S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 00:10

నర్సీపట్నం, డిసెంబర్ 1: బాక్సైట్ ఖనిజాన్ని తరలించుకు పోయేందుకే విశాఖ ఏజన్సీలో ప్రభుత్వం పోలీస్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేస్తోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. గిరిజనులకు సురక్షిత తాగునీటిని అందించేందుకు నిధులు లేవని చెబుతున్న పాలకులు అవుట్ పోస్టుల ఏర్పాటుకు ఎక్కడ నుండి నిధులు వస్తున్నాయని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

12/02/2016 - 00:09

సబ్బవరం, డిసెంబర్ 1: మండలంలోని అసకపల్లిపంచాయతీ పరిధిలోని దామోదర సంజీవయ్యనేషనల్ యూనివర్శిటీ ప్రాంగణంలోపలకి విశాఖ నగరపాలక సంస్థ నిర్మించనున్న 100 అడుగుల రోడ్డు పనులను నిర్వాసితులు గురువారం అడ్డుకున్నారు.

12/02/2016 - 00:08

శ్రీకాకుళం, డిసెంబర్ 1: పేదవాడి అభివృద్ధి కోసం భారత ప్రధాని నరేంద్రమోదీ అనేక పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నారని బీజేపి జాతీయ మహిళా మోర్చా ఇంఛార్జ్ దగ్గుబాటి పురంధ్రేశ్వరి అన్నారు. బీజేపి ప్రశిక్షణా-మహాభియాన్ జిల్లా స్థాయి శిబిరం రెండవ రోజు కార్యక్రమానికి ఆమె హాజరై కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు.

12/02/2016 - 00:07

శ్రీకాకుళం, డిసెంబర్ 1: ఆరుగాళం కష్టపేడ అన్నదాతలను ప్రకృతి వైపరిత్యాలు ఉరుకులు పరుగులు పెట్టించడం పరిపాటే. ఈ ఏడాది ఖరీఫ్ ఆటంకాలన్నీ దాటుకొని పంట కల్లాలకు చేర్చేందుకు మరింత ఆసక్తి కనబరిచిన రైతాంగాన్ని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘నాడా’ తుఫాన్ దడ పుట్టిస్తుంది.

12/02/2016 - 00:06

శ్రీకాకుళం, డిసెంబర్ 1: జిల్లాలో విద్యకు పెద్దపీట వేస్తున్నామని, విద్యావ్యస్థను మరింత పటిష్ట పరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్థులకు యూనిఫారాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

12/02/2016 - 00:06

శ్రీకాకుళం, డిసెంబర్ 1: శ్రీకాకుళం నగర పాలక సంస్థకు అరుదైన గౌరవం దక్కింది. బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతంగా గుర్తిస్త్భూరత ప్రభుత్వం స్వచ్ఛ్భారత్‌మిషన్ స్వచ్ఛ ధృవీకరణ పత్రంను అందజేసిందని నగర పాలక సంస్థ కమీషనర్ పి ఏ శోభ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ్భారత్ మిషన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఇటీవల నగర పాలక ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారన్నారు.

12/02/2016 - 00:05

ఆమదాలవలస, డిసెంబర్ 1: ఈశాన్యరుతుపవనాలు కారణంగా గురువారం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఛాయలు సాయంత్రానికి తీరం దాటినట్లు స్థానిక కృషివిజ్ఞాన్ కేంద్రం వాతావరణ పరిశోధాన శాస్తవ్రేత్త కె.జగన్నాధశర్మ తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడిన ఈదురగాలులు , తుఫాన్ బలహీన పడిందని దీని వలన ఉత్తరాంధ్రా జిల్లాలకు శుక్రవారం పొడిగాలి వ్యాపిస్తుందని ఆయన తెలిపారు.

12/02/2016 - 00:05

శ్రీకాకుళం(రూరల్),డిసెంబర్ 1: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెల్లకార్డుదారులకు ముందస్తు రుణం ఇస్తామనడం కార్యకర్తలతో లాభం చేకూరుతుందని వైకాపా జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు పేర్కొన్నారు.

12/02/2016 - 00:03

కాకినాడ, డిసెంబరు 1: జిల్లాలోని వ్యాపార వర్గాల సేల్స్ కష్టాలు పతాకస్థాయికి చేరాయి. ప్రభుత్వ ఆదేశాలను నూటికి నూరు శాతం అమలుచేసి, లక్ష్యాన్ని పూర్తిచేసేయాలన్న తాపత్రయంతో ప్రభుత్వ యంత్రాంగం దుకాణదారులపై పడింది. పెద్ద వ్యాపార సంస్థల నుండి చిన్నా చితకా దుకాణాల వరకు స్వైపింగ్ యంత్రాల ఏర్పాటు తప్పనిసరంటూ స్పష్టం చేస్తుండటంతో వ్యాపారులు యంత్రాల కోసం ఉరుకుల పరుగులతో సాగుతున్నారు.

12/02/2016 - 00:02

రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: పెద్దనోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరు బ్యాంకర్లు బాసటగా నిలిచారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నోట్ల రద్దు, చిల్లర సమస్యల కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలతో సహా వర్తకులు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దనోట్లు రద్దు చేసి మూడు వారాలు గడుస్తున్నా సామాన్య, మధ్య తరగతి ప్రజల చేతికి సరిపడా డబ్బు అందలేదు.

Pages