S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 18:04

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టే పాలమూరు, రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టుల వల్ల భవిష్యత్‌లో రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ప్రాజెక్టులను ఆపివేసేలా ఎపి సిఎం చంద్రబాబు గట్టిగా ప్రయత్నించడం లేదన్నారు.

05/03/2016 - 18:04

హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌లో సిఎం కెసిఆర్‌కు స్వార్థ ప్రయోజనాలున్నాయని టి.కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మంగళవారం ఇక్కడ ఆరోపించారు. మహారాష్టల్రో భూములు ముంపునకు గురికాకుండా ఆ రాష్ట్ర సిఎంతో కెసిఆర్ రహస్య ఒప్పందాలు చేసుకున్నారన్నారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందన్నారు.

05/03/2016 - 18:03

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నందున ఎపి సిఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరుల ఇళ్లకు మంచినీరు, పారిశుద్ధ్య సేవలను బంద్ చేయాలని ఓయు విద్యార్థి సంఘనేతలు మంగళవారం విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఉంటూ ఇలాంటి ప్రకటనలు చేయడం ఎపి నేతలకు తగదన్నారు.

05/03/2016 - 16:43

విజయవాడ: ‘ సేవ్ డమొక్రసీ ’ పేరుతో దిల్లీయాత్ర చేసిన వైకాపా అధినేత జగన్ అక్కడ ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళావెంకట్రావు ప్రశ్నించారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఎపికి ప్రత్యేక హోదాపై దిల్లీలో ఉన్నపుడు జగన్ ఎందుకు మాట్లాడలేదన్నారు. పైసా ఖర్చులేకుండా రాజధాని కోసం 34వేల ఎకరాలను సేకరించగా లక్ష కోట్ల రూపాయల కుంభకోణం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

05/03/2016 - 16:42

హైదరాబాద్: వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సిఎం కెసిఆర్ అధికారును ఆదేశించారు. ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లను ఆయన మంగళవారం సమీక్షించారు. నగరంలోని లుంబినీ పార్కులో లేజర్ షో జరిగే ప్రాంతంలో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని భారీస్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

05/03/2016 - 16:42

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తమ దేశం భాగస్వామి అవుతుందని మలేషియా మంత్రి ముస్త్ఫా మహ్మద్ అన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా మాట్లాడుతూ, ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమేనన్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నందున ఎపిలో పారిశ్రామికీకరణకు దండిగా అవకాశాలున్నాయని చంద్రబాబు అన్నారు.

05/03/2016 - 16:42

విజయవాడ: ఎంఆర్‌పి (గరిష్ట చిల్లర ధర) కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎపి ఎక్సయిజ్ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం హెచ్చరించారు. చాలాచోట్ల అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ 200 మంది మద్యం దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు.

05/03/2016 - 16:41

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు టిడిపి అధినేత చంద్రబాబుకు మంగళవారం లేఖ రాశారు. గత శుక్రవారం ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినపుడు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టిడిపి ఎంపీలు సానుకూలంగా మాట్లాడారు.

05/03/2016 - 16:41

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు కొత్త ఎండిగా శివానంద నింబర్గే జూన్ 2న బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ఎండి విబి గాడ్గిల్ వచ్చేనెలలో పదవీ విరమణ చేస్తున్నందున శివానందను నియమించారు.

05/03/2016 - 16:40

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆమెకున్న కోట్లాది రూపాయల ఆస్తులను అమ్మేసి జనం బాధలు తీర్చవచ్చు కదా!.. అని కాంగ్రెస్ ప్రచారకర్త, సినీనటి ఖుష్బూ అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంచీపురం జిల్లా మధురవాయల్‌లో జరిగిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత డిసెంబర్‌లో వరదలు వచ్చినపుడు మధురవాయల్ నియోజకవర్గ ప్రజలను జయలలిత ఆదుకోలేదని ఖుష్బూ ఆరోపించారు.

Pages