S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 17:11

ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో మంగళవారం మార్పులు, చేర్పులు చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో ‘ఇంతకీ మాకెన్ని పదవులిస్తారు?’- అంటూ శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నిస్తున్నారు. మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో శివసేన కూడా భాగస్వామి పార్టీ కావడంతో క్యాబినెట్ మార్పులపై ఉద్ధవ్ ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఉద్ధవ్ ప్రశ్నలతో బిజెపి నాయకులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు.

07/04/2016 - 17:11

హైదరాబాద్: హరితహారం రెండోదశలో ప్రజలందరికీ ఉచితంగా మొక్కలు అందజేసేలా ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. హరితహారంపై ఆయన సోమవారం అధికారులతో మాట్లాడుతూ, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పొడవునా ఒకేరోజు భారీసంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. పూలు, పండ్లు, ఔషధ మొక్కలను గ్రామగ్రామాన అందజేయాలని ఆదేశించారు.

07/04/2016 - 17:10

మహబూబ్‌నగర్: అధికార తెరాస పార్టీలో సిఎం నుంచి కార్యకర్తల వరకూ అందరూ దళారుల్లా వ్యవహరిస్తూ రైతులను నట్టేట ముంచేస్తున్నారని కాంగ్రెస్ నేత దమోదర రాజనర్సింహ అన్నారు. ఆయన సోమవారం బిజినేపల్లి మండలంలో వట్టెం జలాశయం ముంపు రైతులతో సమావేశమయ్యారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు డికె అరుణ, దామోదర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

07/04/2016 - 17:07

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మెహనరావు జూబ్లీహిల్స్ ప్రాంతంలో అక్రమంగా కట్టిన కట్టడాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చేశారు. తన ఇంటి ముందు భాగంలో రోడ్డుమీద అక్రమంగా కంభంపాటి నిర్మాణం చేస్తున్న విషయాన్ని స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు.

07/04/2016 - 17:03

ముంబై: సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు రోజంతా లాభాల్లోనే పయనించాయి. సెన్సక్స్ 134 పాయింట్ల లాభంతో 27,279 దగ్గర,నిఫ్టీ 42.పాయింట్ల లాభంతో 8,371దగ్గర క్లోజయ్యాయి. మరోవైపు బులియన్ మార్కెట్లో పసిడి మెరుపులు కొనసాగుతున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10.గ్రా. బంగారం ధర 365 రూపాయల లాభంతో 31,828 దగ్గర ఉంది.

07/04/2016 - 15:05

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ సచివాలయంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడి నుంచి ఫోన్ రావడంతో పోలీసులు ఆ భవనాన్ని బాంబు స్క్వాడ్‌తో విస్తృతంగా గాలించారు. ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం రాత్రి బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చింది. ఈ సందర్భంగా అనిరుధ్ ఘోష్ అనే 52 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

07/04/2016 - 15:05

చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో పోలీసులు అరెస్టు చేసిన రామ్‌కుమార్‌కు ఇక్కడి ఎగ్మూర్ కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన రామ్‌కుమార్ ప్రస్తుతం రాయ్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో ఆయన నుంచి మెజిస్ట్రేట్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

07/04/2016 - 15:04

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఐసిస్ తీవ్రవాదులు సృష్టించిన నరమేధం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఆదివారం జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య సోమవారం ఉదయం నాటికి 213కు చేరింది. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

07/04/2016 - 15:04

హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చేవరకూ ఆందోళనను విరమించే ప్రసక్తి లేదని తెలంగాణ లాయర్ల జెఎసి నేతలు సోమవారం తేల్చి చెప్పారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు నేతృత్వంలో జెఎసి నేతలు గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. సమ్మె విరమించాలని ఈ సందర్భంగా గవర్నర్ విజ్ఞప్తి చేసినప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని జెఎసి నేతలు పట్టుబట్టారు.

07/04/2016 - 14:45

ముంబై: సోమవారం దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత ఈక్విటీ మార్కెట్ సూచీలు వరుసగా 6వ సెషన్ లో కూడా దలాల్ స్ట్రీట్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ఇంతకు ముందు ఐదు సెషన్లలో 747 పాయింట్లు లాభపడిన ప్రారంభంలో 200 పాయింట్లకు పైగా లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 27,315 దగ్గర సెన్సెక్స్ స్థిరంగా ట్రేడవుతోంది.

Pages