S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

,
08/29/2016 - 21:04

మద్రాస్ టి.నగర్‌లోని నారాయణ కేఫ్. అక్కడ రెండు పొడగాటి చెట్లు. ఎప్పుడు చూసినా -వాటికింద నిలబడి అప్పటి బిజీ నటుడు సియస్‌ఆర్‌తో మరో పొడగాటి నటుడు మిత్రులతో కబుర్లు చెపుతూ కనపడేవారు. ఆ పొడగాటి నటుడే హాస్య పాత్రల ద్వారా తెలుగువారి హృదయాలను దోచుకున్న రమణారెడ్డి.

08/29/2016 - 20:58

దశాబ్ద కాలంపాటు స్టార్ హీరోయిన్ వెలుగు వెలిగిన త్రిషకు -సెకండ్ ఇన్నింగ్స్ కలిసిరావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా -హిట్ దక్కడం లేదు. కనీసం ‘నాయకి’తోనైనా భయపెడదామనుకుంటే -ఆమె ప్రయత్నమే బెదిరిపోయింది. దీంతో -మరింత స్లిమ్ మేకోవర్ కోసం జిమ్‌లో అహోరాత్రులు కష్టపడుతోంది. కష్టం ఊరికే పోలేదు. ఆమెను ‘సామి’ కరుణించాడు. అప్పట్లో తమిళంలో హిట్ కొట్టిన ‘సామి’ రీమేక్ రెడీ అవుతోంది.

08/29/2016 - 20:56

హాట్ భామ శ్రద్ధదాస్‌కు టాలీవుడ్ కలిసిరాలేదు. వొళ్ళు దాచుకోకుండా ఎన్నిరకాల కష్టపడినా -కమర్షియల్ బ్రేక్ కనుచూపుమేరలో కనిపించటం లేదు. ఇక బాలీవుడ్ నుంచి నరుక్కొద్దామనుకున్న తరుణంలో -‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ అడల్డ్ కామెడీ అచ్చిరావడంతో ‘అడల్డ్’ ఛాన్స్‌లు అమ్మడి ఇంటిముందు క్యూగట్టాయి. కెరీర్ బోటు స్టడీగా లేనప్పుడు -దొరికిన గడ్డిపూచతోనే సాగరాన్ని ఈదే ఆలోచనతో లేటెస్ట్‌గా ఓ హాట్ ఫొటోషూట్ చేసింది.

08/29/2016 - 20:54

తెలుగులో బీరువా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సురభికి -ప్రాజెక్టు మంచి పేరు తెచ్చినా బ్రేక్ మాత్రం ఇవ్వలేకపోయింది. తరువాత తెలుగులో ఒకటో రెండు చాన్స్‌లు దక్కినా -వావ్ అనిపించుకునే టైం కలిసిరాలేదు. ఈమెతో తెరగేట్రం చేసిన హీరోయిన్లు రేంజ్ పెంచుకుంటే -అందగత్తె సురభి మాత్రం ఎక్కడో ఉండిపోయింది.

08/29/2016 - 20:52

తెలుగు సినిమాను ఓ కొత్త ఒరవడిలోకి నడిపించిన చాలా సినిమాల్లో -మానవుడు దానవుడు కూడా ఒకటి. ఒక మనిషి రెండు జీవితాలను అనుభవిస్తూ పగలు ప్రాణం పోసే వైద్యుడిగా (వేణు), చీకటిన ప్రాణం తీసే కిరాతకుడిగా (జగన్) శోభన్‌బాబు పోషించిన పాత్రలు అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రం చూసినప్పుడే మైండ్‌లో రిజిస్టరైపోయింది. నాలుగు దశాబ్దాల పైచిలుకు కాలం గడిచినా, మర్చిపోలేనంత ముద్రవేసింది. అదే -మానవుడు దానవుడు.

08/29/2016 - 20:50

1991లో విడుదలైన ‘పెళ్ళి పుస్తకం’ చిత్రానికి ఆరుద్ర కలంనుండి జాలువారిన అద్భుత గీతం- శ్రీరస్తూ శుభమస్తూ. ఈ పాట అప్పటి నుంచి ఇప్పటి వరకూ పెళ్ళిపీటల మీదనున్న వధూవరులకు వినిపించే సందేశ గీతమిది. ముఖ్యంగా కొత్త పెళ్ళికూతురుకి కొన్ని సూచనలివ్వబడ్డాయి. ‘శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం’- అంటే ఇద్దరిమధ్యా వివాహ బంధం ఏర్పడిందని.

08/29/2016 - 18:01

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ శివారులో ఫ్రైడ్‌ ఇండియా గ్రూప్‌ వేసిన రూ 200 కోట్లు విలువైన వెంచర్‌ వెనుక నయీం హస్తం ఉందని తాజాగా సిట్‌కు పిర్యాదు అందింది. ఫ్రైడ్‌ ఇండియా వెంచర్‌ యజమానులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్కడ దేవతల గుట్టమీద ఉన్న దేవాలయాన్ని కూల్చివేశారని కొన్నాళ్లుగా స్థానికులు ఆందోళన చేశారు.

08/29/2016 - 17:59

చిత్తూరు: కురబలకోట మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయాధికారులు సహకరించడంలేదని ఓ రైతు ఫిర్యాదు చేశాడు. అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట సంజీవిని, రెయిన్‌గన్ల పనితీరును సీఎం పరిశీలించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే ఇంజినీర్లకు మెమోలు జారీ చేస్తామని, ఎరువులను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

08/29/2016 - 17:57

విజయవాడ: నలుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన హెడ్మాస్టర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 9 లక్షల జరిమాన విధిస్తూ కృష్ణాజిల్లాలోని ప్రోక్సో స్పెషల్‌ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. పమిడిముక్కల మండలం ముత్రాసిపాలెం మండల పరిషత్ పాఠశాల హెడ్‌ మాస్టర్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Pages