S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 04:05

అనంతపురం, ఆగస్టు 6: రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని, అడ్డగోలుగా విభజనకు సహకరించిన పార్టీ నాయకులు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ విభజన పాపాన్ని కడిగేసుకునేందుకు రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని హితవు పలికారు. విభజన హామీలు నెరవేర్చేదాకా పోరాడుతామన్నారు.

08/07/2016 - 04:03

అనంతపురం సిటీ, ఆగస్టు 6: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుడంతో పాటు, రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్యను సిఎం ప్రారంభించారు. వర్షం నీటిని ఒడిసి పట్టేందుకు చేపట్టిన సంజీవనితో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

08/07/2016 - 04:01

రాజమహేంద్రవరం, ఆగస్టు 6: గోదావరి నది వరద ఉద్ధృతి నెమ్మదిగా పెరుగుతోంది. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలో కురుస్తోన్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద తాకిడి మొదలైంది. దీంతో క్రమేణా ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి వద్ద 10.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద గంట గంటకూ వరద నీటి మట్టం పెరుగుతోంది.

08/07/2016 - 03:59

అనంతపురం సిటీ, ఆగస్టు 6: రాష్టవ్య్రాప్తంగా యూనివర్సిటీల పరిధిలో ఖాళీగా ఉన్న 1104 అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్రంలోని అన్ని వర్శిటీల ఉపకులపతుల సమావేశం నిర్వహించారు.

08/07/2016 - 03:57

విశాఖపట్నం, ఆగస్టు 6: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బిసిల సమస్యల పరిష్కారం కోసం మిలిటెంట్ ఉద్యమం చేపట్టనున్నామని, ఇందుకు బిసిలంతా సిద్ధంగా ఉన్నారని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వానికి హెచ్చరించారు. విశాఖలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/07/2016 - 03:57

భద్రాచలం, ఆగస్టు 6: మావోయిస్టు పార్టీ శనివారం నిర్వహించిన బస్తర్ బంద్ ఉద్రిక్తతల నడుమ సాగింది. బూటకపు ఎన్‌కౌంటర్లు, మహిళలపై భద్రతాబలగాల అత్యాచారాలను నిరసిస్తూ బస్తర్ ప్రాంతంలోని బస్తర్, దంతెవాడ, సుక్మా, బీజాపూర్ జిల్లాల బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచే మావోయిస్టులు వరుస సంఘటనలకు పాల్పడ్డారు.

08/07/2016 - 03:56

విశాఖపట్నం(కల్చరల్), ఆగస్టు 6: జనరంజకమైన గీతాలతో సినీ అభిమానుల్ని ఆకట్టుకున్న ప్రసిద్ధ కవి డాక్టర్ జాలాది పేరిట జాలాది చారిటబుల్ ట్రస్టు నెలకొల్పిన జాతీయస్థాయి పురస్కార ప్రదానోత్సవం 9న కళాభారతిలో నిర్వహిస్తున్నట్టు ఎయు రిజిస్ట్రార్ వి.ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/07/2016 - 03:56

విజయనగరం(టౌన్), ఆగస్టు 6: భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారి ఎసిబి పన్నిన వలలో చిక్కిన సంఘటన శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలివి. జిల్లాలోని డెంకాడ మండలం బడ్డుకొండపేట గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి మూడున్నర ఎకరాల భూమిని గ్రామస్తులు నుండి కొనుగోలు చేశారు. ఈభూమి విలువ సుమారు 80లక్షల రూ.లు.

08/07/2016 - 03:55

కర్నూలు, ఆగస్టు 6: రాష్ట్రంలోని రైతులకు సాగునీటి రక్షణ కల్పించడానికి నిరంతరం శ్రమిస్తున్నామని, లోటు బడ్జెట్ ఉన్నా ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. కర్నూలులో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేశామన్నారు.

08/07/2016 - 03:54

విశాఖపట్నం, ఆగస్టు 6: ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకురాలు సుపర్ణ ఎస్.పచౌరీ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు విశాఖలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి ఇంటర్ స్టేట్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ ముగింపు శనివారం జరిగింది. 10 రాష్ట్రాల నుంచి వచ్చిన 38 మంది అధికారులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో క్షేత్ర పర్యటనలు చేశారు.

Pages