S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 16:38

దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో తనను ఇరికించేందుకు బిజెపి రాజకీయ కుట్ర చేస్తోందని అయినా వారికి తాను టార్గెట్ కావడం సంతోషం కలిగిస్తోందని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అన్నారు. హెలికాప్టర్ల కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో రాహుల్‌కు ఉన్న వ్యవహారాలేమిటో విచారణ జరిపించాలని బిజెపి ఎంపి ఒకరు ఆరోపించారు.

05/03/2016 - 16:38

దిల్లీ: అగస్టా-వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై భారత వాయుసేన మాజీ చీఫ్ ఎస్పీ త్యాగిని సిబిఐ అధికారులు రెండోరోజు మంగళవారం కూడా విచారిస్తున్నారు. పదవీ విరమణ చేశాక త్యాగి రెండుసార్లు ఇటలీ వెళ్లి వచ్చారన్న సమాచారంతో ఆయనను సిబిఐ క్షుణ్ణంగా ప్రశ్నిస్తోంది. హెలికాప్టర్ల కుంభకోణంతో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులు, ఇతర అధికారుల గురించి త్యాగిని విచారిస్తున్నారు.

05/03/2016 - 16:38

దిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్ సందర్భంగా భారత ఒలింపిక్ సంఘానికి అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంగీకరించాడు. దేశంలో క్రీడాభివృద్ధికి తనవంతు సాయం చేస్తానని ఆయన భారత ఒలింపిక్ సంఘానికి తెలిపారు. ఒలింపిక్స్ అంబాసిడర్లుగా ఇప్పటికే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ప్రముఖ షూటర్ అభివన్ బింద్రా ఎంపికయ్యారు.

05/03/2016 - 16:36

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ‘నీట్’ (జాతీయ స్థాయి అర్హత పరీక్ష)పై విచారణను సుప్రీం కోర్టు గురువారానికి వాయిదా వేసింది. ‘నీట్’ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలంటూ ఎపి, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, యుపి రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు అందినందున ఈ విషయమై సమాధానం ఇవ్వాలని భారత వైద్య మండలి, సిబిఎస్‌ఇ, కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

05/03/2016 - 16:35

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో పారిశుద్ధ్య విభాగం లారీ డ్రైవర్లు మంగళవారం మెరుపుసమ్మె ప్రారంభించారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, చెత్తలారీలను రాంకీ సంస్థకు అప్పగించరాదని, ప్రభుత్వ ఉద్యోగుల వలే అన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.

05/03/2016 - 14:26

హైదరాబాద్: విడాకులు ఇవ్వకుండానే తన భర్త విజయ్ రెండోపెళ్లి చేసుకున్నాడని సినీనటి పూజిత మంగళవారం ఇక్కడ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎపి ప్రభుత్వంలో ‘శాప్’ ఎండిగా పనిచేస్తున్న రేఖారాణిని తన భర్త గత నెల 29న వివాహం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. పదిహేనేళ్ల క్రితం తాను, విజయ్ పెళ్లి చేసుకున్నామని, తమకు ఒక కుమారుడు ఉన్నాడని ఆమె పేర్కొన్నారు.

05/03/2016 - 14:28

హైదరాబాద్: తెలంగాణలో అనుమతులు లేని సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తే ఆంధ్ర, సీమ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారంటూ తెరాస మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి అనాలోచితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

05/03/2016 - 14:24

హైదరాబాద్: తెలంగాణలో నీటి ప్రాజెక్టుల్ని ఎపి నేతలు అడ్డుకుంటే తాము సహించేది లేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. ఆంధ్రాలో రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాజెక్టులపై వివాదాలను సృష్టించవద్దని, పద్ధతి ప్రకారం వెళదాం.. మేమూ సమస్యల్ని సృష్టించగలమని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. ఎపి సర్కారు చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు అనుమతులున్నాయా? అని ఆయన ప్రశ్నించారు.

05/03/2016 - 14:24

దిల్లీ: తెలంగాణలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులపై ఎపి సిఎం చంద్రబాబు వైఖరి సరికాదని తెరాస ఎంపీలు విశే్వశ్వరరెడ్డి, సీతారాం నాయక్ మంగళవారం ఇక్కడ విమర్శించారు. న్యాయపరంగా తెలంగాణకు దక్కే నీటిని వాడుకునేందుకే కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఎపిలో చేపట్టే పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని అన్నారు.

05/03/2016 - 14:23

విజయవాడ: ఈనెల 27 నుంచి మూడురోజుల పాటు తిరుపతిలో పార్టీ మహానాడు జరపాలని టిడిపి పాలిట్‌బ్యూరో నిర్ణయించింది. ఇక్కడ మంగళవారం టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పాలిట్‌బ్యూరో సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కరవు పరిస్థితులు, నీటిపారుదల ప్రాజెక్టుల వివాదాలు వంటి అంశాలపై మహానాడులో తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది.

Pages