S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 02:10

వనస్థలిపురం, ఆగస్టు 5: టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి, కార్పొరేటర్ మధ్య జరిగిన వాగ్వాదంలో కార్పొరేటర్ బోరున విలపించిన సంఘటన హయత్‌నగర్ డివిజన్‌లో జరిగింది. డివిజన్ పరిధిలోని కమలానగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి, ఎల్‌బినగర్ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎం.రాంమోహన్ గౌడ్ శుక్రవారం హాజరయ్యారు.

08/06/2016 - 02:09

రాజేంద్రనగర్, ఆగస్టు 5: వ్యవసాయ విద్యలో నైపుణ్యం పెంపునకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు అన్నారు. శుక్రవారం వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాల ఆడిటోరియంలో నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావును విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రవీణ్‌రావు మాట్లాడుతూ..

08/06/2016 - 02:09

అల్వాల్, ఆగస్టు 5: అల్వాల్ సర్కిల్ పరిధిలో అక్రమంగా తాగునీటి కనెక్షన్‌లు ఉన్నవారు వెంటనే వాటిని క్రమబద్ధీకరించుకోవాలని జలమండలి అధికారులు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కార్యాలయం మంజూరు చేసిన నీటి కనెక్షన్‌ల వారికి మీటర్లు ఉన్నాయి.

08/06/2016 - 02:08

ఘట్‌కేసర్, ఆగస్టు 5: ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, హరితహారం, మిషన్ భగిరధ పథకాలపై శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది.

08/06/2016 - 02:07

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీకి టిఎన్‌ఎస్‌ఎఫ్ నేత మధు నేతృత్వంలో వినతిపత్రాన్ని సమర్పించారు.

08/06/2016 - 02:05

హైదరాబాద్, ఆగస్టు 5: అసలే వర్షాకాలం...ఎపుడు వాన పడుతుందో..ఎపుడు ఎండలొస్తాయో తెలియదు. పైగా నగరంలో చినుకు పడిందంటే చాలు రోడ్లపై రోజుల తరబడి వర్షపు నీరు వంటి కారణాలతో నగరం సుస్తీ అయ్యింది. గడిచిన కొద్దిరోజులుగా నగరంలో వైరల్ జ్వరాలు, మలేరియా, పైలేరియా, స్వైన్‌ఫ్లూ, డెంగీ వంటి వ్యాధులతో పాటు స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.

08/06/2016 - 02:06

హైదరాబాద్, ఆగస్టు 5: మహానగర పాలక సంస్థ అవినీతి జలగలకు నిలయంగా మారుతోంది. లంచాలు డిమాండ్ చేసినపుడు బాధితులు ఫిర్యాదు చేసినపుడు, గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదులు చేసినపుడు దాడులు నిర్వహిస్తున్న ఏసిబి అధికారులు వీరి అసలు రూపాన్ని బయటపెడుతున్నారు.

08/06/2016 - 02:03

హైదరాబాద్, ఆగస్టు 5: రోజూ నిద్ర లేవగానే మార్నింగ్ వాక్..పారిశుద్ధ్య పనుల తనిఖీతో పాటు వాకింగ్..ఆ తర్వాత ఆఫీసు హడావుడి మొదలైందంటే చాలు రోజంతా బిజీ బిజీగా ఉండే జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి శుక్రవారం నగరంలోని ఎల్బీనగర్, వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఆటవిడుపు కలిగింది.

08/06/2016 - 02:03

రాజేంద్రనగర్, ఆగస్టు 5: బైక్ రేసింగ్‌లకు పాల్పడవద్దని తల్లిదండ్రుల సమక్షంలో యువకులకు పలుమార్లు పోలీసులు కౌనె్సలింగ్ ఇస్తున్నా, వారిలో మార్పు రావడం లేదు. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందగా, రేసర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

08/06/2016 - 02:02

హైదరాబాద్, ఆగస్టు 5: ఎంసెట్-2 లీకేజీకి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డిని బాధ్యులుగా చేస్తూ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. శుక్రవారం టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన పార్టీ నాయకులు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎల్.

Pages