S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 14:23

మెదక్: తాను వచ్చిన సమయానికి అధికారులు అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ ముగ్గురు అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఉన్నతాధికారులను ఫోన్‌లో ఆదేశించారు. చేగుంట మండలం నార్సింగిలో ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యకమానికి ఆయన ఆకస్మికంగా వచ్చారు. అక్కడ అధికారులెవరూ లేకపోవడంతో ఆయన ఆగ్రహం చెందారు.

05/03/2016 - 14:22

హైదరాబాద్: ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, మిగతా పార్టీలను అణగదొక్కేందుకు యత్నిస్తున్న తెరాస పార్టీ రాజకీయాలను కలుషితం చేస్తోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. కూకట్‌పల్లిలో మంగళవారం జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెరాస విఫలమైందన్నారు. తెలంగాణ సర్కారు హామీలను తీర్చేవరకూ తాము పోరాడతామన్నారు.

05/03/2016 - 14:22

విజయవాడ: పార్టీలో నేతలు విభేదాలకు స్వస్తి పలికి కార్యకర్తలతో కలిసి పనిచేయాలని టిడిపి అధినేత,సిఎం చంద్రబాబు కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి, శిల్పా మోహనరెడ్డి సోదరులకు గట్టిగా చెప్పారు. బాబు చెప్పినట్లు ఇకముందు కలహాలకు దూరంగా కలిసి పనిచేస్తామని భూమా, శిల్పా సోదరులు ప్రకటించారు. దీంతో నేతల మధ్య వివాదం సద్దుమణిగింది.

05/03/2016 - 14:21

హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి నాయకులు ఏనాడూ పొరుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల గురించి ప్రశ్నించలేదని, అయితే నేడు తెలంగాణ చేపడుతున్న నీటి పథకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు.

05/03/2016 - 14:21

దిల్లీ: ఉత్తరాఖండ్‌లో పదవీచ్యుతుడైన ముఖ్యమంత్రి హరీష్ రావత్ అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ నైనిటాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ‘స్టే’ విధించిన సుప్రీం కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేస్తూ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. సుప్రీం ఆదేశంపై కేంద్రం ఇంకా స్పందించాల్సి ఉంది.

05/03/2016 - 11:57

కరీంనగర్: వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు నెలల బాలుడిని గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లింది. బాబును ఎత్తుకుని ఓ ఆగంతకురాలు వేగంగా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఆలయం బయట సిసి కెమెరాలో రికార్డు అయింది. నల్గొండ జిల్లా బొందుగుల గ్రామానికి చెందిన కనకవ్వ, ఆమె కుటుంబ సభ్యులు రాజన్న సన్నిధికి సోమవారం వచ్చారు.

05/03/2016 - 11:56

బెంగళూరు: దక్షిణ బెంగళూరు ప్రాంతంలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ యువతిని ఎత్తుకెళ్లిన ఘటనలో నిందితుడు అక్షయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గతనెల 23న యువతిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై నిలబడి ఫోన్‌లో మాట్లాడుతున్న 22 ఏళ్ల యువతిని ఓ యువకుడు బలవంతంగా ఎత్తుకుని మోసుకునిపోతున్న దృశ్యాలు టీవీ చానళ్లలో ప్రసారం కావడం సంచలనాన్ని సృష్టించింది.

05/03/2016 - 11:55

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ లైబ్రరీ హాలులో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం, దేశంలో కరవు పరిస్థితులు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

05/03/2016 - 11:55

విజయవాడ: కర్నూలు జిల్లాలో టిడిపి నేతల మధ్య సమన్వయం సాధించేందుకు ఆ పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. పార్టీలో రెండు వర్గాలుగా ఉంటున్న భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి సోదరులు మంగళవారం ఉదయం ఇక్కడ బాబును కలిశారు. పార్టీని బలోపేతం చేసేందుకు వర్గవిభేదాలను పక్కనపెట్టి సమన్వయంతో పనిచేయాలని ఆయన హితవు పలికారని తెలిసింది.

05/03/2016 - 11:54

హైదరాబాద్: కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మంగళవారం ఉదయం ఓ గర్భిణి మరణించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. సకాలంలో వైద్యం అందించకుండా డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

Pages