S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 00:47

అవనిగడ్డ, డిసెంబర్ 2: త్వరలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీలకు కేవలం రూ.200లకే స్కానింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అధికారుల సమన్వయ లోపం కారణంగా అభివృద్ధిలో అవనిగడ్డ నియోజకవర్గం వెనుకబడుతోందన్నారు.

12/03/2016 - 00:47

మైలవరం, డిసెంబర్ 2: జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె ప్రమీల మాట్లాడుతూ ప్లాస్టిక్ పెన్నులు, కవర్లు వాడకం వల్ల పర్యావరణానికి పెను ప్రమాదం వస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి చిన్నపనికీ వాహనాల వాడకం వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్నారు. కాలుష్య నివారణకు చెట్ల పెంపకం మేలన్నారు.

12/03/2016 - 00:46

కూచిపూడి, డిసెంబర్ 2: మొవ్వ పిహెచ్‌సి ఎఎన్‌ఎం అక్రమ కేసుకు నిరసనగా శుక్రవారం వైద్యులు డా. శొంఠి శివరామకృష్ణ, డా. భగవాన్, సిబ్బంది సాయంత్రం నుండి విధులను బహిష్కరించారు. మొవ్వ సబ్ సెంటర్ ఎఎన్‌ఎం ఎ రత్నకుమారిని వేరే పిహెచ్‌సికి బదిలీ చేయాలని లేదా తమను ఇతర ప్రాంతానికి బదిలీ చేయాలన్న విన్నపాన్ని పరిష్కరించాల్సిందిగా డియంహెచ్‌ఓ డా.

12/03/2016 - 00:46

విజయవాడ, డిసెంబర్ 2: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) ఎల్‌పిజి పైపులైన్ సంరక్షణ అందరి కర్తవ్యం, బాధ్యత అని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. భవానీపురం హరితాబెరం పార్కులో శుక్రవారం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎల్‌పిజి గ్యాస్ పైప్‌లైన్ భద్రత, సంరక్షణపై జిల్లా అధికారులకు సదస్సు నిర్వహించారు.

12/03/2016 - 00:45

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 2: ఎపి సిఆర్‌డిఎ రీజియన్ పరిధిలో అనుమతులన్నీ నిబంధనల మేరకే మంజూరవుతాయని కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం నగరంలోని సిఆర్‌డిఎ కార్యాలయంలో నిర్వహించిన ఓపెన్ ఫోరంలో ఆయన దరఖాస్తుదారులు, అధికారుల సమక్షంలో పలు దరఖాస్తులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

12/03/2016 - 00:44

విజయవాడ, డిసెంబర్ 2: జిల్లాలోని అన్ని రైతు బజార్లలో పాస్ మిషన్లు (పాయింట్ ఆఫ్ సేల్)ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో మార్కెటింగ్, రైతు బజారుల ఎస్టేట్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

12/03/2016 - 00:44

విజయవాడ, డిసెంబర్ 2: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని జిల్లాలో ప్రణాళికాబద్దంగా చేపట్టి ప్రపంచబ్యాంకుచే ప్రశంసలు అందుకున్నామని జిల్లా కలెక్టర్ బాబు.ఎ ర్యాపిడ్ ఎసెస్‌మెంట్ టీమ్ సభ్యులకు వివరించారు.

12/03/2016 - 00:43

విజయవాడ, డిసెంబర్ 2: నగదు రహిత లావాదేవీలను చౌకధరల దుకాణాల్లో సక్రమంగా నిర్వహించి ప్రజలను ప్రోత్సహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు లబ్బిపేటలోని బాడవపేట, 237 చౌకధర దుకాణం, పటమట రైతుబజారులలో నగదు రహిత చెల్లింపులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

12/03/2016 - 00:43

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 2: కృష్ణాజిల్లా బాడ్మింటన్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని మూడు స్టేడియాల్లో జరుగుతున్న డిపిఎస్ వరల్డ్ స్కూల్ 30వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.

12/03/2016 - 00:42

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 2: కృష్ణా పుష్కరాల సమయంలో చేపట్టిన రోడ్ల విస్తరణకు అడ్డంగా ఉన్న ఇళ్లు తొలగించిన వారికి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం జి ప్లస్ త్రీ పక్కాగృహాల కేటాయించిన లబ్ధిదారుల కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వమే రీఎంబర్స్‌మెంట్ చేయాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ కరికల్ వలవన్‌ను కోరారు.

Pages