S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/02/2016 - 04:08

నిర్మల్, జూలై 1: రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన డ్రైవింగ్ లైసెన్సును శుక్రవారం పునరుద్దరించుకున్నారు. నిర్మల్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి స్వయంగా వెళ్లి వివరాలను అధికారులకు అందజేశారు. సాధారణ పౌరుల మాదిరిగానే ఫోటో దిగి సంతకం చేసి లైసెన్సును రెన్యువల్ చేసుకున్నారు.

07/02/2016 - 04:07

బాసర, జూలై 1: జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వసతి గృహానికి చేరుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.

07/02/2016 - 04:06

బెజ్జూరు, జూలై 1: మండలంలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వానలు కురుస్తుండటంతో జన జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. బెజ్జూరు మండలంలోని కుష్నపల్లి, కుకుడ, బెజ్జూరు వాగులు వర్షాల వల్ల ఉప్పొంగాయి. కుష్నపల్లి, కుకుడ వాగులు ఉప్పొంగడంతో సుమారు 15 గ్రామాల ప్రజలకు రవాణా సంబంధాలు తెగిపోయాయి. బాహ్య ప్రపంచానికి దూరంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

07/02/2016 - 04:05

ఆదిలాబాద్, జూలై 1: వచ్చే నెల 11 నుండి రెండవ విడత హరితహారానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని, ఇందుకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు గావించాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు.

07/02/2016 - 04:03

కరీంనగర్, జూలై 1: ‘పచ్చ’దనమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 8నుంచి రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి, రెండువారాల పాటు నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించడంతో జిల్లా అధికార యంత్రాంగం హరితహారంపై అంతా సిద్ధం చేసుకుంటోంది.

07/02/2016 - 04:03

వేములవాడ, జూన్ 1: హైదరాబాద్ ఐటి కారిడార్, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలకు సమీపంలో బాంబులతో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ సానుభూతి పరులు కుట్రపన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో రాష్ట్రంలో హై అలర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

07/02/2016 - 04:02

మంథని, జూలై 1: ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ నీతూప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంథని పట్టణంలోని కణ్యక పరమేశ్వరి కల్యాణ మండపంలో జరిగిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

07/02/2016 - 04:02

కరీంనగర్ టౌన్, జూలై 1: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించే దాకా తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్త ఉద్యమాలు కొనసాగిస్తామని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు అన్నారు. ఉచిత విద్యుత్ పేర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేసి ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం ట్రాన్స్‌కో ఎఈ కార్యాలయాన్ని ఆపార్టీ కార్యకర్తలు ముట్టడించి, ధర్నా చేశారు.

07/02/2016 - 04:01

కరీంనగర్ టౌన్, జూలై 1: ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ మరిచి, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇష్టారాజ్యంగా విద్యుత్ చార్జీలను పెంచటం అప్రజాస్వామికమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కనపల్లి కుమార్ విమర్శించారు. పెరిగిన విద్యుత్ ధరలను నిరసిస్తూ శుక్రవారం ఆపార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.

07/02/2016 - 04:00

గోదావరిఖని, జూలై 1: సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు కార్మికులు, అధికారులు మరింత కృషి చేయాలని ఆర్జీ-1 ఇన్‌చార్జి సిజిఎం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖనిలోని సిజిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన జూన్ మాసపు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. సమావేశంలో పర్సనల్ మేనేజర్ మంచాల శ్రీనివాస్, డిజి ఎం ప్రసాద్, రాజేశ్వర్ రావు తదితరులున్నారు.

Pages