S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 03:47

న్యూఢిల్లీ, జూలై 17: పెట్టుబడులపై విదేశీ మదుపరుల ఆలోచనా సరళి మారినట్లుంది. గత నెల వరకు దేశీయ రుణ మార్కెట్ల కంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) ఆసక్తి కనబరిచినది తెలిసిందే. అయతే ఈ నెల మొదలు స్టాక్ మార్కెట్లతోపాటు రుణ మార్కెట్లలోనూ పెట్టుబడులకు మొగ్గు చూపారు.

07/18/2016 - 03:45

న్యూఢిల్లీ, జూలై 17: భారత్‌లో వ్యాపార నిర్వహణ కష్టంగా ఉందని ఎయిర్‌ఏషియా సిఇఒ షా ఇమ్రాన్ అహ్మద్ అన్నారు. దేశీయ విధానాలు, స్వార్థ ప్రయోజనాలే ఇందుకు కారణమన్న ఆయన భారత్‌లో తమ వ్యాపారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ ఎయిర్‌ఏషియా వృద్ధి మందగమనాన్ని సమర్థించుకున్నారు.

07/18/2016 - 04:10

మల్కాజిగిరి, జూలై 17: ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం రాత్రి మల్కాజిగిరి గౌతంనగర్‌లో నిర్వహించిన ఘటం ఎదుర్కోళ్లతో బోనాల జాతరకు ఇక్కడ అంకురార్పణ జరిగింది. మల్కాజిగిరిలోని చారిత్రత్మకమైన శ్రీ ఉజ్జయినీ మహంకాళీ బోనాలు జాతర జూలై 31న సామూహిక బోనాలు సమర్పణ, ఆగస్టు 1 సోమవారం రంగం భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

07/18/2016 - 03:44

కెపిహెచ్‌బికాలనీ, జూలై 17: బాలానగర్ మండలం శంషీగూడ గ్రామం సర్వే 57 ప్రభుత్వ భూమి అనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయని, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ఇక్కడ భూములను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు.

07/18/2016 - 03:44

నార్సింగి, జూలై 17: చారిత్రత్మకమైన గోల్కొండ కోటపైన ఉన్న శ్రీజగదాంభిక మహాంకాళీ దేవాలయంలో అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. ఆదివారం అమ్మవారికి నాల్గవ పూజను ఘనంగా నిర్వహించారు. ఉదయమే అమ్మవారి ఆలయం కమిటీ సభ్యులు గోవింద్‌రాజ్‌తో పాటు స్థానిక నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు ఏర్పాట్లు చేశారు.

07/18/2016 - 03:43

వికారాబాద్, జూలై 17: ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండెన్స్ సంతకం చేసి ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తారా అని వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావుసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారని అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు.

07/18/2016 - 03:42

జీడిమెట్ల, జూలై 17: హరిత తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. ఆదివారం బాచుపల్లి గ్రామం రేణుక ఎల్లమ్మ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కెపి వివేక్ సర్పంచ్ ఆగం పాండుతో కలిసి మొక్కలను నాటారు.

07/18/2016 - 03:41

శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్‌ను గ్రీన్ హైదరాబాద్‌గా మార్చుకోవడానికి అందరూ భాగస్వాములు కావాలని నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కోరారు. టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మియాపూర్‌లోని శ్రీ చైతన్య మహిళా కళాశాల ఆవరణలో ఆదివారం చేపట్టిన హరితహారానికి డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

07/18/2016 - 03:41

ఖైరతాబాద్, జూలై 17: శ్రీనగర్‌కాలనీ వైపు నుంచి పంజాగుట్ట వైపుకు వెళ్లే శ్రీనగర్‌కాలనీ చౌరస్తాలో ఉన్న రైట్ టర్న్‌ను ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. జూబ్లీహిల్స్, కృష్ణానగర్, ఎల్లారెడ్డిగూడ, యూసఫ్‌గూడ ప్రాంతాల నుంచి శ్రీనగర్‌కాలనీ మీదుగా పంజాగుట్ట వెల్లే వాహనాలు గతంలో ఇక్కడి చౌరస్తా ఉన్న రైట్ టర్న్ గుండా పంజాగుట్ట ప్రధాన రహదారిలోకి ప్రవేశించారు.

07/18/2016 - 03:40

ఖైరతాబాద్, జూలై 17: మూడవ అంతస్తులోని బాల్కానీ నుంచి కిందపడి ఓ 18 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన సత్యనారాయణ రహమత్‌నగర్‌లో నివాసం ఉంటూ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో విధులు నిర్వహిస్తుంటాడు. ఇతనికి ఇద్దరు కుమారులు సాయి (5), యతీష్ వెంకట్ (18నెలలు) ఉన్నారు.

Pages