S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 00:23

ముంబయి, డిసెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో వరుసగా నాలుగు రోజులపాటు నమోదైన లాభాలకు తెరపడింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచి సెనె్సక్స్ 92.89 పాయింట్లు క్షీణించి 26,559.92 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 31.60 పాయింట్లు కోల్పోయి 8,192.90 వద్ద నిలిచింది.

12/02/2016 - 00:22

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఓ మొబైల్ యాప్‌ను రూపొందించింది. దీన్ని టిఎస్‌ఐఐసి చైర్మన్ జి బాలమల్లు గురువారం ఇక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.

12/02/2016 - 00:21

కొత్తగూడెం, డిసెంబర్ 1: బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి సంస్థ తడబాటు పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం 66.03 మిలియన్ టన్నులవగా, గడచిన ఎనిమిది మాసాలలో 4 కోట్ల 7 లక్షల 45 వేల 200 టన్నులు ఉత్పత్తికిగాను.. 3 కోట్ల 64 లక్షల 73 వేల 655 టన్నులు మాత్రమే సాధించి నవంబర్ మాసం ముగిసే సమయానికి 90 శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకుంది.

12/02/2016 - 00:21

రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: పాత పెద్ద నోట్ల రద్దు సంక్షోభం నేపథ్యంలో ప్రసిద్ధిచెందిన తూర్పు గోదావరి జిల్లా కడియపులంక పూల మార్కెట్ వ్యాపారుల పరిస్థితి ‘పూలు అమ్మినచోటే..’ అన్నట్టుగా తయారైంది. పూలతోపాటు మొక్కల ఎగుమతులకు దేశవ్యాప్తంగా పేరొందిన కడియపులంకలో కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. పూల మార్కెట్‌కు కరెన్సీ కష్టాలు ఆవరించడంతో పూల రైతులు కుదేలయ్యారు. ఎగుమతులు లేకపోవడంతో కుళ్లిపోతున్నాయి.

12/02/2016 - 00:14

విశాఖపట్నం, డిసెంబర్ 1: కాటికి కాళ్లు చాచుకున్న పండుటాకులు వారు. చివరి క్షణంలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వస్తోంది వారికి. నిరాదరణకు గురై, పొట్ట నింపుకునేందుకు పాట్లు పడుతున్న వృద్ధుల బాధలు అన్నీఇన్నీ కావు. దీనికి ప్రభుత్వం పెడుతున్న కష్టాలు తోడవుతున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన వెయ్యి రూపాయల పింఛన్ కోసం ఇప్పుడు వారు సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నారు.

12/02/2016 - 00:13

విశాఖపట్నం, డిసెంబర్ 1: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మంచినీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) ప్రణాళికలు రూపొందిస్తోంది. నగరంలో తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు అవసరమైన నీటిని సమకూర్చుకోవడంతో పాటు దాన్ని నిల్వచేసుకునేందుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తోంది.

12/02/2016 - 00:13

విశాఖపట్నం, డిసెంబర్ 1: పెద్ద నోట్ల రద్దు ప్రభావం చివరకు తెలుపురంగు రేషన్ కార్డుదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో చిల్లర సమస్యలు తలెత్తుతున్నాయి. అందువల్ల కార్డుదారులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చిల్లర సమస్యను అధిగమిస్తూనే, కార్డుదారులకు కాస్త ఊరట కలిగించే విధంగా ఈ నెల రేషన్ సరకులు అరువు పైనే ఇస్తున్నట్టు ప్రకటించింది.

12/02/2016 - 00:12

విశాఖపట్నం, డిసెంబర్ 1: తెలుపు రంగు రేషన్‌కార్డుదారులకు శుభవార్త. త్వరలో చంద్రన్న కానుక అందనుంది. ఇందుకోసం జిల్లా పౌరసరఫరాల విభాగం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై వీటిని సక్రమంగా పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభిస్తున్నారు.

12/02/2016 - 00:11

విశాఖపట్నం, డిసెంబర్ 1: సమాజంలో నగదు రహిత లావాదేవీలు పెరిగినపుడే పారదర్శకమైన పాలన సాధ్యపడుతుందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నగదు రహిత చెల్లింపులు సూచనలపై విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏయూ స్నాతకోత్సవ మందిరం వేదికగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిపై ప్రజలు దృష్టిసారించాలన్నారు. ఈ దిశగా అవినీతి రహిత భారతదేశాన్ని చూడగలమన్నారు.

12/02/2016 - 00:10

అనకాపల్లి రూరల్, డిసెంబర్ 1: తియ్యదనాన్ని ఇచ్చే బెల్లం రైతుకు చేదు కష్టాలు వచ్చిపడ్డాయి. తినేవాడికి తీపి తయారుదారుడుకి చేదు అన్నట్లుగా పెద్దనోట్ల దెబ్బతో బెల్లం రైతులు ఒక్కసారిగా కుదేలై పోయారని చెప్పవచ్చు. దీంతో గందరగోళ పరిస్థితుల్లో ఇటు రైతులు అటు బెల్లం వ్యాపారస్తులు కూడా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు.

Pages