S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 01:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టాలు గత ఆర్థిక సంవత్సరం (2015-16) 17,993 కోట్ల రూపాయలుగా ఉన్నాయని శుక్రవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంగా సమర్పించిన వివరాల ప్రకారం 2015-16లో 28 ప్రభుత్వరంగ బ్యాంకులు 17,993 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి.

12/03/2016 - 01:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన బ్యాంక్ అధికారులపై కేంద్రం కొరడా ఝుళిపించింది. వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 27 మంది సీనియర్ అధికారులను సస్పెండ్ చేసింది. మరో ఆరుగురిని బదిలీ చేసింది. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ వీరంతా నల్లధనం మార్పిడికి పాల్పడుతున్నట్లు ఐటి శాఖ దాడుల్లో గుర్తించిన సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

12/03/2016 - 00:59

సిడ్నీ, డిసెంబర్ 2: కొలంబియా విమాన ప్రమాదంలో మృతి చెందిన బ్రెజిల్ సాకర్ క్రీడాకారుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వీలుగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో తన ఆస్ట్రేలియా పర్యటనను వాయిదా వేసుకున్నాడు. సోమవారం ఉదయం జరిగే మహిళల అండర్-20 ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను తిలకించేందుకు అతను రావాల్సి ఉండింది.

12/03/2016 - 00:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: తన సంపదలో 99 శాతం కోల్పోయిన బిలియనీర్ ఎవరూ కూడా సంతోషంగా ఉండరు. కానీ సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ మసయోషి సన్ మాత్రం ఇందుకు భిన్నం. అవును.. తన సంపద క్షీణతతో తాను పనిలో ఉన్న ఆనందం, ధనం విలువను తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. శుక్రవారం ఇక్కడ హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన తన అంతరంగాన్ని ఆహుతులతో పంచుకున్నారు.

12/03/2016 - 00:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించిన దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తమ నూతన సేవింగ్స్ ఖాతాదారులకు టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తోంది. కస్టమర్లు డిపాజిట్ చేసే ప్రతి రూపాయికి ఒక నిమిషం టాక్‌టైమ్ (తమ నెట్‌వర్క్ పరిధిలోనే)ను ఇస్తోంది. ఈ అవకాశం తొలిసారి డిపాజిట్లకే ఉంటుం ది.

12/03/2016 - 00:51

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 2: దక్షిణ మండల రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హ్యాపీ వాకర్స్, మార్నింగ్ స్టార్ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో స్థానిక రైల్వే స్టేడియంలో నెలరోజులపాటు జరిగిన యోగా శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ శిక్షణా తరగతుల్లో సుమారు 50 మంది సభ్యులు పాల్గొన్నారు.

12/03/2016 - 00:49

జగ్గయ్యపేట రూరల్, డిసెంబర్ 2: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం అయిన గరికపాడు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా, మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. హైదరాబాద్ కుకట్‌పల్లికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ఒక ఆశ్రమంకు వెల్తున్నారు.

12/03/2016 - 00:49

మచిలీపట్నం, డిసెంబర్ 2: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికారం కోసం పగటి కలలు కంటున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఎద్దేవా చేశారు. దేవుడు దయదలిస్తే యేడాదిలో తమ ప్రభుత్వం వస్తుందని జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

12/03/2016 - 00:48

మచిలీపట్నం, డిసెంబర్ 2: పెద్దనోట్ల దెబ్బకు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన ఈ రంగం నేడు బోసిపోయింది. గత పదేళ్ళ క్రితం సమాజంలో తీవ్రంగా నెలకొన్న నిరుద్యోగ సమస్యను సైతం అధిగమించిన రియల్ ఎస్టేట్ రంగం పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో మళ్ళీ ఆ సమస్యను తెచ్చి పెట్టింది. ఈ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న ఏజెన్సీలు, బ్రోకర్లు నేడు బజారున పడ్డారు.

12/03/2016 - 00:48

తోట్లవల్లూరు, డిసెంబర్ 2: భద్రిరాజుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఎసిఎస్)లో వేలాది రూపాయల అక్రమాలు జరిగాయని, వీటిపై సమగ్ర విచారణ జరపాలని ముగ్గురు డైరెక్టర్లు, రైతుమిత్ర గ్రూపు సభ్యులు డిమాండ్ చేశారు. ఇటీవల సహకార అధికారి వచ్చినా సరైన విచారణ జరగలేదన్నారు.

Pages