నం, డిసెంబర్ 2: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలను మరింత ఉధృతం చేసే క్రమంలో నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించిన ఆయన జన్మభూమి-మావూరు తరహాలో ఉద్యమంలా నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

12/03/2016 - 00:36

విశాఖపట్నం, డిసెంబర్ 2: డిసెంబర్ నెల రేషన్ సరకులను కార్డుదారులకు అరువు ప్రాతపదికన ఇవ్వనున్నట్టు సంయుక్త కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కరెంటు ఖాతాలు లేని డీలర్లు ఖాతాలు తెరచే వరకు కార్డుదారులకు అరవు ప్రాతిపదికని సరకులను అందజేయాలన్నారు.

12/03/2016 - 00:36

అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 2: పెద్దనోట్ల రద్దుప్రభావంతో అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వీరితోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం కష్టాలు తప్పడం లేదు. గత నెలవరకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు బ్యాంకు ఖాతాలకు ప్రతీనెల 1వ తేదీన జమ అయ్యేవి. వాటిని ఏటిఎం ద్వారా డ్రా చేసుకొని ఇంటి అద్దెతోపాటు పేపర్ బిల్లువరకు చెల్లించేవారు.

12/03/2016 - 00:35

అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 2: ప్రజావ్యతిరేక పాల న కొనసాగిస్తూ అనేక విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వైఎస్‌ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.

12/03/2016 - 00:35

విశాఖపట్నం, డిసెంబర్ 2: హద్దు మీరుతున్న బిజెపి నేతలను పార్టీ అధిష్ఠానం కట్టడి చేయాలని టిడిపి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి డిమాండ్ చేశారు.

12/03/2016 - 00:34

అచ్యుతాపురం, డిసెంబర్ 2: మండలంలో అచ్యుతాపురం నుండి అనకాపల్లి వెళ్లే రహదారి కొండకర్ల జంక్షన్ వద్ద శుక్రవారం 120 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అజ్ఞాత వ్యక్తి సమాచారం మేరకు పోలీసులు చాకచక్యంగా దాడులు నిర్వహించి గంజాయి పట్టుకున్నారు.

12/03/2016 - 00:34

సీలేరు, డిసెంబర్ 2: పి. ఎల్.జి. ఎ. వారోత్సవాలను నిర్వహించాలంటూ సి.పి.ఐ. మావోయిస్టు పేరిట ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం వాల్ పోస్టర్లు వెలసాయి. ఈ నెల 2 నుంచి 7 వరకు ప్రతీ గ్రామగ్రామాన పి.ఎల్.జి.ఎ. వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఈసందర్భంగా రామగూడ ఎన్‌కౌంటర్‌లో అమరులైన విప్లవ వీరులకు జోహార్లలర్పించాలన్నారు.

12/03/2016 - 00:19

ఏలూరు, డిసెంబర్ 2 : నిను వీడని నీడను నేనే... అన్న రీతిలో గత 24 రోజులుగా సామాన్య జనాన్ని వెంటాడుతున్న నగదు కష్టాలు ఈ నెల మొదటి వారంలోనూ తప్పే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. వేతన జీవులు జీతం బ్యాంకులో పడినా తీసుకునే అవకాశం లేకపోవడంతో చేతికందినా నోటికందడం లేదని విలవిల్లాడుతున్నారు.

12/03/2016 - 00:19

ఏలూరు, డిసెంబర్ 2 : జిల్లాలో చిల్లర నోట్ల సమస్యను పరిష్కరించడానికి రిజర్వు బ్యాంకు నుండి నేడు 180 కోట్ల రూపాయలు నోట్లు వచ్చాయని వాటిని రేపటి లోగా అన్ని బ్యాంకు ఖాతాలకు తరలించి సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు.

Pages