S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 00:15

ఉట్నూరు, ఆగస్టు 29: ఐటిడిఏలో నిర్వహించే గిరిజన దర్బార్‌కు వచ్చే ఆర్జీలను పరిశీలించి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ ఆధికారులను ఆదేశించారు. సోమవారం ఐటిడి ఏ పరిపాలన భవనంలో గిరిజన దర్బార్‌కు హాజరై గిరిజనుల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సంధర్భంగా పివో మాట్లాడుతూ గిరిజన దర్బార్‌కు అధికారులు తప్పనిసరిగా పూర్తిసమాచారంతో హాజరుకావాలని అన్నారు.

08/30/2016 - 00:15

ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 29: ఆయా పోలీసు స్టేషన్‌లలో బాధితులు అందించిన ఆర్జీలపై పోలీసులు అధికారులు బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం అదనపు ఎస్పీ జిఆర్ రాధిక సమక్షంలో నిర్వహించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 12 మంది ఫిర్యాదుదారులు తమ ఆర్జీలను అందించి, సమస్యలను వివరించారు.

08/30/2016 - 00:15

ఆదిలాబాద్, ఆగస్టు 29: జవాబుదారితనంతో పారదర్శకంగా డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉదయం 10 గంటల నుండి గంట పాటు నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ ప్రోగ్రామ్ ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 21 మంది వారి సమస్యలు నేరుగా కలెక్టర్‌కు ఫోన్‌లో వివరించారు.

08/30/2016 - 00:14

నిర్మల్ రూరల్, ఆగస్టు 29 :సరస్వతీ కాలువద్వారా వారబంధీ పద్దతిలో విడుదలవుతున్న సాగనీటిని సద్వినియోగం చేసుకోని రైతులు పంటల సాగుపై దృష్టి కేంద్రీకరించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాఫ్రాపూర్‌లో సోమవారం పశువులకు మంత్రి నట్టల నివారణ మందును వేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ రైతులు వారబంధీ కాకుండా పంటల సాగుకు ఈ దఫా రోజు వారిగా సాగు నీటిని విడుదల చేయాలని కోరారు.

08/30/2016 - 00:14

ఆదిలాబాద్, ఆగస్టు 29: క్రీడారంగంలో ఉన్నత స్థాయి ప్రమాణాలు నెలకొల్పి జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోందని, ఒలంఫిక్ విజేత పివి సింధును స్పూర్తిగా తీసుకొని క్రీడాకారులు తమ నైపుణ్యతను ప్రదర్శించాలని రాష్ట్ర అటవీ,పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు.

08/30/2016 - 00:12

సిద్దిపేట అర్బన్, ఆగస్టు 29: సిద్దిపేట మండలంలోని ఖాళీ అయిన వార్డు మెంబర్లకు నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. మండలంలోని చింతమడ్కలో 8వ వార్డుకు ముగ్గురు శ్రీనివాస్, మహేశ్, సురేశ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

08/30/2016 - 00:12

సిద్దిపేట, ఆగస్టు 29 : ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితమైందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. స్థానిక కొత్త బస్టాండ్‌లో మూడు మెట్రో ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించారు. మంత్రి హరీష్‌రావు బస్సులో టికెట్ తీసుకొని కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 లక్షల రూపాయలతో అన్ని హంగులతో కూడిన ఆధునాతన బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

08/30/2016 - 00:11

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 29: అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ముందు జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌లు క్రీడా జ్యోతి వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.

08/30/2016 - 00:11

తొగుట, ఆగస్టు 29: మండలంలోని మల్లన్నసాగర్ భూనిర్వాసిత గ్రామమైన వేములగాట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన భూనిర్వాసిత పోరాట కమిటీ రాష్ట్ర కన్వినర్ బి.వెంకట్ బృందాన్ని పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపిన సంఘటన సోమవారం నాడు జరిగింది. వేములగాట్ గ్రామంలో ప్రజలను కలిసి కోర్టు తీర్పులను వివరిస్తామని, ప్రజలకు బరోసా కల్పించేందుకు వచ్చామని చెప్పినా పోలీసులు అడ్డుకున్నారని ఆయన తెలిపారు.

08/30/2016 - 00:10

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 29: డబ్బులిస్తాం టాయిలెట్స్ నిర్మించుకోండి అనే నినాదం కాకుండా టాయిలెట్స్ నిర్మించుకుంటే కుటుంబాలకు కలిగే లాభాలను ప్రజల్లోకి తీసుకెళితే మంచి స్పందన వస్తుందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సర్పంచ్‌లు, అధికారులకు సూచించారు.

Pages