S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/21/2016 - 16:18

దిల్లీ: లైంగిక వేధింపుల కేసులలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను దిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఖాన్‌ బంధువుగా చెప్తున్న 32 ఏళ్ల మహిళ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఖాన్‌ తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతపెడుతున్నాడని 32 ఏళ్ల మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

09/21/2016 - 16:14

దిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశంపై చర్చిచేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ బుధవారం దిల్లీలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో వాదనలు వినిపించేందుకు రెండు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి.

09/21/2016 - 16:12

అంకారా: టర్కీలోని ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం వద్ద బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఎంబసీలోకి చొరబడేందుకు యత్నించగా, ఆ వ్యక్తిని అదుపు చేయడానికి కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో టర్కీలోని అన్ని దౌత్యకార్యాలయాలను వారం క్రితమే మూసివేశారు.

09/21/2016 - 14:50

హైదరాబాద్: ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, మంత్రి తలసానిని కేబినెట్ నుంచి తప్పించాలని టీ. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో తలపెట్టిన రైతుదీక్ష పోస్టర్‌ను రావుల బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పుల బాధతో రాష్ట్రంలో 2600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.

09/21/2016 - 14:42

ఢిల్లీ : రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ రూపకల్పన, సమర్పణలకు సంబంధించిన మొత్తం విధానాన్ని సంస్కరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరుగా ప్రవేశపెడుతున్నారు.

09/21/2016 - 14:39

ఢిల్లీ : న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ ముట్టడికి బుధవారం యత్నించారు. పోలీసులు అడ్డుకుని నిరసనకారులను అరెస్టు చేశారు. యూరీ దాడి వెనుక పాక్‌ హస్తం ఉందంటూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జమ్మూలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. అహ్మదాబాద్‌లో ముస్లిం వర్గాలు పాక్‌ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాయి.

09/21/2016 - 14:35

న్యూఢిల్లీ: వచ్చే కేంద్ర కేబినెట్‌ భేటీలో ఏపీ ప్యాకేజీకి ఆమోదముద్రతో పాటు చట్టబద్ధత కల్పిస్తామని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. అపెక్స్‌ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాతో పదేళ్లలో వచ్చే సాయం ఏపీకి రెండేళ్లలోనే వచ్చేలా చర్యలు తీసుకుంటామని జైట్లీ హామీ ఇచ్చినట్లు సమాచారం.

09/21/2016 - 14:30

బంగ్లాదేశ్ : ఉగ్రవాదానికి మద్ధతు పలికే ఏ దేశమైనా తమకు శత్రువేనని, యురిలో భారత సైనికులపై పాకిస్థాన్ చేసిన ఉగ్రదాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ అసద్‌జమాన్ ఖాన్ కమాల్ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు. 1971 నుంచి బంగ్లాకు, భారత్‌కు మిత్రుత్వం ఉందని, క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు అండగా నిలుస్తామని అసద్‌జమన్ స్పష్టం చేశారు.

09/21/2016 - 14:27

శ్రీనగర్‌ : కా శ్మీర్‌లోని యూరీ, నౌగామ్‌లో బుధవారం ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. యూరీ వద్ద సరిహద్దు దాటి వచ్చేందుకు 12 నుంచి 15 మంది ఉగ్రవాదులు ప్రయత్నించారు. 10 మంది ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది. నౌగామ్‌లో ఐదారుగురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. నౌగామ్‌లో ఒక ఆర్మీ జవాను చనిపోగా , మరో ఇద్దరు గాయపడ్డారు. ఇంకా సరిహద్దులోని కొన్ని ప్రాంతాల నుంచి ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు.

09/21/2016 - 14:06

గుంటూరు: రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో బుధవారం లోకేష్‌ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. పార్టీ సభ్యత్వ నమోదు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, పార్టీలో చేరికలపై ప్రధానంగా చర్చించనున్నారు.

Pages