S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 01:41

ముంబయి, డిసెంబర్ 2: సరిహద్దుల్లో భారతీయ జవాన్ల హత్యలపై బిజెపి మిత్రపక్షమైన శివసేన కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, పెద్ద నోట్ల రద్దుపై నవంబర్ 8న ప్రకటన వెలువడిన తర్వాత సరిహద్దుల్లో మన సైనికులపై దాడులు ఎందుకు పెరిగాయో చెప్పాలని ప్రశ్నించింది.

12/03/2016 - 01:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తమ అక్రమ సంపదను సక్రమంగా మార్చుకోవడానికి అడ్డదారులను తొక్కుతున్నవారిని విడిచిపెట్టేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

12/03/2016 - 01:29

అబూదబీ, డిసెంబర్ 2: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యువ ఆటగాడు ఒమర్ అబ్దుల్ రహమాన్, ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ ఫోర్డ్‌లకు ఆసియా ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ (ఎఎఫ్‌సి) బెస్ట్ ప్లేయర్ అవార్డులు దక్కాయి. ఇక్కడి ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్‌లో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో అధికారులు వీరికి అవార్డులను ప్రదానం చేశారు. నిరుడు కూడా అబ్దుల్ రహమాన్ పేరు ఎఎఫ్‌సి ఉత్తమ క్రీడాకారుడి అవార్డుకు నామినేట్ అయింది.

12/03/2016 - 01:27

మకావూ, డిసెంబర్ 2: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ ప్రస్తానానికి తెరపడింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత మూడో టోర్నీలో పాల్గొన్న అమె, గత రెండు టోర్నీలతో పోలిస్తే మకావూలో మెరుగ్గానే ఆడింది. అయితే, మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె జాంగ్ ఇమాన్ (చైనా) చేతిలో 17-21, 17-21 తేడాతో ఓటమిపాలైంది.

12/03/2016 - 01:10

బ్యాంకాక్, డిసెంబర్ 2: మహిళల ఆసియా కప్ టి-20 టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొన్న నేపాల్ చిత్తుచిత్తుగా ఓడింది. మహిళల క్రికెట్ టి-20 ఫార్మెట్‌లో అత్యల్ప స్కోరును నమోదు చేసి పరువు పోగొట్టుకుంది. 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆ జట్టు 16.3 ఓవర్లు ఆడి, కేవలం 21 పరుగులకే కుప్పకూలింది.

12/03/2016 - 01:07

పార్లమెంటు భవనానికి భారత క్రికెటర్లు క్యూ కడుతున్నారు. మొన్న ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పార్లమెంటు హౌస్‌కు వెళ్లి, తన వివాహానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాడు. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కూడా ప్రధానికి పెళ్లి పత్రిక అందించేందుకు వచ్చాడు. బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ప్రతిమతో అతని వివాహం ఈనెల 9న జరగనుంది.

12/03/2016 - 01:04

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోగల రెండవ యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రక్రియ విజయవంతమైనట్లు సింగరేణి ఎండి ఎన్ శ్రీ్ధర్ శుక్రవారం ప్రకటించారు. ఈ ప్లాంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ధరకే 1,200 మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తామన్నారు.

12/03/2016 - 01:03

హైదరాబాద్, డిసెంబర్ 2: ఐటి రంగానికి విశిష్ట సేవలు అందించిన సియాంట్ వ్యవస్థాపకుడు, నాస్కాం పూర్వ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన పయోనీరింగ్ బిజినెస్ లీడర్ అవార్డు లభించింది. ఢిల్లీలో శుక్రవారం ఆరవ నేషనల్ బిపిఎం షేర్డ్ సర్వీసెస్ సదస్సులో ఈ అవార్డును బివిఆర్ మోహన్ రెడ్డికి ప్రదానం చేశారు.

12/03/2016 - 01:03

ముంబయి, డిసెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ ఆందోళనకర పరిస్థితుల మధ్య బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 329.26 పాయింట్లు క్షీణించి 26,230.66 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 106.10 పాయింట్లు పతనమై 8,086.80 వద్ద నిలిచింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు, ఇటలీ రాజ్యాంగ రెఫరెండమ్‌పై మదుపరులు భయాలకు లోనవడంతో సూచీ లు నష్టాలకు గురయ్యాయి.

12/03/2016 - 01:02

ముంబయి, డిసెంబర్ 2: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) సిఇఒ, ఎండిగా శుక్రవారం చిత్రా రామకృష్ణ తప్పుకున్నారు. 2018 మార్చి వరకు ఆమె పదవీకాలం ఉన్నప్పటికీ, ఎన్‌ఎస్‌ఇ బోర్డులోని కొందరు సభ్యులతో నెలకొన్న విభేదాల మధ్య ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. 2013 ఏప్రిల్‌లో సిఇఒ, ఎండిగా చిత్రా రామకృష్ణ ఎంపికయ్యారు. మరోవైపు ఆమె స్థానంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ జె రవిచంద్రన్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు.

Pages