S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 07:36

న్యూఢిల్లీ, జూలై 17: విశిష్టాద్వైత తత్త్వవేత్త, వైష్ణవ భక్తి ఉద్యమసారధి భగవద్రామానుజుల సహస్రాబ్ది సందర్భంగా హైదరాబాద్‌లో నెలకొల్పనున్న ఆయన భారీ పంచలోహ విగ్రహ ఆవిష్కరణకు రావలసిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి ఆహ్వానించారు. ఆదివారం ఆయన ప్రధానిని కలిసారు.

07/18/2016 - 07:21

చార్మినార్, జూలై 17: సింగరేణి కాంట్రా క్టు కార్మికులు వేతనాల కోసం చేస్తున్న డిమాండ్ న్యాయమైనదని, చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాల సాధనకు అండగా ఉంటామని టిజెఎసి చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు.

07/18/2016 - 07:20

హైదరాబాద్, జులై 17: సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న కాశ్మీర్ వేర్పాటు వాదులను అరెస్టు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్. అయ్యప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

07/18/2016 - 07:19

హైదరాబాద్, జూలై 17:ఎల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి సామర్థ్యంతో నిండనున్నది. దీంతో ముంపు బాధితులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వారం రోజుల్లో చెల్లించాలని నిర్ణయించారు.

07/18/2016 - 07:18

హైదరాబాద్, జూలై 17: హరిత హారంలో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో కోటి మొక్కలు నాటుతారు. ఇందుకోసం అటవీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాల వారిగా అటవీ ప్రాంతాల్లో, రిజర్వ్ ఫారెస్ట్‌లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రణాళిక అమలు కోసం అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్ని జిల్లాల్లో ఇప్పటికే పర్యటించారు.

07/18/2016 - 07:18

న్యూఢిల్లీ, జూలై 17: గుజరాత్, పంజాబ్, ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం మూడు ఓ మోస్తరు భూప్రకంపనలు సంభవించాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల 24 నిమిషాల సమయంలో పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 4.6 పాయింట్ల తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్, దేశ రాజధాని డిల్లీ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది.

07/18/2016 - 07:17

బాటన్ రోజ్, జూలై 17: లూసియానా రాష్ట్రం బాటన్ రోజ్ పట్టణంలో ఆదివారం ఓ సాయుధ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించారు. ఆగంతకుడు ఆకస్మికంగా జరిపిన ఈ మెరుపుదాడిలో పలువురు అధికారులూ గాయపడ్డారని నగర మేయర్ కిప్ హోల్డెన్ తెలిపారు.

07/18/2016 - 07:16

హైదరాబాద్, జూలై 17: తెలంగాణలో ఉగ్రవాద ఖైదీలున్న జైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ జైళ్లశాఖను కోరింది. దీంతో చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్ జైళ్లలో అధికారులు భద్రతను మరింత పెంచారు. గతంలో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. వీరి విచారణ ముగిసేదాకా వీరిని ఇతర జైలుకు మార్చవద్దని ఎన్‌ఐఏ కోరింది.

07/18/2016 - 07:15

హైదరాబాద్, జులై 17: హైకోర్టు విభజన అంశంలో జోక్యం చేసుకోవాలని తెలంగాణ న్యాయవాదులు కొందరు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారుదత్తాత్రేయను కోరారు. బిజెపి రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ రవీంద్ర విశ్వనాథ్ నేతృత్వంలో పలువురు న్యాయవాదులు ఆదివారం కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిసి వినతి పత్రం సమర్పించారు.

07/18/2016 - 07:10

హైదరాబాద్, జూలై 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015 సంవత్సరంలో ట్రాఫిక్ ఉల్లంఘనల కింద వాహనదారుల నుంచి రూ. 44.69 కోట్లను పెనాల్టీ కింద వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ హైకోర్టుకు తెలిపింది. ఈ ఏడాది ఇంతవరకు అంటే జనవరి 1వ తేదీ నుంచి జూన్ వరకు రూ. 16.83 కోట్లను పెనాల్టీ కింద వసూలు చేశామని కోర్టుకు ఏపి ప్రభుత్వం తెలిపింది.

Pages