S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 02:18

మహబూబాబాద్ టౌన్, ఆగస్టు 5: ఎంసెట్-2 లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తు ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు వెంటనే రాజీనామా చేయాలని డోర్నకల్ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ రాంచంద్రునాయక్ అన్నారు. మానుకోట పట్టణంలోని స్థానిక ఆర్‌అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలన్నారు.

08/06/2016 - 02:17

ఏటూరునాగారం, ఆగస్టు 5: తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన సమ్మక్క పూజారి సిద్దబోయిన ఆనందరావు ఇటీవల ప్రమాదవశాత్తు గోవిందరావుపేట మండలం నార్లాపూర్ వద్ద మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే.

08/06/2016 - 02:15

బాన్సువాడ, ఆగస్టు 5: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ వృథాగా సముద్రంలో కలుస్తున్న లక్ష టిఎంసిల నీటిని ఉపయోగించేందుకు ప్రాజెక్టులను చేపడితే, స్వార్థ రాజకీయాల కోసం ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు.

08/06/2016 - 02:14

ఎల్లారెడ్డి, ఆగస్టు 5: జిల్లాలోని అన్ని ఎస్టీఓల పరిధిలోప్రతి ఒక్క ఫించన్ దారుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని డిటిఓ (జిల్లా ఖజానా అధికారి) ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక ఎస్టీఓ కార్యాయలయం డిటిఓ 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన ఫించన్ దారుల, మెంటెనేన్స్ ఫండ్‌కు సంబందించిన పూర్తి రికార్డుల వార్షిక తనిఖీని చేశారు. అనంతరం ఆయన విలేఖరులతోమాట్లాడారు.

08/06/2016 - 02:14

బాల్కొండ, ఆగస్టు 5: తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన ప్రధాన కాల్వల్లో ఒకటైన కాకతీయ కాల్వకు అధికారులు నీటి విడుదలను పెంచి వదులుతున్నారు. గురువారం వరకు 3000వేల క్యూసెక్కుల వరనీటిని విడుదల చేయగా, శుక్రవారం 6వేల క్యూసెక్కులకు పెంచి విడుదల చేస్తున్నారు.

08/06/2016 - 02:13

నిజాంసాగర్, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోనికి నీటిని తీసుకు వచ్చేందుకు సిఎం కెసిఆర్ భగీరథ ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్ట్ 12 వరద గేట్ల వద్దగల గుల్‌గస్తు గార్డెన్‌ను ఆయన పరిశీలించారు.

08/06/2016 - 02:13

బోధన్, ఆగస్టు 5:బోధన్ పట్టణంలోని వివిధ వార్డులలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీల నాయకులు ధర్నా చేశారు. మున్సిపల్, ఆర్‌అండ్‌బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు.

08/06/2016 - 02:12

వినాయక్‌నగర్, ఆగస్టు 5: తెలంగాణలో రైతాంగానికి రుణాలు అందించడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని టిడిపి జిల్లా అధ్యక్షుడు అర్కల నర్సారెడ్డి ఘాటుగా విమర్శించారు. శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో రైతులకు ఏకకాలంలో రుణాలు అందించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

08/06/2016 - 02:12

ఇందూర్, ఆగస్టు 5: రాళ్లు, రప్పలు ఉన్న ప్రభుత్వ భూముల్లో కమ్యూనిటీ భాగస్వామ్యంతో బ్లాక్ ప్లాంటేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ యోగితారాణా తెలిపారు. తెలంగాణకు హరితహారం కింద ప్రతి మండలంలో కనీసం లక్ష మొక్కలు నాటేందుకు అనువైన, వివాదరహిత సాగుకు యోగ్యంగా కాని ప్రభుత్వ భూములను గుర్తించాలని తహశీల్దార్లకు సూచించారు.

08/06/2016 - 02:10

సికింద్రాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే పార్టీ అని మాజీమంత్రి, టిడిపి నగర ఇన్‌చార్జ్ ఇ.పెద్దిరెడ్డి, టిడిపి సెంట్రల్ కమిటీ ప్రధానకార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం నగర టిడిపి కార్యాలయంలో ఖైరతాబాద్ నియోజకవర్గ టిడిపి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

Pages