S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/02/2016 - 08:08

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు జరుగుతున్న కౌనె్సలింగ్‌లో ఇంత వరకూ 1,04,500 మంది హాజరుకావల్సి ఉన్నా కేవలం 63777 మంది మాత్రమే హాజరయ్యారు. ఎమ్సెట్‌లో 1,04,500 మంది అర్హత సాధించారు. 80వేల ర్యాంకు వరకూ 50,563 మంది హాజరుకాగా, 80001 నుండి 92000 ర్యాంకు వరకూ కేవలం 6953 మంది హాజరయ్యారు. 92001 ర్యాంకు నుండి 1,04,500 ర్యాంకు వరకూ 6631 మంది హాజరయ్యారు.

07/02/2016 - 08:07

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, జులై 1: మన దేశానికి చెందిన 463 మంది మత్స్యకారులు సహా మొత్తం 518 మంది ఖైదీలు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. వీరి జాబితాను పాకిస్తాన్ శుక్రవారం భారత్‌కు అందజేయగా, మన జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల జాబితాను భారత అధికారులు దాయాది దేశానికి అందజేశారు.

07/02/2016 - 08:05

ముంబయి, జులై 1: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. 2012 ఏప్రిల్ 24వ తేదీన తాము కారులో వెళ్తున్నప్పుడు షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియా తన కుమార్తెపై కూర్చుని ఆమె గొంతు నులిమిందని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ శ్యామవర్ రాయ్ ఆరోపించాడు.

07/02/2016 - 08:05

థానే, జూలై 1: ఏటిఎం ఆఫీసుపై దాడి చేసి 9.16 కోట్ల రూపాయలు లూటీ కేసును మహారాష్ట్ర పోలీసులు ఛేదించారు. ముఠాలో ఆరుగురని థానే పోలీసులు అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి 3.12 కోట్ల రూపాయలు రికవరీ చేశారు. ఏటిఎంలలో నగదు నింపే ఆఫీసుపై జూన్ 28 తెల్లవారుజామున దోపిడీ ముఠా దాడి చేసింది. లూటీలో 15 మంది వరకూ పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

07/02/2016 - 08:03

బస్తీ (ఉత్తరప్రదేశ్), జూలై 1: ఏడాదిలో వస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మూడింట రెండొంతుల మెజారిటీతో బిజెపి విజయం సాధించడం ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. పదిహేనేళ్లపాటు వంతులవారీ అధికారాన్ని అందుకున్న సమాజ్‌వాది, బహుజన్ సమాజ్‌వాది పార్టీలు భ్రష్టుపట్టుకుపోయాయని, ఆ పార్టీలకు ఇక కాలం చెల్లిందన్నారు.

07/02/2016 - 08:00

డెహ్రాడూన్, జూలై 1: ఉత్తరాఖండ్‌లోని ఎగువ పర్వత ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన కుండపోత వర్షాలకు వివిధ ప్రాంతాల్లో సంభవించిన ప్రమాదాల్లో కనీసం 15 మంది చనిపోగా, వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. పర్వత ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాలకు పితోర్‌గఢ్, చమోలీ జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆ జిల్లాల ప్రజలు నానా అ వస్థలు పడుతున్నారు.

07/02/2016 - 07:54

బెంగళూరు, జూలై 1: స్వదేశీ యుద్ధ విమానం ‘తేజాస్’ శుక్రవారం భారత వైమానిక దళంలో చేరింది. ఈ తేలిక పాటి పోరాట విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) అభివృద్ధి చేసింది. బెంగళూరులోని హెచ్‌ఏఎల్ వైమానిక శిక్షణా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో వైమానిక దళం దక్షిణ విభాగం అధిపతి జస్బీర్ వాలియా సమక్షంలో రెండు తేజాస్ విమానాలను హెచ్‌ఏఎల్ వైమానిక దళానికి అప్పగించింది.

07/02/2016 - 07:44

న్యూఢిల్లీ, జూలై 1: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలోని క్రికెట్ కమిటీలో తన పదవికి భారత మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ డైరెక్టర్ రవి శాస్ర్తీ రాజీనామా చేశాడు. ఎంతో కీలకమైన మీడియా ప్రతినిధిగా అతను కొనసాగుతున్నాడు. తాను పూర్తి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని, క్రికెట్ కమిటీలో కొనసాగడం కష్టమవుతుందని అతను ఒక ప్రకటనలో తెలిపాడు.

07/02/2016 - 07:42

న్యూఢిల్లీ, జూలై 1: న్యూజిలాండ్‌తో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఒక దానిని డే/నైట్ మ్యాచ్‌గా ఆడతామని ఇంతకు ముందు ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) యుటర్న్ తీసుకుంది. ఆ సిరీస్‌లో డే/నైట్ టెస్టు ఉండే అవకాశం లేదని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించాడు.

07/02/2016 - 07:41

బెంగళూరు, జూలై 1: టెస్టు క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోనీ గుడ్‌బై చెప్పడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడం అనుకున్నంత సులభం కాదని వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే టీమిండియాకు ఎంపికైన వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. అతని స్థానం భర్తీ కావడం కష్టమని అన్నాడు.

Pages