S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 07:39

రామాయంపేట, జూలై 3: పూరిగుడిసె మట్టి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. హృదయ విదారకరమైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున మెదక్ జిలజూల్లా రామాయంపేట మండలంలోని నగరం గిరిజన తండాలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం...తండాకు చెందిన బానోతు లాలు-కలీ తమ గుడిసెలో ముగ్గురు పిల్లలు చిట్టి (9), చందు (7), గీత (4)తో కలిసి ఉంటున్నారు. శనివారం కురిసిన వర్షానికి మట్టిగోడలు తడిసి ముద్దయ్యాయి.

,
07/04/2016 - 07:36

నల్లగొండ, జూలై 3: ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టులో అంతర్భామైన నక్కలగండి రిజర్వాయర్ పనులకు సమీప ముంపు గ్రామాల ప్రజలు పదేపదే అడ్డుతగులుండడం వివాదాస్పదమవుతోంది. పరిహారం నిర్ధారణ, చెల్లింపుల్లో ఇరిగేషన్ శాఖ తీరును తప్పుబడుతూ ముంపు గ్రామాలైన నక్కలగండి, మోత్యాతండా, తేల్ధేవర్‌పల్లి, మహాబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని మర్లపాడు, కేశ్యనాయక్ తండావాసులు తరుచూ పనులను అడ్డుకుంటూ పరిహారంపై పేచీ పెడుతున్నారు.

07/04/2016 - 07:30

హైదరాబాద్, జులై 3: ఉగ్రవాదులకు న్యాయ సహయం అందిస్తామని ప్రకటించిన మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని, లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.

07/04/2016 - 07:29

హైదరాబాద్, జులై 3: రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, భగీరథ నీటి పారుదల ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. టెండర్ల విధానానికి ముఖ్యమంత్రి కెసిఆర్ బ్రేక్ వేసి తన ఇష్టం వచ్చిన వారికి అప్పగిస్తున్నారని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

07/04/2016 - 07:28

హైదరాబాద్, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వానికి, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితికి మధ్య ‘టగ్ ఆఫ్ వార్’ ప్రారంభమైంది. గణేశ్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు విధించడం సరికాదని, విగ్రహాలు, వాటికి ఉపయోగించే రంగుల విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి వ్యతిరేకిస్తోంది. అసలు మతసంబంధమైన అంశాల్లో ప్రనుత్వం జోక్యం చేసుకోవడాన్ని సమితి పూర్తిగా వ్యతిరేకిస్తోంది.

07/04/2016 - 07:28

నల్లగొండ, జూలై 3: కృష్ణా పుష్కరాల పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు అవసరమైనంత సంఖ్యలో అర్చక పండితులు లేకపోవడం నల్లగొండ జిల్లాలో సమస్య్యగా మారింది. ఆగస్టు 12 నుండి 23 వరకు జరిగే ఈ పుష్కరాలకు కోటి మందికి పైగా భక్తులు జిల్లా పరిధిలోని ఘాట్‌లకు రావచ్చని భావిస్తున్నారు.

07/04/2016 - 07:27

హైదరాబాద్, జూలై 3: అమెరికాలో ఉంటున్న తెలుగువారి సామాజిక స్పృహ, బాధ్యత స్ఫూర్తిదాయకమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. అమెరికాలోని చికాగోలో జరుగుతున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆటా మహిళా విభాగం ప్రతినిధులు బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు.

07/04/2016 - 07:24

న్యూఢిల్లీ, జూలై 3: ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి 250వ జన్మదినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఆంధ్ర-తెలంగాణ భవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. కళాజ్యోతి వాగ్గేయకార కళాపీఠం అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో త్యాగరాజ స్వామి పంచకృతులను డా. వై రమాప్రభ, కుసుమకుమారి ఆలపించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు కె.శివప్రసాద్ గారి ఈలపాటలు అందర్నీ అకట్టుకొన్నాయి.

07/04/2016 - 07:24

హైదరాబాద్, జూలై 3:రవాణా శాఖలో ఐటి సేవలను మరింతగా పెంచనున్నట్టు , ప్రజలకు మరింత చేరువ అవుతామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ ట్రయల్ బ్లేజర్ అవార్డును హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియా టుడే రాష్ట్ర రవాణా శాఖకు ప్రదానం చేసిన సందర్భంగా రవాణా శాఖ కమీషనర్ మంత్రిని కలిశారు.

07/04/2016 - 07:15

విజయవాడ, జూలై 3: ప్రతి నెలా మొదటి ఆదివారం హ్యాపీ సండే పేరుతో నగరంలో నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతోపాటు నగర ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని ఆనందంగా గడుపుతున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ, శాప్‌తో పాటు డీప్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యపీ సండే కార్యక్రమం పెద్దసంఖ్యలో ఆదరణ లభించడంతో పాటు నగర ప్రజలు ఆదివారాన్ని ఆనందమయంగా గడుపుతున్నారు.

Pages