S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 08:14

ఆదోని, జూలై 3: రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి విదేశాల్లో పర్యటనలు చేస్తూ విదేశీ సంస్థలను దేశంలోకి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్న నేతలు రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను తెరిపించడానికి తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. నేతల చిన్న చూపుచేస్తున్న వాటిలో టెక్స్‌టైల్స్ పరిశ్రమ ఒక్కటి. ఇప్పుడు టెక్స్‌టైల్స్ పరిశ్రమ ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొంటోంది.

07/04/2016 - 08:11

రాజమహేంద్రవరం, జూలై 2: గోదావరి నదికి జలకళ సంతరించుకుంది. అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం వద్ద గంట గంటకూ నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. శనివారం రాత్రి కాటన్ బ్యారేజ్ వద్ద 8.5 అడుగుల నీటి మట్టం నమోదైంది. 1,24,255 క్యూసెక్కుల నీటిని సముద్రంలోనికి విడుదల చేశారు.

07/04/2016 - 08:09

తిరుపతి, జూలై 2: ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాలో సహకరించిన వారికి, పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు తప్పవని ఆ దిశగా చట్టాలు రూపొందించడం జరిగిందని, వీటిపై ప్రతి అధికారి అవగాహన పెంచుకోవాలని రాయలసీమ డి ఐజి ప్రభాకర్‌రావు, అర్బన్ ఎస్పీ జయలక్ష్మిలు అన్నారు.

07/04/2016 - 08:05

చక్రాయపేట, జూలై 2: జిల్లాలో ప్రసిద్ధిచెందిన శ్రీ గండి వీరాంజనేయస్వామి సహాయ కమిషనర్‌గా పట్టెం గురుప్రసాద్ సోమవారం పదవీబాధ్యతలు చేపట్టారు. తొలుతగా దేవస్థాన సిబ్బంది పట్టెం గురుప్రసాద్‌కు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో దేవస్థానానికి ఇన్‌ఛార్జిగా పనిచేస్తుండేవారని, ప్రస్తుతం రెగ్యులర్ సహాయ కమిషనర్‌గా నివేదికలు అందాయని, పదవీ బాధ్యతలు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.

07/04/2016 - 08:03

పెనుకొండ, జూలై 2 : ప్రభుత్వంతోపాటు స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు.

07/04/2016 - 08:03

అనంతపురం సిటీ, జూలై 2: దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఉగ్రవాదుల కదలికలు జిల్లాలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు నగరంలో శనివారం నుండి ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు తీవ్రంగా ఉన్నట్లు ఇంటిలిజెన్సీ సమాచారంతో జిల్లాలో కూడా పలుచోట్ల పోలీసులు తనిఖీలను చేపట్టారు.

07/04/2016 - 08:02

అనంతపురం, జూలై 2 : జిల్లావ్యాప్తంగా విచ్చలవిడిగా మద్యం అక్రమ విక్రయాలు, ఎమ్మార్పీకి మించి అధిక ధరలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ నిద్రమత్తులో జోగుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. జిల్లాలో అనంతపురం, పెనుకొండ ఎక్సైజ్ (యూనిట్లు) ఉన్నాయి. వీటి పరిధిలో 238 మద్యం దుకాణాలు ఉన్నాయి.

07/04/2016 - 08:02

అనంతపురం సిటీ, జూలై 2: జిల్లాను సస్యశ్యామలంగా చేయడానికి హంద్రీనీవా ప్రాజెక్టును పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. శనివారం స్థానిక రెవిన్యూ భవన్‌లో హంద్రీనీవా పనులు పురోగతి, భూసేకరణ పనులపై హంద్రీనీవా ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

07/04/2016 - 08:01

తలుపుల, జూలై 2: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని రాష్ట్ర బిజెవైఎం అధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన మండల బిజెపి కార్యకర్తల సమావేశానికి ఆయనతోపాటు దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, బిజెపి నాయకులు రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.

07/04/2016 - 08:01

అనంతపురంటౌన్, జూలై 2: నగరంలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగానున్న గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శనివారం కార్పొరేషన్ అధికారులు మార్కింగ్ ఇవ్వటానికి యత్నించటంతో అధ్యాపక బృందం అడ్డుతగిలారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌ను ఇకపై ఎంతమాత్రమూ అన్యాక్రాంతం కానివ్వబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే కాలేజీ మైదానంలో విద్యుత్ సబ్ స్టేషన్, చేపల మార్కెట్ కోసం ఆక్రమించటంతో విలువైన ఆస్తులను కోల్పోయామని అన్నారు.

Pages