S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/02/2016 - 04:00

మేడిపల్లి, జూలై 1: మండలంలోని విలాయతబాద్‌కు చెందిన పూదరి బీమరాజం (52) అనే వృద్ధుడిపై మంత్రాల నెపంతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గత నెల 28న కత్తుల దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన బీమరాజం చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంత్రాల చేస్తున్నాడనే నెపంతో గత నెల 28న బీమరాజంపై అదే గ్రామానికి చెందిన బత్తుల గంగాధర్, బత్తుల రాజు దాడి చేయగా తీవ్రగాయాల పాలయ్యాడు.

07/02/2016 - 03:59

కరీంనగర్, జూలై 1: నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సిరిసిల్లలో కలపకుండా కరీంనగర్ జిల్లాలోనే ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. దశాబ్దాల చరిత్ర కలిగి శాతవాహనులు ఏలిన జిల్లా ఆధ్యాత్మిక, భక్తిప్రపత్తులతో వాసికెక్కింది.

07/02/2016 - 03:58

రామడుగు, జూలై 1: దేశంలో ఎక్కడా ఉగ్రవాదులు దాడులు జరిగినా హైదరాబాద్‌కు సంబంధాలు ఉన్నాయని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కట్ట రవీందర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందని, గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఉగ్రవాదులు చెలరేగి పోతున్నారన్నారు.

07/02/2016 - 03:58

సిరిసిల్ల, జూలై 1: విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కారణంగా ఓసి కులాలలోని రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ కులాలలోని పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని జిల్లా ఓసి జెఎసి అధ్యక్షులు చెన్నమనేని పురుషోత్తంరావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం టిఎస్ ఓసి జెఎసి విద్యార్థి (యువసేన) ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.

07/02/2016 - 03:55

జనగామ టౌన్, జూలై 1: జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా శాంతియుతంగా సాగిన ఉద్యమం ఉద్రిక్త స్థాయికి చేరుకుంది. ధర్నాలు, నిరసనలతో ఇన్నాళ్లు ఆందోళన చేసిన ఉద్యమకారుల ఆగ్రహం కట్టలు తెంచుకొని విధ్వంసానికి దారితీసింది. శుక్రవారం జిల్లా సాధన ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ పలు విధ్వంసాలతో విజయవంతమైంది.

07/02/2016 - 03:54

వరంగల్, జూలై 1: ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించడంలో డిప్యూటీ సిఎం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విఫలమయ్యారని ఆరోపిస్తూ శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ఇంటి ముట్టడికి విఫలయత్నం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని విద్యార్థులను అడ్డుకున్నారు.

07/02/2016 - 03:53

వడ్డేపల్లి, జూలై 1: గత కొన్ని రోజులుగా హైకోర్టు విభజన అంశంలో జరుగుతున్న న్యాయ వివాదంలో ఇరు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్ తక్షణమే చొరవ తీసుకుని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు.

07/02/2016 - 03:53

నక్కలగుట్ట, జూలై 1: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫారెస్ట్రీ, పర్యావరణానికి సంబందించిన కోర్సులను ప్రారంభించడానికి ప్రణాళికలను తయారుచేయాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు సీతారాంనాయక్ సూచించారు. శుక్రవారం ఆయన గతంలో పని చేసిన బాటనీ విభాగాన్ని సందర్శించి బాటనీ విభాగం అద్యాపకులతో సమావేశం అయ్యారు.

07/02/2016 - 03:52

నక్కలగుట్ట, జూలై 1: యువత తమ శక్తి సామర్థ్యాలపై నమ్మకాలతో ముందుకు వెళితే విజయం సాధించడం సులభం అవుతుందని పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు అన్నారు. శుక్రవారం జెఎన్‌ఎస్ మైదానంలో పోలీసు విభాగంలో సబ్ ఇన్స్‌పెక్టర్ల నియామక ప్రిలిమినరి పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులకు పలురకాల పరీక్షలు నిర్వహించారు.

07/02/2016 - 03:51

నర్సంపేట, జూలై 1: నర్సంపేట నియోజకవర్గంలో రూ. 480 కోట్లతో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని టిఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు.

Pages