S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 12:11

రాంచీ: ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లా పతర్‌చప్రా అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం సిఆర్‌పిఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోలు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఆ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్ ప్రారంభించారు. ఇంతలో మావోలు ఒక్కసారిగా కాల్పులు జరపగా ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. జవాన్లు వెంటనే తేరుకుని కాల్పులు ప్రారంభించగా మావోలు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

06/17/2016 - 12:11

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకునేందుకు ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు నగర శివారులో తనిఖీలను ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం గగన్‌పహాడ్ వద్ద 23 బస్సులను, హయత్‌నగర్, పెద అంబర్‌పేట వద్ద 20 బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.

06/17/2016 - 12:10

గాంధీనగర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ కేసులో 11 మంది దోషులకు న్యాయస్థానం యావజ్జీవ జైలుశిక్ష విధించింది. గుజరాత్‌లోని గుల్బర్గ్‌లో 2002లో జరిగిన హత్యాకాండలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. హత్యలు చేసినట్లు రుజువైనప్పటికీ అంతకుముందు ఎలాంటి నేరచరిత్ర లేనందున ఈ 11 మందికి ఉరిశిక్ష వేయలేకపోతున్నట్లు కోర్టు పేర్కొంది.

06/17/2016 - 12:09

హైదరాబాద్: ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమిపూజ జరిగింది. బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాగా, ఖైరతాబాద్‌లో విగ్రహం ఎత్తును తగ్గించాలని పోలీసులు ఒత్తిడి తేవడాన్ని తాము సహించేది లేదని భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ హెచ్చరించింది.

06/17/2016 - 12:08

హైదరాబాద్: తెలంగాణ టెట్- 2016 పరీక్షా ఫలితాలను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. టెట్ పేపర్ 1లో 54.45 శాతం మంది, పేపర్ 2లో 24.04 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

06/17/2016 - 12:08

హైదరాబాద్: స్కూల్ ఆవరణలో బస్సును రివర్స్ చేస్తుండగా దాని కింద ప్రమాదవశాత్తూ పడి నాలుగేళ్ల విద్యార్థి మరణించాడు. ఈ విషాదం చింతల్ వద్ద వివేకానందనగర్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ బస్‌ను రివర్స్ చేస్తుండగా ఎల్‌కెజి విద్యార్థి జశ్వంత్ రెడ్డి దాని కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

06/17/2016 - 12:07

మెదక్: పది రూపాయలను దొంగిలించాడని ఆగ్రహం చెందిన ఓ కన్నతండ్రి తన పదేళ్ల కుమారుడిని గొంతు నులిమి చంపేసిన దారుణ ఘటన మెదక్ జిల్లా సదాశివపేట మండలం గొల్లగూడెంలో శుక్రవారం వెలుగు చూసింది. ఆవేశానికి లోనై కొడుకును చంపిన సత్తెయ్యను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

06/17/2016 - 08:44

శ్రీకాకుళం, జూన్ 16: సమాచార హక్కు చట్టం కమిషనర్ ముందు హాజరయినప్పుడు పౌర సమాచార అధికారులు పూర్తి సమాచారంతో హాజరవ్వాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టంకమిషనర్ తాంతియాకుమారి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్టిఐ కోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాచారం అడిగిన ప్రతీ ఒక్కరికీ పిఐవోలు శతశాతం సమాచారం అందించాలన్నారు.

06/17/2016 - 08:43

శ్రీకాకుళం(కల్చరల్), జూన్ 16: భక్తితత్వం పెంపొందించుకుంటే మానసిక ప్రశాంతత పొందడం సులభతరమని ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. జ్యేష్ఠశుద్ధ ఏకాదశి సందర్భంగా స్థానిక బ్యాంకర్స్ కాలనీలోని శివబాలాజీ దేవాలయంలో సప్తమవార్షికోత్సవం పురస్కరించుకొని గురువారం నిర్వహించిన వార్షిక కల్యాణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

06/17/2016 - 08:43

ఎచ్చెర్ల, జూన్ 16: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలను ఈనెల 13,14,15వ తేదీల్లో న్యాక్ బృందం పరిశీలించినట్టు ప్రిన్సిపల్ ఎం.గోవిందరాజులు, వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ బుడుమూరు శ్రీరామమూర్తి స్పష్టంచేశారు.

Pages