S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 00:10

దౌల్తాబాద్, ఆగస్టు 29: దౌల్తాబాద్ మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. చివరి రోజైన సోమవారం గ్రామానికి చెందిన తప్పటి జయలక్ష్మి, మిద్దెల లక్ష్మి అట్టహాసంగా నామినేషన్‌లు దాఖలు చేశారు. దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అభ్యర్ధుల వెంబడి వందలాది మంది గ్రామస్థులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

08/30/2016 - 00:09

సిద్దిపేట, ఆగస్టు 29: సిద్దిపేటలో క్రీడా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. క్రీడా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక మినీ స్టేడియంలో మంత్రి హరీష్‌రావు క్రీడాకారుల సమక్షంలో కేక్‌కట్ చేశారు. అనంతరం క్రీడాకారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడలు నిర్లక్ష్యానికి గురైనాయన్నారు.

08/30/2016 - 00:09

జగదేవ్‌పూర్, ఆగస్టు 29:సిఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలలోరాష్ట్ర విత్తనోత్పత్తి మేనేజర్ వెంకటేశ్వర్‌రావు, జనరల్ మేనేజర్ హెచ్‌కే సింగ్‌లు సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దత్తత గ్రామాలలో సాగవుతున్న సోయాబీన్ పంటల సాగులో తీసుకొవాల్సిన జాగ్రతలను వారు రైతులకు వివరించగా, సాగులోరైతులు తీసుకుంటున్న యాజమాన్యపద్దతులపై వారిని అడిగి తెలుసుకున్నారు.

08/30/2016 - 00:07

మిర్యాలగూడ, ఆగస్టు 29: వరుణుడు కరుణించాడు...వరుణుడి కరుణతో కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు నీటితో జళకళలాడుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు నీరు లేక ఒట్టిపోయి దర్శనమిచ్చిన చెరువులన్ని సోమవారం తెల్లవారు జామునుండి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మిర్యాలగూడ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో సేద్యం చేసిన మెట్టపంటలతోపాటు వరిపంటలు నీట మునిగాయి.

08/30/2016 - 00:06

నల్లగొండ, ఆగస్టు 29: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలను ఏర్పాటు చేస్తు ప్రభుత్వం చేసిన ముసాయిదా ప్రతిపాదనలపై ప్రజల నుండి భారీగా ఫిర్యాదులు, అభ్యంతరాలు అందుతున్నారు.

08/30/2016 - 00:05

నల్లగొండ రూరల్, ఆగస్టు 29 : టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరి మాటల ప్రభుత్వం కాదని, తమది చేతల ప్రభుత్వమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.

08/30/2016 - 00:05

నల్లగొండ, ఆగస్టు 29: లక్షలాది మంది తరలివచ్చిన కృష్ణా మహాపుష్కరాల క్రతువును నిర్విఘ్నంగా విజయవంతం చేయడంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉత్తమ సేవలే కారణమని ఇందుకు ఫ్రభుత్వం అందరిని అభినందిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు.

08/30/2016 - 00:04

నల్లగొండ టౌన్, ఆగస్టు 29: యాదాద్రి జిల్లా పరిధిలోని ఆత్మకూర్(ఎం) మండలంలోని చాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని కొండాపురం గ్రామాన్ని మోటాకొండురు మండలంలో కలుపడాన్ని వ్యతిరేకిస్తు గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు.

08/30/2016 - 00:04

నల్లగొండ, ఆగస్టు 29: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందడుగు వేస్తుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పగన్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బిజెపి పార్టీ కార్యాలయ భవనాన్ని ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి ప్రారంభించారు.

08/30/2016 - 00:02

కాలుష్య భారత్‌ను స్వచ్ఛ భారత్‌గా పునర్ నిర్మించడానికి ప్రధాని నరేంద్ర మోదీ పడుతున్న ఆరాటం మరోసారి ఆవిష్కృతమైంది. ఆదివారం తన మనసులోని మాటల-మన్‌కీ బాత్-ను దేశప్రజలకు వెల్లడించిన మోదీ పర్యావరణ పరిశుభ్రతను పరిరక్షించవలసిన బాధ్యతను మరోసారి గుర్తు చేశారు.

Pages