S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/21/2016 - 14:03

గుంటూరు: కాపులు, బీసీల మధ్య చిచ్చుపెట్టేలా ప్రభుత్వం, మంజునాథ కమిషన్‌ వ్యవహరిస్తోందని అనుమానం కలుగుతోందని, స్మార్ట్‌ సర్వేలో కాపులను లెక్కించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని జిల్లా కాపు జేఏసీ ఆరోపించింది. మంజునాథ కమిషన్‌ కాపులు, బీసీలను వేర్వేరుగా పిలిచి మాట్లాడాలని జిల్లా కాపు జేఏసీ డిమాండ్ చేసింది.

09/21/2016 - 14:01

తిరుపతి: ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్ గుణశేఖర్‌ను టాస్క్‌ఫోర్స్ బుధవారం అరెస్ట్ చేసింది. దాదాపు 200 టన్నుల ఎర్రచందనాన్నిగుణశేఖర్‌ తరలించినట్టు పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా గుమ్మడిపూడి మాజీ ఎమ్మెల్యే వేణుకు గుణశేఖర్ ప్రధాన అనుచరుడిగా తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్ముతో రాజకీయంగా ఎదిగేందుకు గుణశేఖర్ యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

09/21/2016 - 13:56

దిల్లీ : కేంద్రఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం భేటీ అయ్యారు. విభజన అంశాలు, ఇటీవల ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత అంశంపై చర్చించినట్లు సమాచారం. భేటీలో సీఎంతో పాటు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీలు తోట నరసింహం, సీఎం రమేష్‌ పాల్గొన్నారు.

09/21/2016 - 13:52

ముంబయి: ముంబయిలో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో సందీప్‌ పాటిల్‌ స్థానంలో భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్స్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ సెలక్షన్స్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమితుడైన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు. ఎమ్మెస్కే భారత్‌ తరపున 6 టెస్టులు, 17 వన్డేలు ఆడారు.

09/21/2016 - 12:11

హైదరాబాద్: భారీ వర్షాల ఫలితంగా జనజీవనం అతలాకుతలం కావడంతో రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించారు. పలు మండలాలోల వర్షాల పరిస్థితిని జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, జలమయమైన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

09/21/2016 - 12:10

దిల్లీ: హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ఆస్తి,ప్రాణనష్టం నివారించేందుకు, అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. దిల్లీలో ఉన్న ఆయన బుధవారం ఈమేరకు జిహెచ్‌ఎంసి, ఇతర శాఖల ముఖ్య అధికారులతో ఫోన్‌లో మాట్లాడి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

09/21/2016 - 12:10

హైదరాబాద్: ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు విచారణలో ఉండగా టిడిఎల్‌పి (తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం) తెరాసలో విలీనం అయినట్లు స్పీకర్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసుపై బుధవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై కోర్టు విచారించింది.

09/21/2016 - 12:02

నల్గొండ: భారీ వర్షాలతో నల్గొండ జిల్లాలో మూసీ నదికి బుధవారం ఉదయం వరద ఉధృతి పెరిగింది. మూసీ పొంగిపొర్లడంతో బీబీనగర్‌-పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ప్రస్తుతం మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 645.4 అడుగులకు చేరింది. దీంతో ఐదు గేట్లను ఎత్తివేసి 15,900క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.

09/21/2016 - 12:00

హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్ ప్రమాదకరస్థాయిలో ఉన్నందున లోతట్టు ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుధవారం ఉదయం హెచ్చరికలు జారీ చేశారు. హుస్సేన్‌సాగర్‌ దగ్గర పరిస్థితిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి సమీక్షించారు.

09/21/2016 - 11:58

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నర్సన్నపేట, శ్రీకాకుళం మండలాల్లో బుధవారం భారీ వర్షం పడింది.

Pages