S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 00:01

తన ప్రభుత్వ పనితీరు, సాధించిన విజయాలు, ముందున్న లక్ష్యాల గురించి ప్రజలకు ‘ప్రగతి నివేదిక’ అందజేసే అవకాశాన్ని ప్రతి ప్రధానమంత్రికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటనుండి చేసే ప్రసంగం అవకాశం ఇస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడవసారి ఆవిధం గా ప్రసంగించారు. ఈ సందర్భంగా 90 నిముషాలకు పైగా ప్రసంగించి గత సంవత్సరం తాను సృష్టించిన రికార్డును అధిగమించారు.

08/29/2016 - 23:59

ఇంకా పునాదులు కూడా పడని అమరావతిలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. రెండు వేల ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో మన క్రీడాకారులు ప్రదర్శన మెరుగయ్యేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక కార్యచరణ పథకాన్ని తయారు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

08/29/2016 - 23:58

ప్రపంచ ఒలింపిక్ పోటీలలో బాడ్మిమింటన్‌లో రజతాన్ని పి.వి. సింధు, జిమ్నాస్టిక్‌లో కాంస్య పతకాన్ని దీపాకర్మాక్, రెజ్లింగ్‌లో సాక్షి కాంస్య పతకాన్ని సాధించి మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసారు. అందుకు వారు అభినందనీయులు- సన్మాన సత్కారార్హులు.

08/29/2016 - 23:57

ప్రభుత్వం ఉచితంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తూ భోజనం పెడుతున్నది. పాఠ్యపుస్తకాలు ఇ స్తోంది. ఉపకార వేతనాలు ఇస్తోంది. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వపరమైనవే వద్దని వేల రూపాయల డొనేషన్లు కట్టి, ప్రతి ఏటా వేలాది రూపాయల వార్షిక ఫీజులు ఒకేసారి చెల్లించడానికి వెనుకాడని పేద, మధ్యతరగతి వర్గాల వారికి, ప్రైవేటును ఆశ్రయించే వారికి ప్రభుత్వపరంగా ఉపకార వే తనాలు ఎందుకు ఇవ్వాలి?

08/29/2016 - 22:36

ఎందరో మహానుభావుల త్యాగఫలం
మన త్రివర్ణ జెండా
అందుకే ప్రతి ఒక్క భారతీయుడిలో
ఉండాలి నిజమైన దేశభక్తి గుండె నిండా
మూడు రంగుల జెండాయే కదరా
సమస్త భారతీయులకు అండ
నీతి నిజాయితీలతో ప్రతి ఒక్కరు మెలగాలి
అప్పుడే కదా దేశఖ్యాతి పాకుతుంది
ఖండాంతరాల గుండా
దేశ గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడే ఈ జెండాయే మనకు చల్లని నీటికుండ
మనమంతా ఒక్కటై బతకాలి

08/29/2016 - 22:33

సుభద్రాదేవి చాలా అందగత్తె. చిన్న వయసులోనే వివాహం జరిగింది. భర్త అన్నా, అతని అనురాగమన్నా పూర్తిగా తెలియకముందే ఇద్దరు పిల్లల తల్లైంది. మేనరికం కావడం వల్ల ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ఆమెకు ఇప్పుడు వయసు పెరుగుతోంది. భర్తకు ఆమెకు వయసు అంతరం పదేళ్లు కావడంవల్ల ఆమె మనసు కోరికల్ని అతడి వయసు తీర్చలేకపోతోంది. అలా స్వయంగా సుభద్రే అందరు అమ్మాయిల్లా అనుకుంటోంది.

08/29/2016 - 22:31

ప్రపంచంలోకెల్లా భారతదేశంలోని సంస్కృతీ సంప్రదాయాలు మానవుని జీవనానికి ఎంతో మేలు కలిగేలా తోడ్పడుతున్నాయి. ఎందరో రుషిపుంగవులు తమ జీవితాలను త్యాగం చేసి తపస్సులు, పరిశోధనలు చేసి ఆ సంప్రదాయాలను మనకు అందించారు. అయితే, పాశ్చాత్య సంస్కృతి మూలంగా ఇవి కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకున్నాయి. తత్ఫలితంగా మానవుని జీవన విధానం కూడా మారిపోతోంది. అంతా స్పీడ్ యుగం వచ్చేసింది.

08/29/2016 - 22:29

‘‘ఎందుకురా నాయనా మనకు తగవులు. ఇంటి వద్ద ఉండవచ్చు కదా’’ అంటూ కుమారుని వారించింది కిరణ్ తల్లి. కిరణ్‌ది పాతిక సంవత్సరాల వయస్సు. ఉడుకు రక్తం గల వయసది. రంగారావు ఆ గ్రామానికి నాయకుడు. ఆయన చేయని కుట్ర లేదు. ఆయన చేసిన ప్రతి పనిలోనూ ఉన్న అవినీతిని బయటికి లాగి ప్రజల ముందుంచే తత్వం కలవాడు కిరణ్. ఒకసారి కిరణ్ ఉంటున్న వీధికి సిమెంట్ రోడ్డు మంజూరు అయింది.

,
08/29/2016 - 22:20

రేపన్న రోజుకు రూపాయి దాచుకో. ఈ మాట -పెద్దలిచ్చిన చద్దిమూట. ఆచరించిన వాళ్లకు ఆనందం. కొట్టిపారేసినోళ్లకు కొండంత కష్టం.
***
రూపాయి విషయంలో-
పెద్దలిచ్చిన చద్దిమూటను ఈతరం సినీ స్టార్లు బాగానే ఒంటబట్టించుకుంటున్నారు. పైగా స్వర్ణయుగం కాలంనాటి ఆనవాళ్లు, అనుభవాలు చాలానే ఉన్నాయి కనుక -ఆర్థిక శాస్త్రాన్ని ఆధునికతకు అన్వయిస్తూ ‘ఆటవిడుపు’ సంపాదనపై దృష్టి పెడుతున్నారు.

08/29/2016 - 22:07

కాజల్ ఆనందానికి పట్టపగ్గాల్లేవ్. ఆ ఆనందంలోని తుళ్లింతే ఇది. కారణం -సీన్లోలేని పిల్ల స్క్రీన్ మీదకొచ్చేసింది మరి. 150వ చిత్రంలో చిరుతో జోడీ కట్టేదెవరన్న అంశంపై పెద్ద అధ్యయనమే జరిగింది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ఎందరినో పరిశీలించారు. అప్పట్లో ఆ జాబితాలో అసలు కాజల్ ఊసు లేదు. సీను క్లైమాక్స్‌కు చేరేసరికి మాత్రం -స్క్రీన్ మీదకు కాజల్ వచ్చింది. ఎలా? అంటే సస్పెన్స్.

Pages