S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/02/2016 - 04:17

మోర్తాడ్, జూలై 1: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రిపుల్ ఆర్ పథకంలో మంజూరు పొందిన మోర్తాడ్ ములసమ్మ చెరువుకు మహర్దశ పట్టే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ముసల్మను ట్రిపుల్ ఆర్‌లో ఎంపిక చేసి దాదాపు కోటీ 35లక్షల రూపాయల వరకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ నిధులు మాత్రం విడుదల కాలేదు. పరిపాలన పరమైన అనుమతులు కూడా రానట్లు అధికారవర్గాల సమాచారం.

07/02/2016 - 04:15

కోటగిరి, జూలై 1: జిల్లాల పునర్ విభజనలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్ మండలాలు కామారెడ్డి జిల్లాలో కలుపుతుండగా, కోటగిరి, వర్ని మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

07/02/2016 - 04:14

భిక్కనూరు, జూలై 1: మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో 3కోట్లతో నిర్మిస్తున్న గిడ్డంగుల నిర్మాణాన్ని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం పరిశీలించారు. గిడ్డంగి నిర్మాణ పనులు ఏ విధంగా సాగుతున్నాయని వివరాలను అడిగి తెలుసుకున్నారు.

07/02/2016 - 04:14

ఆర్మూర్, జూలై 1: ఆర్మూర్ పట్టణ నడిబొడ్డున హత్యకు గురైన తలారి సత్యం, చేపూర్ రవి కేసులో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణపై సిఐడి విచారణ తూతూ మంత్రంగా సాగుతోందని జెఎసి నాయకుడు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఆర్మూర్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/02/2016 - 04:12

కుభీర్, జూలై 1: గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలు ఊతమిచ్చినట్లయింది. తీవ్ర కరువు ప్రభావానికి మండే ఎండలు తోడుకావడంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు వట్టిపోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరిగినట్లు మండల వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

07/02/2016 - 04:11

చెన్నూర్, జూలై 1: చెన్నూర్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెదెపా జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్ మాట్లాడుతూ ప్రత్యేక హై కోర్టు కావాలని చేస్తున్న న్యాయమూర్తుల సమ్మెకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తెలిపారు. న్యాయమూర్తుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమండ్ చేశారు.

07/02/2016 - 04:10

శ్రీరాంపూర్ రూరల్, జూలై 1: శ్రీరాంపూర్ డివిజన్‌లో జూన్ ముగింపు నాటికి 100శాతం బొగ్గు ఉత్పత్తి సాదించడం జరిగిందని శ్రీరాంపూర్ డీవైజీ ఎం (పర్సనల్) బీవీవీ ఎస్ ఎస్ ఎస్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 38.48 లక్షల టన్నులకు గాను, 38.43లక్షల టన్నులు సాదించినట్లు ఆయన తెలిపారు.

07/02/2016 - 04:10

భీమిని, జూలై 1: మండలంలోని కనె్నపెల్లి పంచాయతీని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కనె్నపెల్లి గ్రామానికి చెందిన యువకుడు అతిమేన సురేష్ (22) శుక్రవారం నాటి ట్యాంకు పైకి ఎక్కి నిరసన తెలిపాడు. అధికారులు, నాయకులు మండల ఏర్పాటుపై స్పందించడం లేదని, నూతన మండల ఏర్పాటుకు ఎమ్మెల్యే, ఎంపిలు హామీ ఇస్తేనే ట్యాంకు పై నుంచి దిగుతానని భీష్మించుకు కూర్చున్నాడు.

07/02/2016 - 04:09

ఆదిలాబాద్ రూరల్, జూలై 1: జిల్లా ప్రజలు సంఘ విద్రోహశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. వచ్చే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్పీ మాట్లాడుతూ పండగలను శాంతియుత వాతావరణంలో సామరస్యంగా జరుపుకోవాలని అన్నారు.

07/02/2016 - 04:09

ఆదిలాబాద్ టౌన్, జూలై 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ రెండేళ్ల పాలనలో అభివృద్ది చేసింది శూన్యమని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ అన్నారు. శుక్రవారం బిసి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన బిజెపి పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

Pages