S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/02/2016 - 07:41

లండన్, జూలై 1: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అగ్నీస్కా రద్వాన్‌స్కా ఇక్కడ జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ టైటిల్‌పై అశలు పెట్టుకుంది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి టైటిల్ సాధించిన రెండో ర్యాంక్ క్రీడాకారిణి గార్బినె ముగురుజా రెండో రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించడంతో రద్వాన్‌స్కా విజయావకాశాలు మెరుగుపడ్డాయి.

07/02/2016 - 07:40

మార్సెల్లీ, జూలై 1: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో పోర్చుగల్ అతి కష్టం మీద సెమీ ఫైనల్స్ చేరింది. పోలాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యంకాగా, పోలాండ్ 5-3 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభమైన మరుక్షణమే దాడికి ఉపక్రమించిన పోలాండ్‌కు రెండో నిమిషంలోనే రాబర్ట్ లావెండోవ్‌స్కీ గోల్‌ను సంపాదించిపెట్టాడు.

07/02/2016 - 07:34

మాస్కో, జూలై 1: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని తనకు ఇవ్వాలని కోరుతూ అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్)కు రష్యా పోల్‌వాల్టర్ ఎలెనా ఇసిన్బయేవా దరఖాస్తు చేసుకుంది. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతున్నదన్న కారణంగా రష్యాను ఒలింపిక్స్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనితో ఆ దేశానికి చెందిన అథ్లెట్లు ఐఒసి పతాకం కింద పోటీపడాల్సి ఉంటుంది.

07/02/2016 - 05:07

వరంగల్/ మహబూబ్‌నగర్, జూలై 1: దసరానాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో సర్కారు కసరత్తు చేస్తుంటే, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జిల్లాలు ఏర్పాటు తగదంటూ నిరసనలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా కొద్దిరోజులుగా సాగుతున్న నిరసనలు శుక్రవారం హింసాత్మక సంఘటనలుగా మారాయి.

07/02/2016 - 05:14

హైదరాబాద్, జూలై 1: హరితహారం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజోద్యమంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో విద్యార్థి నుంచి సిఎం వరకు అందరూ పాల్గొనాలన్నారు. సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో హరితహారంపై సిఎం సమీక్ష నిర్వహించారు.

07/02/2016 - 04:59

హైదరాబాద్, జూలై 1: తెలంగాణలో వౌలిక వసతుల ప్రాజెక్టులకు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టెందుకు మలేసియా ప్రభుత్వానికి చెందిన కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్డ్(సిఐడిబి) సంసిద్ధత వ్యక్తం చేసింది. మలేషియా పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు శుక్రవారం పలు కీలక సంస్థలతో సమావేశం అయ్యారు. సిఐడిబి సిఇఓ అబ్దుల్ లతీఫ్ హిటామ్‌తో సమావేశం అయ్యారు.

07/02/2016 - 04:58

హైదరాబాద్, జూలై 1: హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్లను నిరసిస్తూ సాగుతోన్న తెలంగాణ న్యాయ పోరాటం కొత్తమలుపు తిరిగింది. హైకోర్టు విభజనపై జరుగుతున్న ఆందోళన అంశంలో చొరవ తీసుకోవడం లేదనే విమర్శలకు తెరదించే ప్రయత్నం గవర్నర్ నుంచి మొదలైంది.

07/02/2016 - 04:56

న్యూఢిల్లీ, జూలై 1: స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటిసారి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రజలు అందరికీ ఒకే చట్టం అమలు చేసేందుకు రంగం సిద్ధంచేస్తోంది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ఎన్డీయే సిద్ధం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.

07/02/2016 - 04:17

ఇందూర్, జూలై 1: స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిజామాబాద్‌ను సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా రూపొందించేందుకు చేపట్టిన చర్యలు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయ సంఘాలు, ఉద్యోగులు సమష్టిగా గ్రామ పంచాయతీలను యూనిట్లుగా తీసుకుని ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వాటి వినియోగం పట్ల కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నారు.

07/02/2016 - 04:16

బాల్కొండ, జూలై 1: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి 2వేల క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలోని నిజామాబాద్, నాందేడ్, ఆదిలాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షం కారణంగా వరదనీరు వచ్చి చేరడంతో శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 1046.80అడుగులు 4.92టిఎంసిలకు చేరుకుందని ప్రాజెక్టు ఎఇ మోహన్ తెలిపారు.

Pages