S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/21/2016 - 22:47

ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ సంగీతం అందిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌ను మిలియన్ క్లిక్స్ డిస్క్ వేడుకతో సత్కరించారు.

09/21/2016 - 22:47

నేచురల్ స్టార్ నాని హీరోగా వర్మ దర్శకత్వంలో కేవా మూవీస్ పతాకాలపై అందిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మజ్ను’. ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని ‘యు/ఎ’ సర్ట్ఫికెట్ పొందింది. సెప్టెంబర్ 23న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ..

09/21/2016 - 22:45

గతంలో ‘అవును’ లాంటి హారర్ చిత్రాల్లో నటించిన పూర్ణ, మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తోంది. భీమవరం టాకీస్ పతాకంపై పూర్ణ, గీతాంజలి ప్రధాన తారాగణంగా శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ రూపొందిస్తున్న హారర్ ఎంటర్‌టైన్‌మెంట్ అవంతిక. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

09/21/2016 - 21:56

‘జిల్’, ‘సౌఖ్యం’ వంటి చిత్రాల తరువాత హీరో గోపీచంద్ దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో ‘ఆక్సిజన్’అనే చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతోపాటు గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్‌లో కూడా మరో చిత్రాన్ని ఖాయం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22నుండి బ్యాంకాక్‌లో మొదలుకానుంది.

09/21/2016 - 21:55

పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా హైదరాబాద్‌లో రూపొందిస్తున్న కాటమరాయుడు చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్ మరార్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 15 రోజులపాటు తొలి షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో అలీ, అభిమన్యుసింగ్, రావు రమేష్ పాల్గొననున్నారు.

09/21/2016 - 17:24

శ్రీనగర్: సిఆర్‌పిఎఫ్, జమ్ముకాశ్మీర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాదులకు సంబంధించిన భారీ డంప్‌ను సైన్యం బుధవారం స్వాధీనం చేసుకుంది. ఈ డంప్‌లో ఏకే56 రైఫిల్, స్నిఫర్ రైఫిల్, మిషన్ గన్, ఇతర పేలుడు పదార్ధాలు, పెద్ద ఎత్తున బుల్లెట్లు లభించాయి. త్రాల్‌లోని కమ్లా అటవీ ప్రాంతంలో డంప్‌ బయటపడింది.

09/21/2016 - 17:22

దిల్లీ: దిల్లీ లోని ప్రముఖ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆస్పత్రి నుంచి రోగులను ఖాళీ చేయిస్తున్నారు.

09/21/2016 - 17:20

దిల్లీ: కృష్ణా జలాల పంపకంపై ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం బుధవారం ముగిసింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు.రెండు రాష్ట్రాలు ప్రజెంటేషన్‌ ఇచ్చాయి.

09/21/2016 - 17:18

దిల్లీ: కృష్ణా జలాల లభ్యత ఆధారంగా అంచనా వేసి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు దామాషా ప్రకారం నీటి పంపిణీని చేస్తామని, దీనిని ఇరు రాష్ట్రాలు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. కేంద్రం జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. కృష్ణా జలాల అంశంపై బుధవారం దిల్లీలో నిర్వహించిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో మూడు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు.

09/21/2016 - 16:28

వాషింగ్‌టన్: ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా పాక్‌ను పేర్కొంటూ అమెరికాలోని ఇద్దరు కీలక చట్టసభ సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లిక్ పార్టీకి చెందిన టెడ్ పో, ఉగ్రవాదంపై కాంగ్రెస్ కమిటీ సభ్యుడైన డెమోక్రాట్ డానా రోహ్రబచర్ సంయుక్తంగా- హెచ్ ఆర్ 6069 అనే బిల్లును సభ ముందుకు తెచ్చారు.

Pages