S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 02:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించటం ద్వారా ప్రజాస్వామ్యంతోపాటు ప్రతిపక్షాల నోరు నొక్కుతోందని పదహారు ప్రతిపక్ష పార్టీల నాయకులు గురువారం రాత్రి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.

12/02/2016 - 02:06

హైదరాబాద్, డిసెంబర్ 1: దేశంలో నల్లధనానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి, ఉద్యమాలు చేసిన ఏకైక రాజకీయ పార్టీ బిజెపి అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు పేర్కొన్నారు. నల్లధనంపై యుద్ధం ప్రకటిస్తామని 2009లోనే అద్వానీ ప్రకటించారని, 2011లో భారతదేశం అంతటా నల్లధనానికి వ్యతిరేకంగా అద్వానీ చైతన్య యాత్ర నిర్వహించారని ఆయన చెప్పారు.

12/02/2016 - 02:05

సూళ్లూరుపేట, డిసెంబర్ 1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 7న పిఎస్‌ఎల్‌వి-సి 36 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో ముహూర్తం ఖరారు చేసింది.

12/02/2016 - 02:04

రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని జిఎస్‌ఎల్ వైద్య కళాశాల విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యచేసుకుంది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, చికిత్స పొందుతూ అర్థరాత్రి దాటాక మృతి చెందింది. విశాఖపట్నంకు చెందిన రాచకొండ శుభశ్రీ (22) రాజానగరం జిఎస్‌ఎల్ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది.

12/02/2016 - 02:03

భద్రాచలం, డిసెంబర్ 1: విప్లవ కారిడార్‌లో పిఎల్‌జిఏ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు కొత్త తరహా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. నేటి నుంచి 8వరకు పిఎల్‌జీఏ వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

12/02/2016 - 02:03

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ తేజ్‌దీప్ కౌర్ మేనన్‌కు శాంచురీ ఏషియా అవార్డు లభించింది.

12/02/2016 - 02:02

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ ఆవిర్భవించి, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి శుక్రవారంతో రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సాధించిన విజయాలను జనంలోకి తీసుకు వెళ్లాలని టిఆర్‌ఎస్ ఏర్పాట్లు చేసుకోగా, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆశనిపాతంగా మారింది.

12/02/2016 - 02:00

హైదరాబాద్, డిసెంబర్ 1: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా వశిష్ట జోహ్రి పదవీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ 1975వ, బ్యాచ్‌కు చెందిన వశిష్ట జోహ్రి 1979లో ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా చేరారు. లక్నో, ముంబయి, విజయవాడ జోన్‌లలో సమర్థవంతంగా పనిచేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

12/02/2016 - 01:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశంలో గురువారం ఒకవైపు విమానాలలో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఎటిఎఫ్) ధర తగ్గగా, సామాన్య జనం సహా అధిక సంఖ్యలో ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువు అయిన సబ్సిడీ వంటగ్యాస్ (ఎల్‌పిజి) ధర పెరిగింది. ఎటిఎఫ్ ధర 3.7 శాతం తగ్గగా, సబ్సిడీపై అందజేసే ఎల్‌పిజి ధర సిలిండర్‌కు రూ. 2.07 శాతం చొప్పున పెరిగింది. సబ్సిడీ వంట గ్యాస్ ధర పెరగడం గత ఆరు నెలల్లో ఇది వరుసగా ఏడోసారి.

12/02/2016 - 01:58

కాకినాడ, డిసెంబరు 1: ఎపి ఎంసెట్-2017ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇందుకు సంబంధించిన ఏజన్సీ ఎంపికకు కసరత్తు ప్రారంభమయ్యింది. 2017 ఏప్రిల్‌లో ఎపి ఎంసెట్‌ను నిర్వహించడానికి కాకినాడ జెఎన్‌టియు ఏర్పాట్లు చేస్తోంది. గత మూడేళ్లుగా ఎంసెట్‌ను కాకినాడ జెఎన్‌టియు నిర్వహిస్తోంది.

Pages