S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 06:32

భలే రైలింజన్ డ్రయివర్ దొరికాడు స్పానిష్ గవర్నమెంటు వారి రైల్వే కంపెనీ- ‘రెనే్ఫ’కి. బుల్లెట్ ట్రయిన్ అంటే టైముకి ముందు బాణంలాగా దూసుకుపోతుంది అనుకుని స్పెయిన్‌లోని శాంక్ టెండర్ నుంచి మాడ్రిడ్‌కి బల్లెట్ ట్రెయిన్ ఎక్కిన నూట తొమ్మిదిమంది ప్యాసింజెర్లు నాలిక్కర్చుకున్నారు.

09/22/2016 - 06:30

కేన్ మోర్గాన్ (82), షెర్లీ మోర్గాన్ (76) జంట పోయినవారం వైవాహిక జీవిత వజ్రోత్సవం ( అరవై ఏళ్ళు) జరుపుకున్నారు ఆనందంగా. బహుమతిగా ఆమెకు భర్త ఏమిటిచ్చాడనుకుంటున్నారు? 1956 నాటి మోడల్ డబుల్ డెక్కర్ బస్సు. మ్యూజియమ్‌లు, పాత వస్తు సముదాయ దుకాణాలు- అన్నీ వెదికి వెదికి- అలనాటి మాడల్ పాత డబుల్ డెక్కర్ బస్సును పట్టుకున్నాడు. పదమూడువేల పౌండ్లకి దానిని తక్షణం కొన్నాడు మోర్గాన్.

09/22/2016 - 06:28

‘‘కుటుంబ నియంత్రణ పాటించండి. ఇద్దరే ముద్దు. ముగ్గురు వద్దు’’ అంటూ ప్రచారం చేసే భారతదేశానికి జపాన్ వేపు చూస్తే, ముక్కున వేలేసుకోబుద్ధివేస్తుంది.

09/22/2016 - 06:20

దేశంకోసం, స్వాతంత్య్రంకోసం సర్వస్వం త్యాగం చేసి రాజకీయ నాయకులను చూసిన దేశంలోనే అవినీతి, అక్రమాలలో కూరుకుపోయిన నేతలనూ చూస్తున్నాం. ఒకపుడు ఉన్నదంతా పంచేసి, పూరిళ్లలో చరమాంకాన్ని గడిపిన నేతలు ఎందరో ఉండగా, కళ్ల ముందే అంతస్తులకు అంతస్తులు స్వర్గ్ధామాలను నిర్మించుకుంటూ విలాసవంతమైన జీవితాలను గడుపుతున్న నేతలు రాత్రికి రాత్రి అంత ధనవంతులు ఎలా అవుతున్నారనేది అందరికీ తెలిసిన సత్యమే.

09/22/2016 - 06:20

కొంతమంది రాజకీయ నాయకులు నేర చరిత్ర ఉన్నవారితో సత్సంబంధాలు కొనసాగించడం దురదృష్టకరం. దీంతో పేద ప్రజలకు, సమాజానికి సేవ చేయాలన్న నాయకుల పవిత్ర లక్ష్యం నెరవేరడం లేదు. ఇటీవల జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నది. ప్రజలకు రాజకీయ నాయకులను అసహ్యించుకునే పరిస్థితి కనిపిస్తున్నది.

09/22/2016 - 06:19

నేరాలు, రాజకీయాలు కలిసి పోయాయి, రెండింటిని వేరువేరుగా చూడలేని పరిస్థితికి చేరుకున్నాం. రాజకీయాలు పూర్తిగా కలుషితం అయ్యాయి. ఇప్పట్లో ఇవి మారుతాయి అనే నమ్మకం కలగడం లేదు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో తిరిగి గెలవాలంటే దానికి తగ్గట్టు ఖర్చు చేయాలి. దీని కోసం ఎలాంటి అడ్డదారులకైనా తెగిస్తున్నారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది.

09/22/2016 - 06:08

రాజరిక పాలన వ్యవస్థలో రాజులు రాజ్యమేలితే..నేరస్తులు నేరాలకు పాల్పడే వారు. ప్రజల తిరుగుబాటుతో రాజులు రాజరికానికి దూరం కాగా, నేరస్తులు నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఇది నాటి పాలన వ్యవస్థ. ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థలో నేరం, రాజకీయం సమాజాన్ని అస్తవ్యస్తం చేసిందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఎవరు..ఏం చేస్తున్నారు. ఎవరికి, ఎవరు తెలియని పరిస్థితి. రాజకీయాలు అనేవి ఇంద్రధనుస్సులా మారాయి.

09/22/2016 - 06:08

రాజకీయ పార్టీలు నేరగాళ్లను పొంచిపోషించే సంస్కృతిని విడనాడాలి. లేనిపక్షంలో ఆ నేరగాళ్లే కాలనాగులా తయారై సమాజాన్ని కాటేస్తారు. ఉదాహరణకు తెలంగాణలో నరుూమ్ చరిత్రనే చూడండి. నరుూమ్ పూర్వాశ్రమంలో నక్సలైట్. అతనిని లొంగదీసుకున్న పోలీసులు, ప్రభుత్వం స్వప్రయోజనాలకు వాడుకుంది. ఫలితంగా లబ్ధిని పొందారు. ఇక్కడ బ్యూరోక్రసీ, లెజిస్లేచర్ కుమ్మక్కై ఒక నేరగాడిని చేరదీశాయి.

09/22/2016 - 06:06

నేరస్థులతో రాజకీయ నాయకులు సంబంధాలు పెట్టుకుంటే నేరస్థులతో సమానంగా శిక్ష పడేలా చట్ట సవరణ చేయాలి. అందుకు రాజకీయాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. సంస్కరణలు రానంతవరకూ ఈ పరిస్థితులు కొనసాగుతాయి. ఎంపి, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులుగా పోటీచేసే వారు లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

09/22/2016 - 05:17

నిజాం కాలంలో నిరంకుశపాలన సాగినరోజుల్లో, రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు వామపక్షాలు ప్రజాఉద్యమాన్ని తీసుకువచ్చాయి. నిజాంనిరంకుశపాలన నుండి ప్రజలను విముక్తుల్ని చేశాయి. ఇప్పుడు భూస్వాములు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, కార్పోరేట్ సంస్థల యజమానులు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. పేద ప్రజలను దోచుకుంటున్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు మరో ప్రజాఉద్యమం రావలసి ఉంది.

Pages