S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 18:29

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో లైఫ్‌స్టైల్ యజమాని కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన పరమాన్నం ఇచ్చి 1.33 కోట్లతో ఉడాయించిన నకిలీ బాబా శివకుమార స్వామిని, అతడికి సహకరించిన మరో ఇద్దరి బెంగళూరులో అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. అరెస్టు చేసిన ఆ ముగ్గురినీ మీడియా ముందు హాజరుపరిచారు. పరారైన మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.

06/17/2016 - 18:28

విశాఖ: గుర్తింపు లేదన్న సాకుతో ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడం సరికాదని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. పాఠశాలలు తెరిచాక విద్యాశాఖ అధికారులకు నిబంధనలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు.

06/17/2016 - 18:28

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు ఇంట్లో శుక్రవారం కాపు నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, దాసరి నారాయణరావు, సి.రామచంద్రయ్య, వైకాపా నేత బొత్స సత్యనారాయణ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పించేలా సిఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని వీరు విజ్ఞప్తి చేశారు.

06/17/2016 - 18:27

దిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగించినా కష్టపడి పనిచేస్తానని దిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ అన్నారు. యుపి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమెను సిఎం అభ్యర్థిగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటిస్తుందన్న ప్రచారం నేపథ్యంలో షీలా స్పందించారు. యుపిలో పార్టీని గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ ఆదేశిస్తే తనకు శిరోధార్యమన్నారు.

06/17/2016 - 18:27

విశాఖ: పాడేరు ఎఎస్పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై సమీక్షించేందుకు ఎపి డిజిపి జెవి రాముడు శుక్రవారం ఇక్కడికి వచ్చారు. విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ యోగానంద్‌లతో కలిసి ఆయన ఎఎస్పీ మృతిపై పూర్వపరాలను సమీక్షించారు. ఎఎస్పీ మృతిపై సిఎం చంద్రబాబు సిబిసిఐడి విచారణకు ఆదేశించడంతో డిజిపి ఈ సమీక్ష జరిపారు.

06/17/2016 - 18:26

హైదరాబాద్: నష్టాల నుంచి బయటపడని పక్షంలో ఆర్టీసీని మూసివేస్తామని సిఎం కెసిఆర్ అనడం సరికాదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఆర్టీసీని గాడిలో పెట్టడానికి బదులు సిఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికులకు తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.

06/17/2016 - 18:26

కాకినాడ: తుని వద్ద కాపుగర్జన సందర్భంగా జరిగిన విధ్వంసకాండలో పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులకు బెయిల్ మంజూరైంది. పిఠాపురంలోని అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గాయత్రి శుక్రవారం నాడు వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

06/17/2016 - 18:08

చిత్రదుర్గ (కర్ణాటక): వర్షాల కోసం ఓ బాలుడిని నగ్నంగా వూరేగించిన ఘటన చిత్రదుర్గ జిల్లాలోని పందరహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. వర్షాలు కురియకపోవడంతో వరుణదేవున్ని ప్రార్థించేందుకు గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓ బాలుడికి మెడలో పూలమాల వేసి, నుదుట కుంకుమ పూసి నగ్నంగా వూరేగించారు. కొన్నేళ్లుగా గ్రామంలో ఇదే విధంగా వర్షాల కోసం వరుణదేవున్ని పూజిస్తున్నామని చెబుతున్నారు.

06/17/2016 - 17:36

కరీంనగర్ : ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నైజీరియన్ దేశస్తుడితోపాటు ఏడుగురు సభ్యుల ముఠాను కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఘరానా మోసాలకు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి రూ.6.70 లక్షల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

06/17/2016 - 17:33

శ్రీనగర్‌ : రంజాన్ నెల కావడంతో శ్రీనగర్‌లో శుక్రవారం ప్రార్థనల తర్వాత వేర్పాటు వాద గ్రూపులకు చెందినవారు పాకిస్తాన్ పతాకాలు, ఐసీస్‌ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఏర్పడడంతో పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు.

Pages