S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 00:42

మకావూ, డిసెంబర్ 1: మకావూ ఓపెన్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌తో పాటు యువ ఆటగాడు బి.సాయ ప్రణీత్ మరో అడుగు ముందుకేశారు.

12/02/2016 - 00:40

కరాచీ, డిసెంబర్ 1: టీమిండియాతో ఆడేందుకు తామేమీ ‘ప్రాధేయపడటం’ లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నాడు. అయితే ఇరు దేశాల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణకు కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాన్ని (ఎంఓయును) గౌరవించాల్సిందిగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)పై వత్తిడి తీసుకొచ్చేందుకు తమకు అన్ని హక్కులూ ఉన్నాయని ఆయన చెప్పాడు.

12/02/2016 - 00:39

బ్యాంకాక్, డిసెంబర్ 1: ఆసియా కప్ మహిళల ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తున్న భారత జట్టు మరో అడుగు ముందుకు వేసింది. గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో శ్రీలంక జట్టుపై ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ మిథాలీ రాజ్ (59 బంతుల్లో 62 పరుగులు), బౌలింగ్‌లో ఏక్తా బిస్త్ (3/8), ప్రీతీ బోస్ (3/14) చక్కగా రాణించి భారత జట్టును విజయపథంలో నడిపారు.

12/02/2016 - 00:37

పారిస్, డిసెంబర్ 1: పారిస్‌లో జరుగుతున్న మహిళల స్క్వాష్ ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభాన్ని సాధించింది. ఈ టోర్నీలో 9 నుంచి 12వ స్థానం కోసం ఆడుతున్న భారత జట్టు గురువారం ఇక్కడ జరిగిన ఓపెనింగ్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో 3-0 తేడాతో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది.

12/02/2016 - 00:36

సిడ్నీ, డిసెంబర్ 1: పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మిక్కీ ఆర్థర్ పాక్ యువ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్‌ను టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోలుస్తూ, 22 ఏళ్ల ఆజమ్ ఆ వయసులో కోహ్లీని గుర్తుకు తెస్తున్నాడన్నాడు. పాకిస్తాన్ యువ బ్యాట్స్‌మన్ ఆజమ్ ఇప్పటిదాకా మూడు టెస్టులు ఆడగా, గత వారం హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో సెంచరీ చేసే సదవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నాడు.

12/02/2016 - 00:34

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 1: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపుతో క్రీడలను ప్రోత్సహిస్తున్నారని క్రీడాశాఖ మంత్రి కె అచ్చెంనాయుడు అన్నారు.

12/02/2016 - 00:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రపంచంలోనే పరుగులు పెడుతున్న జిడిపి భారత్ సొంతం. వృద్ధిరేటులో భారత్‌కు సాటిలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి భారత్.. నిన్నమొన్నటిదాకా దేశ ఆర్థిక వ్యవస్థపై వినిపించిన అభిప్రాయాలివి. భారత్ జిడిపి తగ్గుముఖం పడుతుంది. పారిశ్రామిక వ్యవస్థలో మందగమనం కనిపిస్తోంది. వృద్ధిరేటు నెమ్మదించింది.. ఇవి ఇప్పుడు వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. దీనికి కారణం అంతర్జాతీయ పరిణామాలు కావు.

12/02/2016 - 00:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: వచ్చే ఏడాది ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో భారత్, చైనా దేశాలు పాజిటివ్ ఔట్‌లుక్‌తో నిలుస్తాయని గురువారం ఐక్యరాజ్య సమితి అధ్యయనం ఒకటి తెలిపింది. ప్రగతిశీల పన్ను విధానాలు, ప్రభావవంతమైన ఆర్థిక సుపరిపాలనతో ఆసియా-పసిఫిక్ దేశాల్లోనే భారత్, చైనాలు ఆదర్శవంతంగా ముందుకెళ్తున్నాయని ఆ అధ్యయనంలో ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది.

12/02/2016 - 00:25

ముంబయి, డిసెంబర్ 1: ఉచిత వాయిస్ కాల్స్, డేటా వినియోగం ఆఫర్‌ను మార్చి 31 వరకు పొడిగించింది రిలయన్స్ జియో. ‘జియో హ్యాప్పీ న్యూ ఇయర్’ పేరిట ఉచిత వాయిస్, డేటా, వీడియో, అప్లికేషన్ల సదుపాయాన్ని తమ కస్టమర్లకు మూడు నెలలపాటు పెంచింది. సెప్టెంబర్ 4న మొదలైన ఈ ఉచిత ఆఫర్ తొలుత డిసెంబర్ 31 వరకే అందుబాటులో ఉంటుందని ప్రకటించిన జియో.. దాన్ని ఇప్పుడు మార్చి 31 వరకు తీసుకెళ్లింది.

12/02/2016 - 00:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: మారుతి సుజుకి, టొయోటా, రెనాల్ట్ అమ్మకాలు గత నెల నవంబర్‌లో రెండంకెల వృద్ధిని అందుకున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలోనూ దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి దూకుడు కొనసాగడం గమనార్హం. మరోవైపు మహీంద్ర, ఫోర్డ్, హోండా అమ్మకాలు పడిపోయాయి. టాటా మోటార్స్ అమ్మకాలు 22 శాతం పెరిగినట్లు ప్రకటించింది. కాగా, మారుతి సుజుకి దేశీయ అమ్మకాలు ఈసారి 1,26,325 యూనిట్లుగా నమోదయ్యాయి.

Pages