S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 12:26

హైదరాబాద్: రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో తెలంగాణలో కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒక మోస్తరు వర్షాలు కురియడంతో తెలంగాణ జిల్లాల్లో రైతులు పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. హైదరాబాద్‌లో రెండు మూడు రోజులుగా చిరుజల్లులు కురుస్తున్నందున వాతావరణం బాగా చల్లబడింది.

07/04/2016 - 08:27

కందుకూరు, జూలై 3: కందుకూరు నియోజకవర్గంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగాను ఉమ్మడి ఏపిలో తనదైన శైలిలో రాష్టవ్య్రాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన మహీధర్‌రెడ్డి ప్రస్తుత పయనమెటు అని నియోజకవర్గ ప్రజలతోపాటుగా రాష్టవ్య్రాప్తంగా చర్చ జరుగుతోంది. మానుగుంట ఆదినారాయణరెడ్డి వారసత్వంగా ఈ నియోజకవర్గ రాజకీయాలతో మహీధర్‌రెడ్డికి అవినాభావ సంబంధం ఉంది.

07/04/2016 - 08:26

ఒంగోలు,జూలై 3:తీవ్ర వర్షాభావం, ప్రతికూల పరిస్థితులతో సతమతవౌతున్న అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు రుణఉపశమన పథకం ఎంతో ఊరటనిస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నలను కొంతవరకైనా గట్టేక్కించేందుకు ఈ పథకం తోడ్పడుతుంది.

07/04/2016 - 08:26

దర్శి, జూలై 3 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలో మైనార్టీలకు పెద్దపీఠ వేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖా మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. ఆదివారం దర్శి పట్టణంలో రంజాన్ తోఫా సరుకులను లబ్థిదారులైన మైనార్టీలకు మంత్రి అందజేశారు.

07/04/2016 - 08:25

ఒంగోలు అర్బన్,జూలై 3:లయన్స్‌క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షునిగా ఈదా సుధాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆదివారం స్థానిక గోల్డ్‌మర్చంట్స్ అసోసియేషన్ హాలులో లయన్స్‌క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ నూతన కార్యవర్గ ప్రమాణాస్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మొదటి జిల్లా గవర్నర్ నామినేని మోహన్‌రావు, ఒంగోలు డిఎస్‌పి గుంటుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

07/04/2016 - 08:24

వంగర, జూలై 3: గత కొన్ని రోజులుగా తుపాను ప్రభావం వల్ల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మడ్డువలస గొర్లె శ్రీరాములనాయుడు ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతుంది. ఆదివారం వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి వచ్చిన నీటిని ప్రాజెక్టు మెయిన్ రెండు గేట్లు నుంచి 26,500 క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నట్టు ప్రాజెక్టు సిబ్బంది తెలిపారు.

07/04/2016 - 08:21

నర్సీపట్నం,జూలై 3: దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. పి.ఆర్.టి.యు. ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కృష్ణా ఫ్యాలెస్‌లో ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

07/04/2016 - 08:20

విశాఖపట్నం, జూలై 3: దేశ, విదేశాల్లో ఉగ్రవాదుల చర్యలు పేట్రేగిపోతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఎటువంటి సంఘటనలు తలెత్తుతాయో తెలియక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటువంటి సంఘటనలు పోలీసు వర్గాలను సైతం కలవరపరుస్తున్నాయి. అందువల్ల ముందస్తు చర్యలతోనే వీటిని సమర్ధవంతంగా ఎదుర్కోగలమనే ఆలోచనతో పటిష్ఠ భద్రతాచర్యలు చేపడుతున్నాయి. ఫలితంగా ఆంధ్ర రాష్ట్రంలో హైఅలెర్ట్ కొనసాగుతోంది.

07/04/2016 - 08:17

నెల్లూరు టౌన్, జూలై 3: గతంలో ఎన్నడూ లేని విధంగా నీటిపారుదల రంగానికి టిడిపి ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయించిందని జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆదివారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అధ్యక్షతన నిర్వహించారు.

07/04/2016 - 08:16

ఆత్మకూరు, జూలై 3: వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిస్తే, జిల్లాలో విత్తన ధాన్యం అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ ముందస్తు జాగ్రత్తలు అస్పష్టం. ఎప్పటి మాదిరిగా ఘోర వైఫల్యం చెందే పరిస్థితులు ఈ ఏడాది కూడా పునరావృతమవుతాయా లేక పరిస్థితుల్లో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది వ్యవసాయశాఖనుద్దేశించి రైతాంగం నుంచి వినవస్తున్న విజ్ఞప్తి. రెండేళ్ల క్రితం యూరియా కోసం జిల్లా రైతాంగం నానా అగచాట్లు పడ్డారు.

Pages