S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 17:34

బీజింగ్‌: కుండపోత వర్షాల కారణంగా చైనాలో యాంగ్‌ట్జె నదికి వచ్చిన వరదల్లో 180 మంది మృతి చెందారు. రైల్వేలైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రహదారులను మూసివేశారు. ఏడు ప్రావిన్సుల్లో 10 నుంచి 50 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురిసింది. తీవ్రమైన గాలులు వీచాయి. 33మిలియన్ల మంది ప్రజలు అవస్థలు పడగా, 45మంది ఆచూకీ గల్లంతైంది. జుయిఝూ ప్రావిన్స్‌లో మట్టిపెళ్లలు విరిగిపడి 23మంది మృతి చెందారు.

07/04/2016 - 17:34

దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డిమాండ్‌ ఎక్కువవడంతో వెండి ధర విపరీతంగా పెరుగుతోంది. వరుసగా ఆరో రోజు సోమవారం ధర పెరగడంతో 28 నెలల గరిష్ఠానికి చేరుకుంది. సోమవారం రూ. 2,155 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,715గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. బంగారం ధర కూడా నేడు స్వల్పంగా పెరిగింది. రూ.

07/04/2016 - 17:15

హైదరాబాద్: దేశ వ్యతిరేకులైన ఉగ్రవాదులకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ఇస్తున్నారని తెలంగాణ న్యాయవాదుల జెఎసి ప్రతినిధులు సోమవారం ఇక్కడి మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. నగరంలో ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన ఐసిస్ సానుభూతిపరులకు న్యాయ సహాయం చేస్తామని ఓవైసీ అనడం బాధ్యతారాహిత్యమని లాయర్లు పేర్కొన్నారు.

07/04/2016 - 17:14

విజయవాడ: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న 20 మంది ప్రభుత్వ వైద్యులకు మూడేళ్లపాటు ఇంక్రిమెంట్లు నిలిపివేయాలని ఎపి సర్కారు నిర్ణయించింది. విశాఖ, విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కొందరు సీనియర్ డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు వీరిపై ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది.

07/04/2016 - 17:14

విజయవాడ: రోడ్ల విస్తరణ, కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్ల పేరిట పురాతన ఆలయాలను కూల్చివేయడం ఈ రాష్ట్రానికే అరిష్టం అని పలువురు స్వామీజీలు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతపై వారు ఈరోజు సిఎం చంద్రబాబును కలిసి తమ మనోభావాలను తెలిపారు. తమ అభిప్రాయాలను విన్నాక సిఎం సానుకూలంగా స్పందించారని, పుష్కరాల విషయమై తమతో సంప్రదించేందుకు సుముఖత చూపారని స్వామీజీలు తెలిపారు.

07/04/2016 - 17:13

లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో యుపిలో అపుడే రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. విపక్ష పార్టీల నేతలను తమవైపు తిప్పుకునేందుకు బిజెపి అగ్రనాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా బిజెపిలో అప్నాదళ్ పార్టీ విలీనమైంది. లోక్‌సభలో ఇద్దరు ఎంపీల బలం ఉన్న ఈ పార్టీకి వారణాసి, మీర్జాపూర్ ప్రాంతంలో ఓబిసీలు, కూర్మి కులస్థుల్లో కొంత పట్టు ఉంది.

07/04/2016 - 17:13

చిత్తూరు: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ రైతు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించడం ఇక్కడ సంచలనం కలిగించింది. ఎస్‌ఆర్ పురం మండలం పిల్లిగుండ్లపల్లికి చెందిన కృష్ణయ్య అనే రైతు కలెక్టరేట్‌లోని ఫిర్యాదుల విభాగానికి సోమవారం ఉదయం వచ్చాడు. తన వద్ద ఉన్న నిద్రమాత్రలు మింగేసి ఆత్మహత్యకు యత్నించాడు. అధికారులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కృష్ణయ్యకు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు.

07/04/2016 - 17:13

విశాఖ: ఆధ్యాత్మిక, విద్యాసంస్థలతో ప్రాముఖ్యత సంతరించుకున్నందున పుట్టపర్తిలోని ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజు హామీ ఇచ్చారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచాలని అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఇక్కడ అశోక్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

07/04/2016 - 17:12

గుంటూరు: సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా రైల్‌రోకో నిర్వహించిన పలువురు నేతలపై కేసులను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుత రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజా, పలువురు కాంగ్రెస్, వైకాపా నేతలపై కూడా రైల్వే కేసులను కొట్టివేశారు.

07/04/2016 - 17:12

తిరుపతి: మూడు వేల రూపాయల విలువ చేసే శ్రీవారి బ్రేక్ దర్శనం టిక్కెట్లను బెంగళూరుకు చెందిన భక్తులకు 33 వేల రూపాయలకు బ్లాకులో విక్రయించిన టిటిడి ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. పలువురు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో దర్శనం టిక్కెట్లు బ్లాకులో అమ్మేసిన ఉద్యోగిని వలపన్ని పట్టుకున్నారు.

Pages