S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 23:14

శ్రీకాకుళం(రూరల్), జూన్ 17: కాపు రిజర్వేషన్ సాధనకు ఉద్యమిస్తున్న ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా శుక్రవారం జిల్లా తెలగసంక్షేమ సంఘం అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశ్‌రావు తన నివాసం వద్ద నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1966వరకు కాపు కులానికి రిజర్వేసన్లు ఉండేవని అనంతరం తొలగించిన వాటినే పునరుద్ధరించమంటున్నామే తప్ప కొత్తగా రిజర్వేషన్ కల్పించమనడం లేదని పేర్కొన్నారు.

06/17/2016 - 23:13

ఎచ్చెర్ల, జూన్ 17: రాష్టవ్రిభజన తర్వాత శివారుగానున్న శ్రీకాకుళం జిల్లాలోగల వనరులను అభివృద్ధిలోకి తీసుకువచ్చి ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికతో ముందుకుసాగుతోంది. రణస్థలం మండలంలోని కొవ్వాడ సమీపంలో అణుపార్కు నిర్మాణానికి, అలాగే పోలాకి సమీపంలో ధర్మల్ పవర్‌ప్లాంటు ఏర్పాటుకు భూసర్వేలు జోరందుకొన్నాయి.

06/17/2016 - 23:12

శ్రీకాకుళం, జూన్ 17: పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలకు బ్యాంకుల సహకారం ఉండాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం కోరారు. మండల స్థాయిలో ప్రతినెలా జరిగిన సమావేశాలకు బ్యాంకు అధికారులు హాజరై ఎంపిడివోలతో సమన్వయం చేసుకొని రుణాల రికవరీకి ప్రయత్నం చేయాలన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు.

06/17/2016 - 23:12

పాలకొండ(టౌన్), జూన్ 17: ఉపాధి హామీ పథకానికి టిడిపి నాయకులు తూట్లు పొడుస్తున్నారని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన పాలవలస రాజశేఖరం నివాసగృహంలో విలేఖర్లతో మాట్లాడారు. లక్షలాది మందికి జీవనాధారమైన పథకంలోని నిధులను ఆ పార్టీ కార్యకర్తలు జేబులు నింపేందుకు ప్రస్తుతం జరుగుతున్న నీరు-చెట్టు పనులు అవినీతికి అడ్డాగా నిలిచాయన్నారు.

06/17/2016 - 23:12

ఒక్క పదం - అర్థాలెన్నో..
-రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
వెల: రూ.140/-
ప్రతులకు: నవచేతన
పబ్లిషింగ్ హౌస్
ప్రజాశక్తి బుక్ హౌస్
అన్ని బ్రాంచీలలో

06/17/2016 - 23:11

బలగ, జూన్ 17: జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపికలు ఈనెల 28నుండి 30వరకు నిర్వహిస్తున్నట్టు కో ఆర్డినేటర్ బి.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నార్త్‌జోన్ క్రికెట్ టోర్నమెంట్ జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు పర్యవేక్షణలో ఈ ఎంపికలు ఈనెల 19న ఆదివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరుచుకోవాలని కోరారు.

06/17/2016 - 23:09

The Third Voice
(తృతీయ స్వరం)
(కవితాసంకలనం)
-కంచర్ల శ్రీనివాస్
వెల: రూ.40/-
ప్రతులకు: రచయిత
ఇం.నెం.11-10-703/8
బురహాన్‌పురం, ఖమ్మం
9346611455

06/17/2016 - 23:06

వివేకచూడామణి
(శ్రీశంకరాచార్యులవారి)
-స్వామి మాధవానంద
వెల: రూ.100/-
ప్రతులకు: పేర్నేటి గంగాధరరావు
శ్రీసిరి పబ్లిషర్స్,
డోర్ నెం.21-122/10
బచ్చుపేట,
మచిలీపట్నం-521 001
09247566401

06/17/2016 - 23:02

నాలుగు దశాబ్దాల జర్నలిస్టు జీవితం దేవులపల్లి అమర్‌ది. డేట్‌లైన్ హైదరాబాద్ పేరుతో నడుస్తున్న రాజకీయాన్ని అక్షరీకరించారు. ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కీలక సమయంలో కీలక స్థానాలకు దగ్గరగా ఉన్న జర్నలిస్టు దేవులపల్లి అమర్. వైఎస్‌రాయ్ క్యాంపు మొదలుకొని ప్రతి కీలక పరిణామంలో దగ్గరి నుంచి చూసిన వారు తెరవెనుక వ్యవహారాలు తెలిసిన వారు.

06/17/2016 - 22:59

ఈ ‘నీలపు దీపం’ కథలు చదువుతూ వుంటే, మన మిత్రలాభం, మిత్రభేదం కథలు జ్ఞాపకం వస్తాయి. అన్నీ జంతువులు సంభాషించుకుంటున్న కథలే. మన కథల్లోలాగానే కోడిపుంజులూ, సింహాలూ, ఎలుకలూ, ఏనుగులూ మానవ భాషలో మాట్లాడుకుంటాయి. ఈ నీలపు కథలు జాకబ్ (1785-1863) విల్వెల్మ్ గ్రిమ్ (1786-1859) జర్మనీకి చెందిన భాషావేత్తలు, సాంస్కృతిక పరిశోధకులు గ్రిమ్ సోదరులుగా ప్రసిద్ధికెక్కిన వీరు జానపద కథలను సేకరించి ప్రచురించారు.

Pages